Ukraine Russia War: Uktraine People Killed After Russian Big Bombs Fell On Residential Buildings - Sakshi
Sakshi News home page

500 Kg Bomb: రష్యా అరాచకం.. ఉక్రెయిన్‌పై 500 కిలోల భారీ బాంబు ప్రయోగం

Mar 8 2022 2:50 PM | Updated on Mar 8 2022 8:23 PM

Uktraine People Killed After Russian Big Bombs Fell On Residential Buildings - Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు రాత్రి పూట అరాచకం సృష్టిస్తున్నాయి. జనావాసాలే లక్ష్యంగా బాంబుల దాడులతో విరుచుకుపడుతున్నాయి. 

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు బాంబుల దాడులతో విరుచుకుపడుతున్నాయి. జనావాసాలపైకి మిస్సైల్స్‌‌, బాంబు దాడులు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని ఆసుపత్రులు, ప్రజల ఇళ్లపై బాంబు దాడుల కారణంగా వేల సంఖ్యలో సామాన్య పౌరులు మృత్యువాతపడ్డారు. 

తాజాగా రష్యా బలగాలు మరో దారుణానికి ఒడిగట్టాయి. సోమవారం రాత్రి సుమీ ప్రాంతంలో ఉన్న రెసిడెన్షియల్‌ భవనాలపై రష్యన్‌ బలగాలు 500 కిలోల బాంబుతో దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు సహా 18 మంది మృతి చెందారని ఉక్రెయిన్‌ సాంస్కృతిక, సమాచార పాలసీ మంత్రిత్వ శాఖ మంగళవారం ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. 

ఇది చదవండి: రష్యా బెదిరింపులు.. పెట్రోల్‌ రేట్లు ఊహించనంత పెరుగుతాయ్‌!

మరోవైపు ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ మం‍త్రి డిమెట్రో కులేబా ట్విట్టర్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా వైమానిక దళాలు ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతాలపై రాత్రి పూట దాడులు చేస్తోందన్నారు. రష్యా సైన్యం చెర్నిహివ్‌ ప్రాంతంలోని జనావాసాలపైకి మరో 500 కిలోల బాంబు దాడికి పాల్పడిందని విమర్శించారు. అయితే ఆ బాంబు పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రష్యా బలగాలు విచ్చక్షణరహితంగా బాంబు దాడులు చేస్తూ మహిళలు, పిల్లల ప్రాణాలను బలితీసుకుంటున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలో తమ దేశాన్ని రష్యా దాడుల నుంచి కాపాడాలని ఆయన ప్రపంచ దేశాలను అభ‍్యర్థించారు. కాగా, రష్యా సరిహద్దులోని సుమీ, ఓఖ్టిర్కాలో బాంబు దాడుల కారణంగా నివాస భవనాలు, పవర్ ప్లాంట్‌ ధ్వంసమైనట్టు ప్రాంతీయ నాయకుడు డిమిట్రో జివిట్స్కీ తెలిపారు. 

ఇది చదవండి: పుతిన్‌ రహస్య ప్రేయసి.. ఇప్పుడు ఎక్కడ దాక్కుంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement