Bomb attacks
-
కన్నీటి వీలునామా
సెప్టెంబర్ 30న గాజాలో ఒక ఇంటి మీద ఇజ్రాయిల్ బాంబు వేసింది. ఆ ఇంటిలోని 10 ఏళ్ల పాప, ఆమె 11 ఏళ్ల సోదరుడు మరణించారు. తల్లిదండ్రులు వారిని అంతిమంగా సాగనంపి పాప నోట్‌బుక్ తెరిస్తే ఈ మరణాన్ని, ఇలాంటి మరణాన్ని ఊహించి, గాజాలో కొంతకాలంగా మరణించిన16,700 మంది పిల్లలతో పాటు తానూ చేరక తప్పదని తెలిసి ఆ పాప నోట్‌బుక్‌లో వీలునామా రాసి వెళ్లింది. ఆ వీలునామాలో తొలి వాక్యం ‘నేను చనిపోతే ఏడ్వొద్దు’ అని.గాజా పసిపిల్లలు జీవించి ఉన్నారంటే వారు చిరంజీవులయ్యారని కాదు. వారి ఊపిరి కాలం పొడిగింప బడిందనే అర్థం. ఇక్కడ చూడండి... జూన్ 10న గాజాలోని ఒక ఇంటి మీద బాంబు జారవిడిచింది ఇజ్రాయిల్. ఆ ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. ఇరుగూ పొరుగూ కలిసి లోపల ఉన్న భార్యాభర్తల్ని వారి కుమారుడు 11 ఏళ్ల అహ్మద్‌ని కూతురు 10 ఏళ్ల రాషాను బయటకు తీసుకొచ్చారు. వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ఇజ్రాయిల్ ఆ ఇంటి మీద బాంబు ఎందుకు వేసింది? కారణం ఏమీ లేదు. మొన్నటి సెప్టెంబర్ 30 వరకూ కూడా ఆ కుటుంబం ఆకలిదప్పులతో వేదనలతో బతికింది. అయితే ఇజ్రాయిల్ తిరిగి సెప్టెంబర్ 30న మరో బాంబు అదే ఇంటి మీద వేసింది. కారణం ఏమిటి? ఏమీ లేదు. కాని దురదృష్టం.. ఈసారి రాషా, ఆమె సోదరుడు అహ్మద్ మృతి చెందారు. (ప్రెగ్నెన్సీ అంటే జోక్ కాదు, నిజాలు ఎవ్వరూ చెప్పరు: రాధిక ఆప్టే కష్టాలు)తల్లిదండ్రులు ఎంతో దుఃఖంతో వారిని సాగనంపి తిరిగి వచ్చాక రాషా నోట్ పుస్తకంలో రాసిన తన వీలునామా కనిపించింది. అప్పటి వరకూ వారికి ఆ చిన్నారి అలాంటి వీలునామా రాసి ఉంటుందని తెలియదు. ఆ పాప అప్పటికే ఎందరో చిన్నపిల్లల మరణాలని చూసింది గాజాలో. మాట్లాడుకుంటుంటే వినింది. కనుక తాను కూడా చనిపోతానని భావించిందో ఏమో నోట్‌బుక్‌లో వీలునామా ఇలా రాసింది.రాషా రాసిన ఈ వీలునామాను ఆమె మేనమామ అసిమ్ అలనబి లోకానికి చూపించాడు. రాషా ఎందుకనో తాను మరణించి తన సోదరుడు బతుకుతాడని ఆశించింది. ఆమె సోదరుడు అహ్మద్ గడుగ్గాయి. అల్లరి చేసినా అందరూ వాణ్ణి ప్రేమించేవారట. గదమాయిస్తూనే దగ్గరికి తీసుకునేవారట. కాని ఆమెతో పాటు ఆ ముద్దుల సోదరుడు కూడా మరణించాడు. గాజాలో రోజూ వందలాది మంది పిల్లలు చనిపోతున్నారు. గాజాలో పిల్లల గుండెల్లో ఎన్ని మూగబాధలు చెలరేగుతున్నాయో దూరంగా నిశ్చింతగా ఉంటూ తమ పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తున్న తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు.ఏ యుద్ధమైనా, ఎటువంటి ద్వేషమైనా, ఏ విషబీజాలైనా, ఎటువంటి వివక్ష అయినా అంతిమంగా ముందు పిల్లల్ని బాధిస్తుంది. పిల్లల్లో ఉండే కరుణను పెద్దలు ఎప్పటికైనా అందుకోగలరా?‘నేను చనిపోతే నా కోసం ఎవరూ ఏడ్వద్దు. ఎందుకంటే మీ కన్నీళ్లు నాకు నొప్పి కలిగిస్తాయి. నా దుస్తులు అవసరమైనవారికి ఇస్తారని భావిస్తాను. నా అలంకార వస్తువులు రాహా, సరా, జూడీ, బతుల్, లానాల మధ్య సమానంగా పంచాలి. నా పూసల పెట్టె ఇకపై పూర్తిగా అహ్మద్, రాహల సొంతం. నాకు నెలవారీ అలవెన్సుగా వచ్చే 50 షెకెల్స్ (ఒక షెకెల్ 22 రూపాయలకు సమానం) సగం రాహాకు, సగం అహ్మద్‌కు ఇవ్వండి. నా కథలు, నోట్ పుస్తకాలు రాహావి. నా బొమ్మలు బతూల్వి. మరోటి, మా అన్న అహ్మద్‌ను గదమాయించొద్దు. ఈ కోరికలు నెరవేర్చండి’... -
Israel-Hezbollah war: బంకర్ బస్టర్ బాంబు వినియోగం
బీరుట్: హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై దాడిలో ‘బంకర్ బస్టర్’ బాంబును వాడినట్లు రక్షణ రంగ నిపుణుడు ఎలిజా మాగి్నయర్ చెప్పారు. అత్యంత ఆధునాతన జీబీయూ–72 రకం బాంబును ఇజ్రాయెల్ వాడింది. దీనిని ప్రయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ‘‘2021లో రూపొందించిన ఈ బాంబు బరువు ఏకంగా 2,200 కేజీలు. దాడి చేసిన చోట ఎవ్వరూ ప్రాణాలతో బయటపడకూడదనే గట్టి నిశ్చయంతో ఇజ్రాయెల్ ఈ బాంబు వేసినట్లు స్పష్టమవుతోంది. జార విడిచిన వెంటనే భవనం అండర్‌గ్రౌండ్‌లోకి దూసుకుపోవడం, ఆ మొత్తం భవనం నేలమట్టం కావడం అంతా క్షణాల్లో జరిగిపోతుంది. ఇక్కడ ఏకకాలంలో ఇలాంటి బాంబుల్ని ఇంకొన్ని జారవిడిచినట్లు ఘటనాస్థలిని చూస్తే తెలుస్తోంది. భారీ భవనాలను క్షణాల్లో శిథిలాల కుప్పగా మార్చే సత్తా వీటి సొంతం’’ అని ఎలిజా వ్యాఖ్యానించారు. శుక్రవారం లెబనాన్‌లో వేర్వేరు చోట్ల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 25 మంది చనిపోయారు. దీంతో ఇప్పటిదాకా ఈవారంలో మరణాల సంఖ్య 720 దాటింది. -
ఇజ్రాయెల్‌పై రాకెట్లతో విరుచుకుపడ్డ హిజ్బుల్లా
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రికత్తంగా మారాయి. ముఖ్యంగా హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య తర్వాత పరిస్థితులు మరింత జఠిలమయ్యాయి. ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తున్న హనీయాను ఇరాన్లో కోవర్ట్ ఆపరేషన్‌తో అంతమొందించింది. అందుకు ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా ప్రయాత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్‌లోని బీట్ హిల్లెల్ నగరంపై డజన్ల కొద్దీ కటియుషా రాకెట్లను ప్రయోగించింది. వాటిల్లో కొన్నింటిని ఇజ్రాయెల్ నిలువరించింది. ఇక ఈ దాడిపై హిజ్బుల్లా అధికారిక ప్రకటన చేసింది.కేఫర్ కేలా, డెయిర్ సిరియాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిందని, ఫలితంగా ఆ ప్రాంతాల పౌరులు గాయపడ్డారని, అందుకే తాము కటియుషా రాకెట్లను ప్రయోగించినట్లు వెల్లడించింది. వరుస పరిణామాలపై ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పారిపోతామంటే ప్రాణభిక్ష పెడతామని కాదంటే అంతు చూస్తామని హెచ్చరిస్తోంది. అమెరికా సాయం కూడా తీసుకుంటుంది. ఇజ్రాయెల్‌కు రక్షణగా అమెరికాఈ తరుణంలో ఇజ్రాయెల్‌కు రక్షణగా, దానికి సాయం చేసేందుకు ఆ ప్రాంతంలో అదనపు యుద్ధ నౌకలను, ఫైటర్ జెట్లను మోహరిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ చెప్పింది. అదే సమయంలో ఇరాన్ మద్దతు ఇస్తున్న హిజ్బుల్లా ప్రాభవం ఎక్కువగా ఉన్న లెబనాన్‌ను ఖాళీ చేయమని పాశ్చాత్య దేశాలు తమ పౌరులకు సలహా ఇచ్చాయి. ఇప్పటికే అనేక విమానయాన సంస్థలు ఈ ప్రాంతానికి రాకపోకల్ని నిలిపివేశాయి. స్కూల్‌పై దాడి వెనువెంటనే హమాస్ చీఫ్ హతంటెహ్రాన్లో హనియా హత్య, బీరూట్‌లో హిజ్బుల్లా మిలిటరీ చీఫ్ ఫువాద్ షుక్ర్‌ను చంపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించినట్లు కొద్ది సేపటికే హిజ్బుల్లా కటియుషా రాకెట్లను ప్రయోగించింది. ఇప్పటికే హిజ్బుల్లా ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. జులై 14న నుసిరత్ శరణార్థి శిబిరంలోని అబు ఒరేబన్ పాఠశాలపై జరిపిన దాడిలో 17 మంది పిల్లలు మరణించగా,80 మంది గాయపడ్డారు. స్కూల్‌పై దాడి తర్వాతనే హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీ, హిజ్బుల్లా మిలిటరీ చీఫ్ ఫువాద్ షుక్ర్‌ను హతమార్చి ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. -
North Korea: కొరియా దేశాల మధ్య ఉద్రిక్తత
సియోల్: దక్షిణ కొరియా, ఉత్తర కొరియా మధ్య ఉన్న వివాదాస్పద సముద్ర సరిహద్దుపై శుక్రవారం ఉదయం ఉత్తర కొరియా బాంబ్ షెల్స్ వర్షం కురిపించింది. 200 ఆర్టిలరీ రౌండ్ల షెల్స్ వేసింది. దీంతో అక్కడే ఉన్న దక్షిణ కొరియాకు చెందిన రెండు ఐలాండ్లలోని ప్రజలను స్థానిక యంత్రాంగం తరలిస్తోంది. దక్షిణ కొరియా మిలిటరీ అధికారుల విజ్ఞప్తి మేరకే ఐలాండ్ ప్రజలను తరలిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే ఐలాండ్లలోని ప్రజల తరలింపు ఉత్తర కొరియా బాంబు దాడుల వల్లనా లేదంటే దక్షిణ కొరియా చేపట్టిన మిలిటరీ డ్రిల్ వల్లా అనేదానిపై దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇవ్వలేదు. ‘దక్షిణ, ఉత్తర కొరియాల మధ్య ఉన్న వివాదస్పద సముద్ర సరిహద్దు లైన్‌పై ఉత్తర కొరియా శుక్రవారం ఉదయం 200 ఆర్టిలరీ షెల్స్ ప్రయోగించింది. ఈ షెల్స్ దాడిలో ఎలాంటి నష్టం జరగలేదు. ఉత్తర కొరియా కావాలని రెచ్చగొడుతోంది. ఇది 2018 మిలిటరీ ఒప్పందం ఉల్లంఘనే. ఉత్తర కొరియా షెల్లింగ్‌పై సరైన రీతిలో స్పందిస్తాం’అని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. ఇదీచదవండి..ఆదిత్య ఎల్1.. రేపు కీలక పరిణామం -
Israel-Hamas war: స్కూళ్లు, ఆస్పత్రులపై దాడులు
టెల్అవీవ్: గాజాలోకి ఇజ్రాయెల్ సైన్యాలు మరింతగా చొచ్చుకుపోతున్నాయి. శనివారం మరిన్ని ప్రాంతాలను హమాస్ ఉగ్రవాదుల నుంచి విముక్తం చేసినట్టు సైన్యం ప్రకటించింది. గాజాను పూర్తిగా చుట్టుముట్టినట్టు పేర్కొంది. ఈ క్రమంలో గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి సమీపంలో జరిగిన బాంబు, క్షిపణి దాడుల్లో కనీసం 15 మందికి పైగా మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఇది తమ పనేనని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆంబులెన్సులో పారిపోతున్న ఉగ్రవాదులను ఏరేయడానికి దాడి చేయాల్సి వచ్చిందని పేర్కొంది. దాంతోపాటు జబాలియా శరణార్థి శిబిరం సమీపంలో ఓ స్కూలుపై జరిగిన క్షిపణి దాడిలో మరో 15 మంది దాకా మరణించారు. దాడులు ఉత్తర గాజాలోని ఐరాస శరణార్థి శిబిరాలకు కూడా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇజ్రాయెల్ హెచ్చరిక మేరకు భారీ సంఖ్యలో దక్షిణాదికి వలస వెళ్లిన వారు పోగా ఇంకా 3 లక్షల మంది దాకా ఉత్తర గాజాలోనే చిక్కుబడ్డారు. వీరంతా ఐరాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. పోరులో ఇప్పటిదాకా మరణించిన పాలస్తీనావాసుల సంఖ్య 9,500 దాటినట్టు గాజా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు, హమాస్ చీఫ్ నివాసంపై కూడా క్షిపణి దాడి జరిగినట్టు వార్తలొస్తున్నాయి. సాయం... తక్షణావసరం గాజాలోని లక్షలాది మంది పాలస్తీనియన్లకు అత్యవసరాలు కూడా అందని దుస్థితి అలాగే కొనసాగుతోంది. అతి త్వరలో లక్షలాది మంది ఆకలి చావుల బారిన పడే ప్రమాదముందని అక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమైన ఐరాస తదితర అంతర్జాతీయ సంస్థల సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాజావాసులకు మానవీయ సాయం అందేలా చూడాలని అమెరికా, యూరప్‌తో సహా అంతర్జాతీయ సమాజమంతా ముక్త కంఠంతో ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేస్తున్నాయి. పరిస్థితి పూర్తిగా చేయి దాటకముందే స్పందించాలని కోరుతున్నాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. కాకపోతే యుద్ధక్షేత్రంలో చిక్కుబడ్డ పౌరులు దక్షిణాదికి పారిపోయేందుకు వీలుగా శనివారం మూడు గంటలపాటు దాడుల తీవ్రతను తగ్గించింది. ఈ నేపథ్యంలో పాలస్తీనావాసులకు అత్యవసర సాయం అందేలా చూసే మార్గాంతరాలపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అరబ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. రోజుకు ఆరు నుంచి 12 గంటల పాటు కాల్పుల విరామ ప్రకటించి మానవీయ సాయం అందేందుకు, క్షతగాత్రులను తరలించేందుకు వీలు కలి్పంచాలని ఈజిప్ట్, ఖతర్ కోరుతున్నాయి. అలాగే బందీల విడుదలకు బదులుగా ఇజ్రాయెల్ చెరలో ఉన్న పాలస్తీనియన్లలో వృద్ధులు, మహిళలను వదిలేయాలని ప్రతిపాదిస్తున్నాయి. వీటిపై ఇజ్రాయెల్ ఇప్పటిదాకా స్పందించలేదు. రోజుకు రెండే బ్రెడ్డు ముక్కలు గాజావాసులు సగటున రోజుకు కేవలం రెండు బ్రెడ్డు ముక్కలు తిని ప్రాణాలు నిలబెట్టుకుంటున్నట్టు అక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమైన ఐరాస సంస్థల డైరెక్టర్ థామస్ వైట్ వాపోయారు. అవి కూడా ఐరాస సేకరించిన పిండి నిల్వల నుంచే వారికి అందుతున్నట్టు చెప్పారు. గాజాలో ఒక్క ప్రాంతం కూడా సురక్షితమని చెప్పడానికి వీల్లేకుండా ఉందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఆవేదన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మానవీయ చట్టాలను గౌరవిస్తూ పాలస్తీనావాసులకు సాయమందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కానీ మానవీయ సాయం నిమిత్తం దాడులకు కాస్త విరామమివ్వాలన్న అంతర్జాతీయ విజ్ఞప్తులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తోసిపుచ్చారు. తమ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టేదాకా దాడులను తగ్గించేది లేదన్నారు. తాత్కాలిక కాల్పుల విరమణ కూడా సమ్మతం కాదన్నారు. మరోవైపు ద్వంద్వ పౌరసత్వాలున్న 380 మందికి పైగా పాలస్తీనియన్లు శుక్రవారం ఈజిప్టు చేరుకున్నారు. తామిక ఇజ్రాయెల్‌పై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగినట్టేనని హెజ్బొల్లా నేత సయ్యద్‌హసన్ నస్రల్లా ప్రకటించారు. -
పుతిన్ పైశాచికత్వం.. ఉక్రెయిన్‌లో 51 మంది మృతి..
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏడాదిన్నరకు పైగా రష్యా సైన్యం దాడులు.. ఉక్రెయిన్‌పై కొనసాగుతున్నాయి. తాజాగా రష్యా రాకెట్లో ఉక్రెయిన్‌లో భారీ ప్రాణనష్టం చోటుచేసుకుంది. రాకెట్ దాడిలో 51 మంది మృతిచెందినట్టు సమాచారం. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్టు ఉక్రెయిన్ దేశ అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. ఉక్రెయిన్‌పై దాడులను రష్యా కొనసాగిస్తున్నది. ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలో రష్యా రాకెట్ దాడులు చేసింది. గురువారం మధ్యాహ్నం కుప్యాన్స్క్ జిల్లాలోని హ్రోజా గ్రామంలో ఒక షాపు, కేఫ్‌పై రష్యా రాకెట్ల దాడి జరిగినట్లు ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు. ఈ రాకెట్ దాడిలో సుమారు 51 మంది మరణించినట్లు చెప్పారు. బిల్డింగ్ శిథిలాల్లో కొందరు చిక్కుకున్నట్లు వెల్లడించారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిన్నట్లు టెలిగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ⚡️Yermak: Russia attacks village in Kharkiv Oblast, killing 49 people. Russian forces attacked a grocery store in the village of Hroza in Kharkiv Oblast’s Kupiansk district, killing at least 49 people, Andriy Yermak, the head of the Presidential Office, reported on Oct. 5. 📷… pic.twitter.com/rKOmYg8i07 — The Kyiv Independent (@KyivIndependent) October 5, 2023 మరోవైపు.. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ రిజియన్‌లోని బెరిస్లావ్ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిపై రష్యా దాడులకు తెగబడింది. ఆసుపత్రి, మెడికల్ ఎమర్జెన్సీ స్టేషన్‌పై రష్యా బాంబు దాడులు ప్రయోగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 😥Russian bomb hits hospital and emergency medical station in Beryslav, Kherson region#UkraineWar #Ukraina #UkraineRussiaWar #Russia pic.twitter.com/GNXABLsXpr — Hieu Nguyen (@HieuTraderPro) October 5, 2023 కాగా, స్పెయిన్‌లో జరుగనున్న యూరప్ నేతల సదస్సులో పాల్గోనున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్కీ తాజా రష్యా దాడిపై స్పందించారు. గ్రోసరీ షాపుపై జరిగిన రష్యా రాకెట్ దాడిని క్రూరమైన ఉగ్రవాద దాడి అని ఆరోపించారు. ఈ సంఘటనలో 48 మందికిపైగా మరణించినట్లు తెలుస్తున్నదని వెల్లడించారు. మరోవైపు 19 నెలలుగా ఉక్రెయిన్‌పై దాడులను రష్యా కొనసాగిస్తున్నది. స్వాధీనం చేసుకున్న కొన్ని ప్రాంతాలను రష్యాలో కలుపుకున్నది. ఇది కూడా చదవండి: పార్లమెంట్ సాక్షిగా ట్రూడో చిల్లర చేష్టలు -
పాక్‌లో ఆత్మాహుతి దాడులు.. 58 మంది మృతి
కరాచీ: మసీదుల్లో మిలాదునబి వేడుకలే లక్ష్యంగా పాకిస్తాన్లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఆత్మాహుతి దాడుల్లో 58 మంది మృత్యువాతపడగా మరో 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ మస్తుంగ్ జిల్లా కేంద్రంలోని ఓ మసీదులో ప్రార్థనల సమయంలో జరిగిన బాంబు దాడిలో 54 మంది చనిపోయారు. మరో 100 మంది గాయపడ్డారు. మృతుల్లో డీఎస్పీ నవాజ్ గషో్కరి కూడా ఉన్నారు. గుర్తు తెలియని దుండగుడు డీఎస్పీ నవాజ్ కారు పక్కనే నిలబడి తనను తాను పేల్చేసుకున్నాడని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో సుమారు 20 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అదేవిధంగా, ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ హంగు నగరంలోని దవోబా పోలీస్ ఠాణాలోకి అయిదుగురు ఉగ్రవాదులు ప్రవేశించారు. భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం కాగా మరో నలుగురు పారిపోయారు. వారిలో ఒకరు పక్కనే ఉన్న మసీదులోకి చేరుకుని తనను పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో మసీదులో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది గాయపడ్డారు. మిగతా ముగ్గురు ఉగ్రవాదుల కోసం వేట సాగుతోందని పోలీసులు చెప్పారు. ఈ దాడులకు తాము కారణం కాదంటూ తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ తెలిపింది. ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)కు చెందిన కీలక కమాండర్‌ను భద్రతా బలగాలు కాల్చి చంపిన మరునాడే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఐఎస్ పాత్రపై అనుమానాలు తలెత్తుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడులతో గజ‘గాజా’
గాజా సిటీ: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం శనివారం కూడా వైమానిక దాడులు కొనసాగించింది. హమాస్ ఉగ్రవాదులకు సంబంధించిన పలు నివాసాలు నేలమట్టమయ్యాయి. ఇజ్రాయెల్ దాడిలో గాజాలో ఓ కారు ధ్వంసమయ్యింది. అందులోని 75 ఏళ్ల వృద్ధురాలు మరణించింది. మరో ఆరుగురు గాయపడ్డారు. హమాస్ ఉగ్రవాదులు సైతం ఎదురుదాడులకు దిగారు. దక్షిణ ఇజ్రాయెల్‌లపై బాంబుల వర్షం కురిపించారు. ఈ బాంబు దాడుల్లో ఎంతమేరకు నష్టం వాటిల్లందనే సమాచారం తెలియరాలేదు. శుక్రవారం ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 14 మంది దుర్మరణం పాలయిన సంగతి తెలిసిందే. -
రష్యా గ్రామాల్లో ఉక్రెయిన్ బాంబు దాడులు!
మాస్కో: ఉక్రెయిన్ ఉద్రిక్తతలు మరో మలుపు తిరిగాయి. యాభై రోజులకు పైగా రష్యా బలగాల దాడుల్ని నిలువరించిన ఉక్రెయిన్ సైన్యాలు.. ప్రతిదాడులకు తెగపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రష్యా సరిహద్దుల్లోని పట్టణాలపై ఉక్రెయిన్ సైన్యం దాడుల్ని తీవ్రంగా ఖండిస్తోంది రష్యా రక్షణ శాఖ. రష్యా భూభాగంలో తీవ్రవాద దాడులు లేదంటే విధ్వంసానికి పాల్పడితే.. ప్రతిగా కైవ్‌లోని లక్ష్యాలపై క్షిపణి దాడుల సంఖ్య పెరుగుతుందని రష్యా హెచ్చరించింది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు గురువారం అర్ధరాత్రి దాటాక కీవ్ శివారుల్లో ఉన్న మిలిటరీ ఫ్యాక్టరీ మీద మిస్సైల్స్‌తో దాడులకు తెగబడినట్లు ప్రకటించుకుంది. ఇదిలా ఉండగా.. గురువారం రష్యా సరిహద్దు బ్రైయాన్‌స్క్ రీజియన్‌లోని ఓ గ్రామంపై ఉక్రెయిన్ హెలికాఫ్టర్లు బాంబులను విడిచాయని, దాడుల్లో ఎనిమిది మంది పాల్పడ్డారంటూ మాస్కో ఆరోపణలకు దిగింది. అంతేకాదు.. బెల్గోర్డ్ రీజియన్ సరిహద్దులో ఉన్న ఓ గ్రామంపైకి బాంబుల్ని విసిరారని, రక్షణ చర్యలో భాగంగా ఊరిని ఖాళీ చేయించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే కీవ్ మాత్రం ఈ దాడుల ప్రకటనను ఆరోపణలుగా ఖండించింది. చదవండి: రష్యా యుద్ధనౌకకు భారీ నష్టం -
Russia-Ukraine War: లివీవ్ ముట్టడి
లివీవ్: పోలండ్‌కు అతి సమీపంలో ఉండే ఉక్రెయిన్ నగరం లివీవ్‌పై రష్యా రెండు రోజులుగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలండ్ పర్యటనలో భాగంగా శనివారం ఇక్కడికి సమీపంలోని శరణార్థుల శిబిరాన్ని సందర్శిస్తున్న సమయంలోనే లివీవ్‌పై భారీగా క్షిపణి దాడులు జరిగాయి. తద్వారా అమెరికాకు రష్యా ఓ హెచ్చకరిక సంకేతం పంపిందని భావిస్తున్నారు. లివీవ్‌లోని అక్కడి రక్షణ శాఖ ఇంధన ప్లాంటును క్రూయిజ్ మిసైళ్లతో ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ ఆదివారం ప్రకటించారు. కీవ్‌లోనూ మరో ఇంధన డిపోను యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన మిసైల్ ద్వారా ధ్వంసం చేశామన్నారు. నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతంపైనా రెండు రాకెట్లు పడ్డాయి. అక్కడ గంటల తరబడి దట్టమైన పొగ రేగుతూ కన్పించింది. కీవ్‌లో వెయ్యేళ్ల చరిత్ర ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన సెయింట్ సోఫియా కేథడ్రల్ దాడుల్లో ఏ క్షణమైన నేలమట్టమయ్యేలా కన్పిస్తోంది. కీవ్‌కు ఉత్తరంగా ఉన్న స్లావ్యుచ్ నగరాన్ని రష్యా సైన్యం ఆక్రమించిందని కీవ్ ప్రాంత గవర్నర్ ప్రకటించారు. కీవ్‌లో కర్ఫ్యూను సోమవారం దాకా పొడిగించారు. పొట్ట చేతపట్టుకుని వలస పోతున్న ఉక్రేనియన్లకు ఇంతకాలంగా లివీవ్ మజిలీగా ఉపయోగపడుతూ వస్తోంది. దేశంలోని పలు ప్రాంతాలకు నిత్యావసరాలు ఇక్కడి నుంచే సరఫరా అవుతూ వచ్చాయి. లివీవ్‌పైనా రష్యా దాడులను ఉధృతం చేయడం ఉక్రెయిన్‌లో మరింత సంక్షోభానికి కారణమయ్యేలా కన్పిస్తోంది. ఖర్కీవ్‌లోని అణు పరిశోధన సంస్థపైనా మరోసారి బాంబుల వర్షం కురిసింది. మరోవైపు రష్యాలో చేరడంపై రెఫరెండం నిర్వహిస్తామని లుహాన్స్క్ వేర్పాటువాద నేతలు చెప్తున్నారు. రష్యా–ఉక్రెయిన్ మరో దఫా చర్చలు సోమవారం జరగనున్నాయి. జెట్లు, ట్యాంకులివ్వండి: జెలెన్స్కీ యూరప్, పశ్చిమ దేశాలు కాస్త తెగువ చూపి తమకు సకాలంలో యుద్ధ విమానాలు, యుద్ధట్యాంకులు ఇస్తే రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ పరిస్థితి మరోలా ఉండేదని అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అన్నారు. ఈ విషయంలో అవి కనీసం ఒక్క శాతం ధైర్యం చూపినా బాగుండేదని వాపోయారు. యూరోపియన్ యూనియన్ను, నాటోను రష్యా నడుపుతోందా అంటూ మండిపడ్డారు. ‘‘మీరు పంపుతున్న షాట్ గన్లు, మెషీన్ గన్లతో రష్యా క్షిపణులను అడ్డుకోవడం అసాధ్యం. ఇప్పటికైనా యుద్ధ విమానాలు, ట్యాంకులు ఇవ్వండి. లేదంటే పోలండ్, స్లొవేకియా తదితర బాల్టిక్ దేశాలపైనా రష్యా దాడి చేయడం ఖాయం’’ అని జెలెన్స్కీ అన్నారు. యుద్ధం ద్వారా రష్యన్లపై ఉక్రెయిన్ ప్రజల్లో పుతిన్ తీవ్ర విద్వేషం నింపుతున్నారని దుయ్యబట్టారు. డోన్బాస్ ప్రాంతంలోని ఉక్రెయిన్ సైన్యాన్ని చుట్టుముట్టేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఇంగ్లండ్ రక్షణ శాఖ వర్గాలంటున్నాయి. ఖర్కీవ్, మారియుపోల్ నగరాల నుంచి రష్యా పటాలాలు ఇందుకోసం ఇప్పటికే బయల్దేరినట్టు చెప్పింది. అదే సమయంలో ఉక్రెయిన్ నగరాలపై దాడిని కూడా రష్యా తీవ్రస్థాయిలో కొనసాగిస్తోందని వివరించింది. తమ దేశాన్ని ఆక్రమించడం అసాధ్యమని తేలిపోవడంతో కనీసం రెండు ముక్కలైనా చేయాలని రష్యా చూస్తోందని మిలిటరీ ఇంటలిజెన్స్ చీఫ్ బుడనోవ్ ఆరోపించారు. రష్యా సైన్యాలకు చుక్కలు చూపిస్తామన్నారు. ఆటవిక యుద్ధం ఇకనైనా ముగియాలని పోప్ ఫ్రాన్సిస్ మరోసారి ప్రార్థనలు చేశారు. బైడెన్ ఉద్దేశం వేరు: అమెరికా వ్లాదిమిర్ పుతిన్ అధికారంలో కొనసాగరాదన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యలకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వివరణ ఇచ్చారు. పుతిన్‌ను గద్దె దించేందుకు అమెరికా ప్రయత్నించడం లేదన్నారు. పొరుగు దేశాలపై యుద్ధానికి దిగకుండా పుతిన్‌ను కట్టడి చేయాలన్నదే బైడెన్ వ్యాఖ్యల ఉద్దేశమన్నారు. రష్యాలో గానీ, ఇంకే దేశంలో గానీ నాయకత్వ మార్పులకు అమెరికా ఎన్నటికీ పూనుకోదన్నారు. బైడెన్ వ్యాఖ్యలను సమర్థించబోనని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అన్నారు. ‘‘నేనలాంటి పదజాలం ఉపయోగించను. సంక్షోభానికి తెర దించేందుకు పుతిన్‌తో చర్చలు కొనసాగిస్తా’’ అని చెప్పారు. మరోవైపు, రష్యా తమపై సైబర్ దాడికి దిగొచ్చని ఫిన్లండ్ అధ్యక్షుడు సాలీ నినిస్టో అన్నారు. ఫిన్లండ్ నాటో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తోంది. రష్యాతో 1,340 కిలోమీటర్ల మేర సరిహద్దును కూడా పంచుకుంటోంది. మరోవైపు పుతిన్ సన్నిహితుడైన రష్యా కుబేరుడు ఎవగెనీ ష్విల్డర్కు చెందిన రెండు జెట్ విమానాలను ఇంగ్లండ్ జప్తు చేసింది. -
థియేటర్‌పై రష్యా దాడిలో 300 మంది మృతి!
ఖర్కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. మార్చి 16న మారియుపోల్‌లో 1,300 మందికి పైగా తలదాచుకున్న ఓ థియేటర్ రష్యా బాంబు దాడిలో నేలమట్టమవడం తెలిసిందే. వారిలో కనీసం 300 మందికి పైగా దుర్మరణం పాలైనట్టు తాజాగా తేలింది! కీవ్ సమీపంలో ఉక్రెయిన్ దళాలకు ఇంధనం సరఫరా చేసే ఓ భారీ ఇంధనాగారాన్ని ధ్వంసం చేసినట్టు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని ఓడరేవుల్లో చిక్కుబడ్డ 67 నౌకలు సురక్షితంగా వెళ్లిపోయేందుకు శుక్రవారం నుంచి అనుమతిస్తామని ప్రకటించింది. నెలకు పైగా జరుగుతున్న యుద్ధం ఉక్రెయిన్ను సంక్షోభపుటంచుల్లోకి నెట్టేసింది. తిండికి, తాగునీటికి కూడా దిక్కు లేక దేశమంతటా జనం అల్లాడుతున్నారు. ఎటు చూసినా నిత్యావసరాల కొరత పీడిస్తోంది. శవాలను తీసుకెళ్లేవారు కూడా లేకపోవడంతో మారియుపోల్ తరహాలో సామూహిక ఖననాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్‌లో నాటో నేతృత్వంలో పాశ్చాత్య ‘శాంతిపరిరక్షణ’ దళాలను మోహరించాలన్న ప్రతిపాదనలను రష్యా అనుకూలుడైన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఆయుధాలివ్వం: హంగరీ ఉక్రెయిన్‌కు ఆయుధాలివ్వాలని, రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన విజ్ఞప్తిని హంగరీ తోసిపుచ్చింది. అది హంగరీ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ప్రధాని విక్టర్ అర్బన్ అన్నారు. పశ్చిమ దేశాలన్నీ తమపై సంయుక్తంగా యుద్ధం ప్రకటించాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ ఆరోపించారు. రష్యా గనక రసాయన ఆయుధాలు వాడితే యుద్ధ స్వరూపమే మారిపోతుందని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోటెన్‌బర్గ్ హెచ్చరించారు. యుద్ధంలో ఇప్పటిదాకా 1,351 మంది సైనికులను కోల్పోయినట్లు, మరో 3,825 మంది సైనికులు గాయపడ్డట్టు రష్యా ప్రకటించింది. చర్చల్లో పురోగతి: టర్కీ రష్యా–ఉక్రెయిన్ మధ్య చర్చల్లో పురోగతి ఉందని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ చెప్పారు. ‘‘నాటోలో చేర్చుకోవాలన్న డిమాండ్‌ను వదులుకునేందుకు, రష్యన్‌ను అధికార భాషగా స్వీకరించేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉంది.’’ అని చెప్పారు. Authorities in #Mariupol report that the bombing of the Drama Theater by a #Russian plane killed about 300 people. pic.twitter.com/5k2myuVFa4 — NEXTA (@nexta_tv) March 25, 2022 #American biopharmaceutical company #Gilead announced the suspension of all "non-core business operations" in #Russia. At the same time, the company will continue to supply vitally important drugs to Russia. pic.twitter.com/JnVEhxnM2N — NEXTA (@nexta_tv) March 25, 2022 -
కన్నీరు పెడుతున్న ఉక్రేనియన్లు.. షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్‌పై దాడి..
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు 26వ రోజుకు చేరుకున్నాయి. రష్యా బలగాల ధాటికి ఉక్రెయిన్ విలవిలాడుతోంది. రష్యా వైమానిక దాడుల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఉక్రెయిన్ జనావాసాలే లక్ష్యంగా రష్యా ట్రూప్ దాడులు జరుపుతున్నాయి. కనీస కనికరం లేకుండా బాండు దాడులు చేస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న రెట్రోవిలీ షాపింగ్ మాల్‌పై రష్యా మిస్సైల్ దాడి చేసింది. ఆ దాడిలో ఆరుగురు మృతిచెందారు. దాడి కారణంగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, మారియపోల్‌లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతున్నట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. నగరంలోని 90 శాతం బిల్డింగ్‌లో ఇప్పటికే ధ్వంసం అయ్యాయి. ఆ నగరంలో ఇంకా మూడు లక్షల మంది తలదాచుకుంటున్నారు. వాళ్లకు విద్యుత్తు, నీరు, ఆహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. Video of a shell hitting a shopping center. The explosion was incredibly strong, the wave blew out the windows in the neighboring houses. pic.twitter.com/Qe5ztF1vLc — NEXTA (@nexta_tv) March 20, 2022 మరోవైపు.. ఖార్కీవ్లో ఓ సూపర్ మార్కెట్‌పై రష్యా బలగాలు దాడులు చేశాయి. దాడుల్లో షాపులో ఉన్న ఉక్రెయిన్ పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంక్షోభంలో ఉక్రెయిన్‌కు చెందిన మాజీ ఎంపీ భార్య డబ్బును తరలిస్తూ పోలీసులకు చిక్కారు. మాజీ ఎంపీ కొట్విట్స్కీ భార్య భారీ మొత్తంలో ఉక్రెయిన్ నుంచి డబ్బును తరలిస్తుండగా హంగేరిలో బోర్డర్లో పోలీసులు పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, బాంబు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #Kharkiv: A #Russian shell explodes next to people who are standing in line at the supermarket. pic.twitter.com/QIZkgV4ZLa — NEXTA (@nexta_tv) March 21, 2022 Ukrainian media report that the wife of former MP Kotvytskyy tried to take $28 million and 1.3 million euros out of #Ukraine via #Zakarpattya. The money was found by the #Hungarian border guards and forced to declare it. pic.twitter.com/ZCjDlIxdwB — NEXTA (@nexta_tv) March 20, 2022 -
ఉక్రెయిన్ ఉక్కు వీరులు!.. ఒట్టి చేతులు.. వాటర్ బాటిల్‌తో బాంబులు నిర్వీర్యం
Disabling Bomb Their bare hands and just a bottle of water: ఉక్రెయిన్ రష్యా మధ్య పోరు నిరవధికంగా కొనసాగుతూనే ఉంది. ఒక వైపు రష్యా విదేశీయుల తరలింపు నిమిత్తం కాల్పుల విరమణ ప్రకటిస్తూనే మరోవైపు నుంచి బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఉక్కెయిన్ చాలా ఘోరంగా అతలాకుతలమైపోతోంది. అయినప్పటికీ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా తమ దేశాన్ని తమ ప్రజలను రక్షించుకుంటామంటూ తమ దేశ భక్తిని చాటుతున్నారు. మరోవైపు సైనికులు కూడా తమవంతుగా ప్రాణాలను లెక్కచేయకుండా రష్యా బలగాలకు ఎదురు నిలిచి మరీ పోరాడుతున్నారు. అత్యంత ధైర్య సాహసాలతో రష్యా సైన్యాన్ని నిలవరించడమే కాక రష్యా దాడులను తిప్పికొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందులో భాగంగా ఉక్రేనియన్ పేలుడు ఆర్డినెన్స్ డిస్పోజల్ స్పెషలిస్ట్‌ల బృందం తమ దేశంలో పేలకుండా పడి ఉన్న బాంబులను కేవలం ఉత్తి చేతులతో వాటిని నేరుగా తీసి, వాటర్ బాటిల్‌తో నిర్విర్యం చేస్తున్నారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు తమ దేశ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఆ బాంబులను నిర్విర్యం చేస్తున్న తీరుని చూస్తే మనసు చలించుపోతుందంటూ వారిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. అంతేకాదు ఉక్రెయిన్ వాసులు సైతం రష్య యుద్ధ ట్యాంకులకు ఎదురుగా నిలబడి మా దేశంలోకి రావద్దంటూ నినాదాలు చేసి మరీ అందర్నీ ఆశ్చర్యపరిచారు. This #Russia-dropped bomb would flatten a building — and yet these #Ukraine EODs defuse it with 2 hands and a bottle of water, while shells audibly land nearby. Mind boggling bravery.pic.twitter.com/KvCZeOxRyz — Charles Lister (@Charles_Lister) March 9, 2022 (చదవండి: చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించగలవట! ఎలాగో తెలుసా!) -
రష్యా అరాచకం.. ఉక్రెయిన్‌పై 500 కిలోల భారీ బాంబు ప్రయోగం
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు బాంబుల దాడులతో విరుచుకుపడుతున్నాయి. జనావాసాలపైకి మిస్సైల్స్, బాంబు దాడులు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని ఆసుపత్రులు, ప్రజల ఇళ్లపై బాంబు దాడుల కారణంగా వేల సంఖ్యలో సామాన్య పౌరులు మృత్యువాతపడ్డారు. తాజాగా రష్యా బలగాలు మరో దారుణానికి ఒడిగట్టాయి. సోమవారం రాత్రి సుమీ ప్రాంతంలో ఉన్న రెసిడెన్షియల్ భవనాలపై రష్యన్ బలగాలు 500 కిలోల బాంబుతో దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు సహా 18 మంది మృతి చెందారని ఉక్రెయిన్ సాంస్కృతిక, సమాచార పాలసీ మంత్రిత్వ శాఖ మంగళవారం ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఇది చదవండి: రష్యా బెదిరింపులు.. పెట్రోల్ రేట్లు ఊహించనంత పెరుగుతాయ్! Last night Russian pilots committed another crime against humanity in Sumy. They dropped 500-kilogram bombs on residential buildings. 18 civilian deaths have already been confirmed, including two children.#StopRussia — Stratcom Centre UA (@StratcomCentre) March 8, 2022 మరోవైపు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి డిమెట్రో కులేబా ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా వైమానిక దళాలు ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతాలపై రాత్రి పూట దాడులు చేస్తోందన్నారు. రష్యా సైన్యం చెర్నిహివ్ ప్రాంతంలోని జనావాసాలపైకి మరో 500 కిలోల బాంబు దాడికి పాల్పడిందని విమర్శించారు. అయితే ఆ బాంబు పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రష్యా బలగాలు విచ్చక్షణరహితంగా బాంబు దాడులు చేస్తూ మహిళలు, పిల్లల ప్రాణాలను బలితీసుకుంటున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలో తమ దేశాన్ని రష్యా దాడుల నుంచి కాపాడాలని ఆయన ప్రపంచ దేశాలను అభ్యర్థించారు. కాగా, రష్యా సరిహద్దులోని సుమీ, ఓఖ్టిర్కాలో బాంబు దాడుల కారణంగా నివాస భవనాలు, పవర్ ప్లాంట్ ధ్వంసమైనట్టు ప్రాంతీయ నాయకుడు డిమిట్రో జివిట్స్కీ తెలిపారు. This horrific 500-kg Russian bomb fell on a residential building in Chernihiv and didn’t explode. Many other did, killing innocent men, women and children. Help us protect our people from Russian barbarians! Help us close the sky. Provide us with combat aircraft. Do something! pic.twitter.com/3Re0jlaKEL — Dmytro Kuleba (@DmytroKuleba) March 6, 2022 ఇది చదవండి: పుతిన్ రహస్య ప్రేయసి.. ఇప్పుడు ఎక్కడ దాక్కుంది? -
విరామం లేని దాడులు..మాట తప్పిన రష్యా
లెవివ్: ఉక్రెయిన్‌లోని మరియూపోల్, వోల్నోవఖా నగరాల నుంచి సాధారణ పౌరులు క్షేమంగా బయటకు వెళ్లేందుకు వీలుగా శనివారం దాదాపు ఐదున్నర గంటలపాటు పరిమిత స్థాయిలో కాల్పుల విరమణకు రష్యా అంగీకరించడం కీలక పరిణామంగా నిపుణులు భావించారు. రష్యా కొంత దిగి వస్తున్నట్లుగా అంచనా వేశారు. అయితే, కాల్పుల విరమణ హామీని రష్యా నిలబెట్టుకోలేదని ఉక్రెయిన్ ఆరోపించింది. మరియూపోల్, వోల్నోవఖా నగరాలపై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపించిందని, ఫలితంగా పౌరుల చేరవేత సాధ్యం కాలేదని ఉక్రెయిన్ తెలిపింది. కాల్పుల విరమణకు రష్యా కట్టుబడి ఉండలేదని, మరియూపోల్తోపాటు పరిసర ప్రాంతాలపై దాడులు యథాతథంగా కొనసాగించిందని, బయటకు వెళ్లాల్సిన పౌరులు అండర్‌గ్రౌండ్ స్టేషన్లలోనే తలదాచుకోవాల్సి వచ్చిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కార్యాలయ ప్రతినిధి కైరీలో టైమోషెంకో తెలిపారు. కాల్పుల విరమణ పాటించాలని కోరుతూ రష్యాతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. పౌరుల భద్రత దృష్ట్యా మరియూపోల్, వోల్నోవఖా నగరాల్లో కాల్పుల విరమణకు అంగీకరిస్తూ తొలుత రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పౌరులు వెళ్లే మార్గాల్లో ఎలాంటి దాడులు జరుపబోమని హామీ ఇచ్చింది. దీంతో ఉక్రెయిన్ అధికారుల్లో ఆశలు చిగురించాయి. రెండు నగరాల నుంచి పౌరులను తరలించడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు తెలిసింది. రష్యా సైన్యం మాట తప్పడంతో తరలింపు ప్రక్రియ నిలిపివేయక తప్పలేదని ఉక్రెయిన్ పేర్కొంది. దాడులు ఆపాలని రష్యాను కోరుతున్నట్లు ఉక్రెయిన్ ఉప ప్రధానమంత్రి ఇరీనా వెరెషుక్ చెప్పారు. మరియూపోల్, వోల్నోవఖా సిటీల్లో ఉన్న తమ సేనలకు వ్యతిరేకంగా దాడులు జరిగాయని రష్యా రక్షణ శాఖ ఆరోపించింది. అందుకే ప్రతిదాడులు చేశామన్న సంకేతాలను పరోక్షంగా ఇచ్చింది. కాల్పుల విరమణ అనేది చివరకు వృథా ప్రయాసగానే మిగిలిపోవడం ఉక్రెయిన్ను నిరాశపర్చింది. ఈ ఒప్పందం అమలయ్యేలా తమ వైపు నుంచి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. జనం ఆకలి కేకలు మరియూపోల్‌లో పరిస్థితులు దిగజారుతున్నాయి. గడ్డకట్టించే చలిలో వేలాది మంది ప్రజలు నానా కష్టాలూ పడుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొబైల్ఫోన్లు పనిచేయడం లేదు. ఆహారం, మంచినీటి కొరత వేధిస్తోంది. ఫార్మసీల్లో ఔషధాలు దొరకడం లేదు. బయటకు వెళ్లిపోవడానికి వేలాది మంది సిద్ధమయ్యారని, ఇంతలో రష్యా దాడులు ప్రారంభించడంతో వారంతా ఆగిపోయారని మరియూపోల్ మేయర్ చెప్పారు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టలేమని, అందుకే తరలింపు ఆపేశామని తెలిపారు. మరియూపోల్‌లో 2 లక్షలు, వోల్నోవఖాలో 20 వేల మంది ఉన్నట్లు అంచనా. -
బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసం వద్ద బాంబు పేలుడు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసం సమీపంలో బాలు పేలుడు సంభవించింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని అర్జున్ సింగ్ నివాసం సమీపంలో బుధవారం ఉదయం మూడు బాంబాలు విసిరినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అలాగే ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ బాంబు దాడి వెనక టీఎంసీకి చెందిన వారున్నారని బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. కాగా ఈ పేలుడు ఘటన జరిగిన సమయంలో ఎంపీ అర్జున్ సింగ్ ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం దాడి జరిగిన ఇంటి లోపలే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు వారికి ఎలాంటి గాయాలైనట్లు సమాచారం లేదు. మరోవైపు బాంబు పేలుడు ఘటనను బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్‌కఢ్ ఖండించారు. బెంగాల్లో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన అన్నారు. -
ఉద్రిక్తతలకు దారితీసిన ఫేస్బుక్ పోస్టు
కొలంబో: శ్రీలంక ప్రభుత్వం సోషల్‌మీడియాపై నిషేధం విధించింది. సోమవారం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్, వాట్సప్ శ్రీలంకవాసులకు అందుబాటులో లేకుండాపోయాయి. ఫేస్బుక్లో తాజాగా పెట్టిన ఓ పోస్టు ఆధారంగా చిలా పట్టణంలో కొంత మంది క్రిస్టియన్ వర్గీయులు స్థానికంగా ఉన్న ఓ ముస్లిం వ్యాపారస్థుని దుకాణంపై దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారికి చెదరగొట్టడానికి గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా.. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన మరికొన్ని ప్రాంతాలకూ పాకింది. దీంతో అల్లర్లు జరిగే అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ ప్రకటించింది. అబ్దుల్ హమీద్ అనే 38 ఏళ్ల దుకాణదారుడు ఈ పోస్టు పెట్టినట్టు సంబంధిత అధికారులు గుర్తించారు. ‘మరీ అంతపగలబడి నవ్వమాకండి. ఒకరోజు మీరూ ఏడుస్తారు’అని ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ఈ పోస్టుపై స్థానిక క్రైస్తవులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలోనూ బాంబు దాడి ఘటనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు చక్కర్లు కొట్టడంతో శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందన్న వదంతులు చక్కర్లు కొడుతుండడంతో ప్రజలు రోడ్లపైకి రావడానికి ఇంకా భయపడుతున్నారు. చాలా రోజుల విరామం తరవాత సోమవారం పాఠశాలలు తెరుచుకున్నాయి. అయితే హాజరు శాతం మాత్రం పెద్దగా నమోదు కాలేదు. పిల్లల్ని పంపడానికి తల్లిదండ్రులు సిద్ధంగా లేరని అధికారులు అభిప్రాయపడ్డారు. శ్రీలంకలో ఏప్రిల్ 21న ఈస్టర్ పర్వదినం సందర్భంగా వరుస ఆత్మాహుతి దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ మారణకాండలో 250 మందికి పైగా చనిపోగా.. దాదాపు 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు ఐసిస్ బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. లంక ప్రభుత్వం మాత్రం స్థానిక తీవ్రవాద సంస్థ అయిన నేషనల్ తౌవీద్ జమాత్ ఈ దారుణానికి పాల్పడినట్లు భావిస్తోంది. -
లంక దాడి ఐసిస్ పనే
కొలంబో: శ్రీలంకలో గత ఆదివారం, ఈస్టర్ పండుగనాడు బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 321కి పెరిగింది. ‘శ్రీలంకలో బాంబు దాడులు చేసినవారు మా కోసం పోరాడేవారే’ అని ఐసిస్ అమఖ్ అనే వార్తా సంస్థకు తెలిపింది. ఈ అమఖ్ వార్తా సంస్థ ఇస్లామిక్ రాజ్యస్థాపనకు, ఉగ్రవాదానికి మద్దతు తెలిపేదే. ఆత్మాహుతి దాడి చేసిన ఉగ్రవాదుల పేర్లను ఐసిస్ ప్రకటించింది. ఈ దాడుల్లో గాయపడిన, చనిపోయిన వారి మొత్తం సంఖ్య దాదాపు వేయి అని పేర్కొంది. ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఆరోగ్య మంత్రి రజిత సేనరత్నే మాట్లాడుతూ స్థానిక ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ నేషనల్ తౌహీద్ జమాత్ ఈ దాడులకు కుట్రపన్నినట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఆత్మాహుతి దాడులకు పాల్పడిన వారందరూ శ్రీలంక జాతీయులేననీ, వారికి ఐసిస్ లేదా ఏదేనీ ఇతర విదేశీ ఉగ్రవాద సంస్థ మద్దతు ఇచ్చి ఉండొచ్చన్నారు. మరో ఇద్దరు భారతీయుల మృతి పేలుళ్లలో మృతి చెందిన మరో ఇద్దరు భారతీయుల పేర్లను భారత హై కమిషన్ మంగళవారం వెల్లడించింది. ఎ.మోరెగౌడ, హెచ్.పుట్టరాజు పేలుళ్లలో మరణించారని తెలిపింది. ఈ పేలుళ్లలో చనిపోయిన మొత్తం భారతీయుల సంఖ్య తాజాగా 10కి చేరింది. మొత్తం 40 మంది అరెస్టు ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తులు ఉపయోగించిన వ్యాన్‌కు డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తిని సహా మొత్తం 40 మంది అనుమానితులను శ్రీలంక పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేశారు. గత 24 గంటల్లో 16 మందిని అరెస్టు చేశామని పోలీసు విభాగం అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర మంగళవారం చెప్పారు. మరోవైపు దేశ భద్రతను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేత మహిందా రాజపక్స నిందించారు. మసీదుపై దాడికి ప్రతీకారంగానే గత నెల 15న న్యూజిలాండ్‌లో మసీదుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 50 మంది మృతికి కారణమవ్వడం తెలిసిందే. ఆ దాడికి ప్రతీకారంగానే స్థానిక ఇస్లాం తీవ్రవాదులు శ్రీలంకలో ఈస్టర్ నాడు బాంబు దాడులు చేశారని శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి రువాన్ విజెవర్ధనే మంగళవారం పార్లమెంటుకు చెప్పారు. విజెవర్ధనే మాట్లాడుతూ ‘ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ దాడి క్రైస్ట్‌చర్చ్ కాల్పులకు ప్రతీకారంగానే జరిగింది’ అని అన్నారు. ఆత్మాహుతి దాడిలో ఇద్దరు ముస్లింలు శ్రీలంకలో ఆత్మాహుతి దాడికి దిగినవారిలో ఇద్దరు ముస్లిం సోదరులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారిద్దరూ కొలంబోకి చెందిన ఓ మసాలా దినుసుల వ్యాపారి కొడుకులని చెప్పారు. ఒకరు షాంగ్రీ లా హోటల్లో, మరొకరు సిన్నమన్ గ్రాండ్ హోటల్లో ఆత్మాహుతికి పాల్పడ్డారు. శ్రీలంకలో ఉగ్రవాదుల బాంబు దాడుల్లో హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో నివసించే మాకినేని శ్రీనివాసబాబు అనే వ్యక్తి గాయపడ్డారు. ఉగ్రవాదుల బాంబు వీరికి సమీపంలో పేలడంతో శ్రీనివాసబాబుకు తీవ్రగాయాలయ్యాయి. అయితే, ఆయనతోపాటు వెళ్లిన మరో వ్యక్తి మృతి చెందినట్టు తెలిసింది. వైఫల్యానికి ప్రభుత్వం సారీ దాడులు జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాలు సమాచారం ఇచ్చినా పేలుళ్లను అడ్డుకోలేకపోవడంపై శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. దాడులకు ముందే తమకు హెచ్చరికలు అందాయని ప్రభుత్వ అధికార ప్రతినిధి రజిత సేనరత్నే చెప్పారు. ‘మేం హెచ్చరికలను పరిశీలించాం. అయినా తగిన విధంగా చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం మీకు క్షమాపణ చెబుతోంది. బాధితులుగా మిగిలిన కుటుంబాలు, సంస్థలను ప్రభుత్వం క్షమాపణలు వేడుకుంటోంది’ అని ఆయన చెప్పారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేస్తామనీ, చర్చిలను పునఃనిర్మిస్తామని తెలిపారు. -
కొలంబో పేలుళ్లు: టీడీపీ నేతకు స్వల్ప గాయాలు
సాక్షి, అనంతపురం : శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల నుంచి పలువురు తెలుగువాళ్లు ప్రాణాలు దక్కించుకున్నారు. అనంతపురంకు చెందిన టీడీపీ నేత, ఎస్ఆర్ కనస్ట్రక్షన్స్ అధినేత అమిలినేని సురేంద్ర బాబు బృందం కొలంబోకు విహార యాత్రకు వెళ్లింది. ఆదివారం ఉదయం సురేంద్ర బాబు మిగతా నలుగురు స్నేహితులు షాంగ్రీలా హోటల్లో టిఫిన్ చేస్తుండగా బాంబు పేలింది. ఈ సందర్భంగా తోపులాట జరగగా అమిలినేని సురేంద్ర బాబు స్వల్పంగా గాయపడ్డారు. కొంచెం తేరుకుని ప్రాణభయంతో హోటల్ ఎమర్జెన్సీ గేటు నుంచి బయటకు వచ్చేసినట్లు బాధితులు తెలిపారు. అనంతరం అమిలినేని సురేంద్ర బాబు తాను క్షేమంగానే ఉన్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే వీరికి సంబంధించిన పాస్‌పార్ట్‌లు, లగేజీ హోటల్ గదిలోనే ఉండిపోవడంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు శ్రీలంకలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో భారత విదేశాంగశాఖ అప్రమత్తం అయ్యింది. కొలంబోలోని భారత హైకమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకుంటున్నట్లు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్‌చేశారు. ఘటనలో భారతీయులెవరైనా చనిపోయారా లేక గాయపడ్డారా అన్న సమాచారాన్ని తెలుసుకుంటున్నట్టు ప్రకటించారు. బాధితుల సహాయార్థం కొలంబోలోని ఇండియన్ హై కమిషన్ ప్రత్యేక సెల్ ఏర్పాటుచేసింది. అత్యవసర సేవల కోసం సంప్రదించడానికి ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. అలాగే శ్రీలంకలోని భారతీయ సంఘాలు కూడా సహాయం చేసేందుకు ముందుకొచ్చాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా శ్రీలంక ప్రధానితో ఫోన్లో మాట్లాడారు. ఎలాంటి సాయం చేసేందుకైనా భారత్ సిద్ధంగా ఉందని ఆయన ఈ సందర్భంగా శ్రీలంక ప్రధానికి తెలిపారు. కాగా బాంబు దాడుల నుంచి సినీనటి రాధిక తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. ఈ మారణహోమానికి పాల్పడింది జహ్రాన్ హహీమ్, అబు మహ్మద్‌గా నిర్థారణకు వచ్చారు. -
అట్టుడుకుతున్న కన్నూర్
కన్నూర్/తిరువనంతపురం/న్యూఢిల్లీ: కేరళలో రాజకీయంగా అత్యంత సున్నితమైన కన్నూర్‌తోపాటు పతనంథిట్ట, కోజికోడ్ జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ, సీపీఎం నేతల ఇళ్లు, ఆస్తులపై బాంబు దాడులు జరిగాయి. శబరిమల ఆలయంలోకి 2వ తేదీన 50 ఏళ్లలోపు ఇద్దరు మహిళల ప్రవేశం అనంతరం రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. ఆలయ సంప్రదాయాలకు భంగం కలిగించడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని సీఎం విజయన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. పలుచోట్ల బాంబు దాడులు సీపీఎం ఎమ్మెల్యే ఏఎన్ షంషీర్‌కు చెందిన మడపీడికయిల్‌లోని ఇంటిపై, వడియిల్ పీడికియలోని బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు వి. మురళీధరన్ పూర్వీకుల నివాసం, తలస్సేరిలోని సీపీఎం నేత పి.శశి ఇంటిపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులు విసిరారు. ఈ ఘటనలతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పొరుగునే ఉన్న కోజికోడ్ జిల్లా పెరంబ్రాతోపాటు శబరిమల ఆలయం ఉన్న పతనంథిట్ట జిల్లా మలప్పురం, ఆదూర్‌లలో శుక్రవారం అర్థరాత్రి, శనివారం వేకువజామున బీజేపీ, సీపీఎం కార్యకర్తలు పరస్పరం దాడులు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న అల్లర్లకు సంబంధించి 1,700 మందిని, కన్నూర్ జిల్లాలో హింసాత్మక ఘటనలకు సంబంధించి 260 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శబరిమల అంశాన్ని సున్నితంగా పరిష్కరించడానికి బదులు సీపీఎం ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. అన్ని వర్గాల వారు చట్టాన్ని గౌరవించాలన్నదే తమ అభిమతమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ప్రతినిధి ఫర్హాన్ హక్ అన్నారు. శబరిమల వివాదం కారణంగా కేరళలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుం టున్నందున అప్రమత్తంగా ఉండాలని బ్రిటన్ ప్రభుత్వం తమ పౌరులను హెచ్చరించింది. -
40 మంది ముష్కరుల కాల్చివేత
గిజా: ప్రపంచ ప్రఖ్యాత గిజా పిరమిడ్ వద్ద బాంబు పేల్చి ముగ్గురు విదేశీయులను బలి తీసుకున్న ఉగ్ర మూకలపై ఈజిప్టు సైన్యం విరుచుకుపడింది. గిజాతోపాటు సినాయ్ ద్వీపకల్పంలోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపి 40 మందిని కాల్చి చంపింది. శుక్రవారం గిజాలో పర్యాటకుల బస్సుపై ఉగ్ర వాదులు జరిపిన బాంబు దాడిలో ముగ్గురు వియత్నాం దేశస్తులతోపాటు ఒక ఈజిప్టు గైడ్ చనిపోగా మరో 10 మంది పర్యాటకులు గాయపడ్డారు. ప్రభుత్వ కీలక ఆర్థిక వనరులు, విదేశీ పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో సైన్యం అప్రమత్తమైంది. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం వేకువజామున గిజాలోని రెండు ప్రాంతాలతోపాటు సినాయ్ ప్రావిన్స్‌లో ఉగ్ర స్థావరాలపై బలగాలు ఒక్కసారిగా దాడులు జరిపాయి. ఈ దాడుల్లో మొత్తం 40 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీర్ఘకాలంపాటు ఈజిప్టును పాలించిన హోస్నీ ముబారక్ 2011లో వైదొలిగాక దేశంలో తీవ్ర అస్థిరత నెలకొంది. దేశంలో సుస్థిర పరిస్థితులు ఇప్పుడిప్పుడే నెలకొంటున్న తరుణంలో జరిగిన తాజా ఉగ్ర దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. -
బాంబుల దాడి... అంతా ఓ డ్రామా
పీ కొత్తపల్లి,(పామిడి): పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని పీ కొత్తపల్లి–పామిడి స్టేషన్ పెట్రోల్‌బంకు మధ్య దాదిమి దామోదర్‌రెడ్డిపై గురువారం తెల్లవారుజామున జరిగిన బాంబుల దాడి ఓ నాటకమని ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు... దామోదర్‌రెడ్డికి ఫైనాన్స్ కింద రూ.3 లక్షలు అప్పు ఉందన్నారు. ఆ అప్పు ఎగ్గొటేందుకు పన్నాగంగా ఈ బాంబులదాడికి తెరలేపాడన్నారు. తన ద్విచక్ర వాహనాన్ని తానే తగిలేసి బాంబులదాడిలో ఆహుతైనట్లు నమ్మించాడన్నారు. తనపై బాంబులదాడి జరగడంతో డబ్బును దొంగిలించారన్న నెపంతో ఫైనాన్స్ డబ్బులను ఎగ్గొట్టాలన్నదే అతని ఎత్తుగడలో భాగమన్నారు. మరోవైపు తనపై దాడి జరగడానికి ఆస్తి వివాదమే కారణమని దామోదర్‌రెడ్డి చెబుతున్నాడు. తండ్రి సంజీవరెడ్డి, సోదరులు శివశంకర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి కుమారులు సుఖసాగర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డితో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తి తనపై బాంబుల వర్షం కురిపించారనీ, తాను సొమ్మసిల్లి పోవడంతో చనిపోయాననుకొని తన వద్ద ఉన్న రూ.10 లక్షలతో ఉడాయించినట్లు చెప్పాడు. రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తులో నిజానిజాలు తేలతాయని ఎస్ఐ చెప్పారు. -
జమ్మూ కశ్మీర్లో పాక్ దుశ్చర్య
జమ్మూ: పొరుగు దేశం పాకిస్తాన్ మళ్లీ దుశ్చర్యకు తెగబడింది. భారత్‌ను రెచ్చగొట్టేలా ఆ దేశం కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఇరుదేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పూంచ్ లోని బాలాకోటే సెక్టార్ సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం ఆదివారం మోర్టారు బాంబులతో విరుచుకు పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించగా ఇద్దరు బాలికలు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ముగ్గురు మైనర్ సోదరులు. మరో ఐదుగురు ఆర్మీ సిబ్బంది కూడా గాయపడగా వారిని సైనిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలికలను మాత్రం హెలికాప్టర్ ద్వారా జమ్మూలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు భారత భద్రతా బలగాలకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన పట్ల జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఫ్తీ తన సంతాప సందేశాన్ని ట్వీటర్లో పోస్ట్ చేశారు. ఆదివారం ఉదయం 7.45 నుంచి 11.30 గంటల వరకు పాకిస్తాన్ విచక్షణారహితంగా దాడులకు తెగబడినట్లు ఆర్మీ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. పాక్ కవ్వింపు చర్యల ఫలితంగా ఐదుగురు సాధారణ పౌరులు చనిపోయారనీ, ఆ దేశం ఎప్పుడూ అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని ఆయన చెప్పారు. పౌరుల ప్రాణాలకు ఎటువంటి ముప్పూ లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు జమ్మూ ఐజీ ఎస్డీఎస్ జమ్వాల్ చెప్పారు. -
బాంబు దాడుల్లో 11 మంది మృతి
అబుజా: నైజీరియాలోని మైదుగురి నగరంలో రెండు వరుస బాంబుదాడులు జరిగాయి. నగరంలోని ములైకల్ ములైకల్‌మారి, సాబోన్ గారి అనే రెండు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహుతి దళ సభ్యులు తమను తాము పేల్చుకోవడంతో వారితో సహా 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బోకో హరమ్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వారు ఈ దాడులకు పాల్పడి ఉంటారని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బోకో హరమ్ ఉగ్ర సంస్థ తిరుగుబాటు దాడుల్లో 2009 నుంచి ఇప్పటి వరకు సుమారు 20 వేల మంది చనిపోయారు. సుమారు 23 లక్షల మంది ఇళ్లు వాకిలీ వదిలి వేరే ప్రదేశాలకు వెళ్లిపోయారు. -
బాంబు దాడులు భారత్‌లోనే అధికం
న్యూఢిల్లీ: గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా జరిగిన బాంబు దాడుల్లో ఎక్కువ పేలుళ్లు భారత్‌లోనే జరిగినట్లు నేషనల్ బాంబ్ డేటా సెంటర్ (ఎన్బీడీసీ) తాజా నివేదికలో వెల్లడించింది. యుద్ధం కాలంలో ఇరాక్, అఫ్గాన్ దేశాలపై జరిగిన బాంబు దాడుల కంటే భారత్‌లోనే అధికంగా దాడులు జరిగినట్లు పేర్కొంది. ఈ ప్రకారం గత ఏడాది 406 బాంబుదాడులతో భారత్ మొదటి స్థానంలో నిలవగా, 221 బాంబుదాడుల తో ఇరాక్ రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ దాడుల్లో ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయపడ్డారన్న అంశాలేవీ నివేదికలో వెల్లడించలేదు. ఇక పొరుగు దేశం పాకిస్తాన్ లో 161, అఫ్గానిస్తాన్ లో 132 బాంబు దాడులు జరిగాయి.