ఉగ్రదాడి: 13 మంది మృతి | Suicide bomber kills eight at Baghdad ice cream shop | Sakshi
Sakshi News home page

ఉగ్రదాడి: 13 మంది మృతి

Published Tue, May 30 2017 7:56 AM | Last Updated on Tue, Nov 6 2018 8:35 PM

ఉగ్రదాడి: 13 మంది మృతి - Sakshi

ఉగ్రదాడి: 13 మంది మృతి

బాగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో మరోమారు ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. కరాడా సెంట్రల్‌లో గల ఓ ఐస్‌క్రీం పార్లర్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 22 మందికి పైగా గాయాలయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే పార్లర్‌లో ప్రజలే లక్ష్యంగా ఉగ్రదాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాంబు దాడి అనంతరం ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. గాయాలపాలైన వారి ఆర్తనాదాలు, రోదనలతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement