బాంబు పేలుళ్లు: 32 మంది మృతి | 32 killed in bomb attacks in Iraq | Sakshi
Sakshi News home page

బాంబు పేలుళ్లు: 32 మంది మృతి

Published Thu, Aug 7 2014 8:21 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM

32 killed in bomb attacks in Iraq

బాగ్దాద్: బాంబు పేలుళ్లతో ఇరాక్ రాజధాని బాగ్దాద్ బుధవారం దద్దరిల్లింది. ఆ పేలుళ్లలో 32 మంది మరణించారు. మరో 108 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ హోం శాఖ మంత్రి గురువారం ఇక్కడ వెల్లడించారు. క్షతగాత్రులు బాగ్దాద్లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు.

అయితే ఆ బాంబు దాడులకు పాల్పడింది తామేనంటూ ఇంత వరకు ఎవరు ప్రకటించలేదని పేర్కొన్నారు. దేశంలో చెలరేగిన హింస, తీవ్రవాదం వల్ల ఈ ఏడాది జూలై ఒక్క మాసంలోనే దాదాపు 2 వేల మంది పౌరులు మరణించారని ఇరాక్లోని యూఎన్ అసిస్టెన్స్ మిషన్ కార్యాలయం వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement