బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లో 13 మంది మృతి చెందారు. 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ బాగ్దాద్లోని బే ప్రాంతంలో రెండు కారు బాంబు పేలుళ్ల సంభవించాయని స్థానిక మీడియా వెల్లడించింది. పేలుళ్ల ధాటికి సమీపంలోని పలు భవనాలు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపింది.
ఇటీవల జరిగిన పేలుళ్లలో ఇవి అత్యంత తీవ్రమైనవని పేర్కొంది. గత నెలలో దేశవ్యాప్తంగా తీవ్రవాదులు జరిపిన హింస, దాడుల్లో 1420 ఇరాకీయులు మరణించారని, 1370 మంది గాయపడ్డారని ఇరాక్లోని యూఎన్ అసిస్టెంట్స్ మీషన్ ఫర్ ఇరాక్ ఓ ప్రకటనలో వెల్లడించింది.