ice cream shop
-
ఐస్‌క్రీమ్‌లో ఫంగస్, పురుగులు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఓ ప్రముఖ ఐస్‌క్రీమ్ షాపులో తాను ఆర్డర్ చేసిన చాక్లెట్ కేక్ ఐస్‌క్రీమ్‌లో ఫంగస్, పురుగులు ఉన్నాయని ఆరోపిస్తూ రంజిత్ ఆకుతోట అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌తో పాటు, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ ఆన్‌లైన్‌కు ట్వీట్ చేశాడు. ఆదివారం రాత్రి తన సోదరుడి బర్త్‌డే సందర్భంగా చాక్లెట్ కేక్ ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేశానని అందులో పురుగులు కనిపించడం చూసి షాక్‌కు గురయ్యామని ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జూబ్లీహిల్స్ పోలీసులు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే సదరు ఐస్‌క్రీమ్ షాపుపై చర్యలు తీసుకుంటామని ట్వీట్టర్ ద్వారా సమాధానం చెప్పారు. -
ఉగ్రదాడి: 13 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో మరోమారు ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. కరాడా సెంట్రల్లో గల ఓ ఐస్‌క్రీం పార్లర్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 22 మందికి పైగా గాయాలయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే పార్లర్లో ప్రజలే లక్ష్యంగా ఉగ్రదాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాంబు దాడి అనంతరం ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. గాయాలపాలైన వారి ఆర్తనాదాలు, రోదనలతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. -
పోలీసును కదా.. తొక్కించేస్తే పోలా!
-
పోలీసును కదా.. తొక్కించేస్తే పోలా!
పోలీసు ఉద్యోగం చేతిలో ఉంది కదా.. ఏం చేసినా చెల్లుతుందని అనుకున్నాడు. డబ్బు తగాదాలు ఉండటంతో ఓ వ్యాపారి మీదకు కారు పోనిచ్చాడు. ఆ వ్యవహారం మొత్తం సీసీటీవీ కెమెరాకు చిక్కింది. దాంతో ముంబైలో పనిచేసే ఆ పోలీసు కానిస్టేబుల్ మీద కేసు నమోదైంది. ముంబై క్రైం బ్రాంచిలో పనిచేసే రమేష్ అవ్తే అనే కానిస్టేబుల్.. ఇటీవల థానె నగరంలో తన కారుతో అతుల్ పెతె అనే వ్యాపారిని తొక్కించేందుకు ప్రయత్నించాడు. వాళ్లిద్దరికీ కలిపి ఒక ఐస్ క్రీం షాపు ఉంది. ఇద్దరూ స్నేహితులే. అయితే ఆర్థిక సంబంధిత విషయాలలో ఇద్దరికీ ఏదో గొడవ వచ్చింది. ఏప్రిల్ 21వ తేదీన రమేష్ అవ్తే.. థానెలోని నౌపడ ప్రాంతంలో ఉన్న పెతె దుకాణానికి వచ్చి అతడిని తిట్టడం మొదలుపెట్టాడు. తర్వాత ఏకంగా తన కారుతో అతడిని తొక్కించేయడానికి ప్రయత్నించి, అతడున్నవైపు కారు పోనిచ్చాడు. అయితే అదృష్టవశాత్తు పెతె ఆ కారు మీదకు ఎక్కి, ప్రాణాలు కాపాడుకున్నాడు. కొంతదూరం అలాగే కారు వెళ్లిపోయింది. దాంతో పెతెకు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రస్తుతానికి అవ్తే మీద కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నారు. -
మెరుస్తాయ్.. మురిపిస్తాయ్..
ఏమిటివి.. చీకట్లో మెరుస్తున్నాయ్.. లైట్లయితే కావు.. ఇవి నియాన్ నిట్రో ఐస్‌క్రీములు.. అయితే.. చీకట్లో లైట్లలా మెరుస్తాయి.. అంటే.. చిమ్మచీకట్లోనూ మనకిష్టమైన ఐస్‌క్రీమ్‌లను లాగించేయొచ్చన్నమాట. ఇవి మనక్కావాలంటే ఆస్ట్రేలియా వెళ్లాల్సిందే. మెల్బోర్న్లోని ‘196 బిలో’ ఐస్‌క్రీమ్ షాపు యజమానులు స్టీవ్ ఫెలీస్, గ్లెన్ స్టోరీలు వీటి సృష్టికర్తలు. స్టీవ్‌కు చిన్నప్పటి నుంచి నియాన్ లైట్లంటే తెగ ఇష్టమట. దీంతో గ్లెన్‌తో కలిసి ఐస్‌క్రీమ్ పార్లర్ ప్రారంభించినప్పుడు ఏదైనా కొత్తగా చేయాలని తలంచాడు. చీకట్లో మెరిసే నియాన్ లైట్లలా.. ఐస్‌క్రీమ్ కూడా మెరిస్తేనో అనుకున్నాడు. అంతే.. ప్రత్యేకమైన యూవీ రియాక్టివ్ ఫుడ్ కలరింగ్ సాయంతో ఈ నియాన్ నిట్రో ఐస్‌క్రీమ్‌లను తయారుచేశాడు. మూడు రకాల ఫ్లేవర్లలో లభిస్తాయి. ఈ ఐస్‌క్రీమ్‌లు తినడంపై భయాలేవీ పెట్టుకోనక్కర్లేదని.. ఆ ప్రత్యేకమైన ఫుడ్ కలరింగ్ సురక్షితమేనని ఆస్ట్రేలియా ప్రభుత్వ విభాగం సర్టిఫికేట్ కూడా ఇచ్చేసింది.