బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఓ ప్రముఖ ఐస్‌క్రీమ్ షాపులో తాను ఆర్డర్ చేసిన చాక్లెట్ కేక్ ఐస్‌క్రీమ్‌లో ఫంగస్, పురుగులు ఉన్నాయని ఆరోపిస్తూ రంజిత్ ఆకుతోట అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌తో పాటు, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ ఆన్‌లైన్‌కు ట్వీట్ చేశాడు. ఆదివారం రాత్రి తన సోదరుడి బర్త్‌డే సందర్భంగా చాక్లెట్ కేక్ ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేశానని అందులో పురుగులు కనిపించడం చూసి షాక్‌కు గురయ్యామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జూబ్లీహిల్స్ పోలీసులు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే సదరు ఐస్‌క్రీమ్ షాపుపై చర్యలు తీసుకుంటామని ట్వీట్టర్ ద్వారా సమాధానం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment