బాగ్దాద్ విమాన సర్వీసును ప్రారంభిస్తున్న జీఎంఆర్, ఫ్లై బాగ్దాద్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు
శంషాబాద్: హైదరాబాద్ నుంచి నేరుగా బాగ్దాద్ వెళ్లేందుకు విమాన సర్వీసు ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం 3.17 గంటలకు ‘ఫ్లై బాగ్దాద్ ఎయిర్‌లైన్స్’కు చెందిన ఐఎఫ్–462 టేకాఫ్ తీసుకుని తొలి విమానం బయలుదేరింది. హైదరాబాద్–బాగ్దాద్‌ల మధ్య వారానికి రెండు రోజులు ఈ సర్వీసులు కొనసాగుతాయని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.
ఇక బాగ్దాద్ నుంచి వచ్చేవిమానం ప్రతి ఆదివారం ఉదయం 11.55 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. అదేరోజు మధ్యాహ్నం 12.55 గంటలకు తిరిగి ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. మంగళవారం బాగ్దాద్ నుంచి వచ్చే విమానం ఉదయం 9.55 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. అదేరోజు ఉదయం 10.55 కు ఇక్కడి నుంచి బాగ్దాద్ బయలుదేరుతుంది.
పెరుగుతున్న మెడికల్ టూరిజం
ఏటా ఇరాక్ నుంచి 10 శాతానికి పైగా మెడికల్ టూరిస్టులు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారని పర్యాటక మంత్రిత్వశాఖ చెబుతోంది. అంతేగాక ఇరాక్‌లోని బాగ్దాద్, కర్బలా ప్రాంతాలకు కూడా మనదేశం నుంచి పర్యాటకుల రాకపోకలు పెరిగాయి. ఈ నేపథ్యంలో డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment