ఇరాక్లోని వివిధ ప్రాంతాల్లో గత నెలలో జరిగిన హింసాకాండలో మొత్తం 979 మంది మరణించారని యూఎన్ అసిస్టెంట్ మిషన్ ఫర్ ఇరాక్ (యూఎన్ఏఎంఐ) శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అయా దుర్ఘటనలల్లో మొత్తం19 వందల మంది గాయపడ్డారని తెలిపింది. మృతుల్లో 852 మంది పౌరులు, 127 మంది భద్రత సిబ్బంది మృత్యువాత పడ్డారని పేర్కొంది. గాయడినవారిలో 1793 మంది పౌరులుకాగ, 109 మంది భద్రత సిబ్బంది ఉన్నారని చెప్పింది.
అయితే ఇరాక్ రాజధాని నగరమైన బాగ్దాద్ నగరం విధ్వంసకాండలో అతలాకుతలమైందని వెల్లడించింది. మొత్తం మృతుల్లో సగం మంది బాగ్దాద్ వాసులనే అని పేర్కొంది. అయితే దేశంలో ఏదో ఓ మూల రక్తపాతం జరుగుతునే ఉందని యూఎన్ఏఎంఐ ఆవేదన వ్యక్తం చేసింది. దేశంలో హింసాకాండను కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేయాలని దేశ నాయకులకు యూఎన్ఏఎంఐ ఈ సందర్బంగా విజ్ఞప్తి చేసింది.