UN Assistance Mission for Iraq
-
కారు బాంబు పేలుళ్లు: 13 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లో 13 మంది మృతి చెందారు. 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ బాగ్దాద్‌లోని బే ప్రాంతంలో రెండు కారు బాంబు పేలుళ్ల సంభవించాయని స్థానిక మీడియా వెల్లడించింది. పేలుళ్ల ధాటికి సమీపంలోని పలు భవనాలు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపింది. ఇటీవల జరిగిన పేలుళ్లలో ఇవి అత్యంత తీవ్రమైనవని పేర్కొంది. గత నెలలో దేశవ్యాప్తంగా తీవ్రవాదులు జరిపిన హింస, దాడుల్లో 1420 ఇరాకీయులు మరణించారని, 1370 మంది గాయపడ్డారని ఇరాక్‌లోని యూఎన్ అసిస్టెంట్స్ మీషన్ ఫర్ ఇరాక్ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
బాంబు పేలుళ్లు: 32 మంది మృతి
బాగ్దాద్: బాంబు పేలుళ్లతో ఇరాక్ రాజధాని బాగ్దాద్ బుధవారం దద్దరిల్లింది. ఆ పేలుళ్లలో 32 మంది మరణించారు. మరో 108 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ హోం శాఖ మంత్రి గురువారం ఇక్కడ వెల్లడించారు. క్షతగాత్రులు బాగ్దాద్‌లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. అయితే ఆ బాంబు దాడులకు పాల్పడింది తామేనంటూ ఇంత వరకు ఎవరు ప్రకటించలేదని పేర్కొన్నారు. దేశంలో చెలరేగిన హింస, తీవ్రవాదం వల్ల ఈ ఏడాది జూలై ఒక్క మాసంలోనే దాదాపు 2 వేల మంది పౌరులు మరణించారని ఇరాక్‌లోని యూఎన్ అసిస్టెన్స్ మిషన్ కార్యాలయం వెల్లడించింది. -
కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన బాగ్దాద్
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. నగరవ్యాప్తంగా మంగళవారం సంభవించిన కారు బాంబు పేలుళ్లలో దాదాపు 22 మంది మృతి చెందారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ఏడాది మొదటి ఆరునెలలో దేశంలో తీవ్రవాదుల దాడులు, హింసలో 5,576 మంది మృతి చెందగా, 11,666 మంది గాయాలపాలైయ్యారని ఇరాక్‌లోని యూఎన్ అసిస్టెంట్ మిషన్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. -
బాగ్దాద్‌లో బాంబు పేలుళ్లు: 27 మంది మృతి
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో నిన్న చోటు చేసుకున్న వేర్వేరు బాంబు దాడులు, కాల్పుల ఘటనల్లో మొత్తం 27 మంది మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం వెల్లడించారు. మరో 70 మంది గాయపడ్డారని, క్షతగాత్రులు బాగ్దాద్‌లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. బాగ్దాద్‌లో నిన్న రాత్రి జరిగిన బాంబు పేలుళ్లలో 15 మంది మరణించారు. వారిలో సింహభాగం సైనికులే అని చెప్పారు. అందులో 45 మంది గాయపడ్డారన్నారు. అలాగే సున్నీ అరబ్ పట్టణంలో తర్మియ ప్రాంతంలో ఇరాక్ ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి చేసిందని వివరించారు. ఆ ఘటన రాత్రి 10.30 గంటలకు చోటు చేసుకుందని తెలిపారు. అలాగే గురువారం ఉదయం బాంబు పేలుళ్లు, వేర్వేరు కాల్పుల ఘటనలో 12 మంది మరణించగా, 23 మంది గాయపడ్డారు. అయితే ఇరాక్‌లో బాంబుపేలుళ్లు, ఆత్మాహుతి దాడులు నిత్యకృత్యం కావడం పట్ల యూఎస్ అసిస్టెంట్స్ మిషన్ ఫర్ ఇరాక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి గత నెల అక్టోబర్ వరకు 7వేల మంది మృత్యువాత పడ్డారని, అలాగే 16 వేల మంది గాయడ్డారని గణాంకాలతో సహా సోదాహరణగా యూఎస్ అసిస్టెంట్స్ మిషన్ ఫర్ ఇరాక్ వివరించింది. -
ఇరాక్‌లో బాంబు పేలుళ్లు: 11 మంది మృతి
ఇరాక్‌లో నిన్న వేర్వేరుగా జరిగిన బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు, ఆగంతకుల తుపాకి కాల్పుల ఘటనల్లో 11 మంది మరణించారని పోలీసులు మంగళవారం ఇక్కడ వెల్లడించారు. మరో 35 మంది గాయపడ్డారని తెలిపారు. స్థానిక పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. కాగా క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పేర్కొన్నారు. మృతులు, గాయపడిన వారిలో భద్రత సిబ్బంది, దేశ పౌరులు ఉన్నారని చెప్పారు. ఇరాక్‌లో నిత్యం ఎక్కడోఅక్కడ రక్తమోడడం పట్ల యూఎన్ మిషన్ అసిస్టెంట్ మిషన్ ఆఫ్ ఇరాక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు ఇరాక్‌లో జరిగిన ఆత్మాహుతి దాడులు, పలు బాంబు పేలుళ్లలో 7 వేల మంది దుర్మణం పాలైయ్యారని, అలాగే 16 వేల మంది గాయాలపాలైయ్యారని యూఎన్ మిషన్ అసిస్టెంట్ మిషన్ ఆఫ్ ఇరాక్ తాజా గణాంకాలతో సహా వివరించింది. -
అక్టోబర్ హింసాకాండలో 979 మంది ఇరాకీయులు మృతి
ఇరాక్‌లోని వివిధ ప్రాంతాల్లో గత నెలలో జరిగిన హింసాకాండలో మొత్తం 979 మంది మరణించారని యూఎన్ అసిస్టెంట్ మిషన్ ఫర్ ఇరాక్ (యూఎన్ఏఎంఐ) శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అయా దుర్ఘటనలల్లో మొత్తం19 వందల మంది గాయపడ్డారని తెలిపింది. మృతుల్లో 852 మంది పౌరులు, 127 మంది భద్రత సిబ్బంది మృత్యువాత పడ్డారని పేర్కొంది. గాయడినవారిలో 1793 మంది పౌరులుకాగ, 109 మంది భద్రత సిబ్బంది ఉన్నారని చెప్పింది. అయితే ఇరాక్ రాజధాని నగరమైన బాగ్దాద్ నగరం విధ్వంసకాండలో అతలాకుతలమైందని వెల్లడించింది. మొత్తం మృతుల్లో సగం మంది బాగ్దాద్ వాసులనే అని పేర్కొంది. అయితే దేశంలో ఏదో ఓ మూల రక్తపాతం జరుగుతునే ఉందని యూఎన్ఏఎంఐ ఆవేదన వ్యక్తం చేసింది. దేశంలో హింసాకాండను కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేయాలని దేశ నాయకులకు యూఎన్ఏఎంఐ ఈ సందర్బంగా విజ్ఞప్తి చేసింది.