![Russia Alleges Ukraine Bombed Border Villages Warn Missile Attacks - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/15/Russia_Ukraine_Bomb_attacks.jpg.webp?itok=Ir7njDth)
మాస్కో: ఉక్రెయిన్ ఉద్రిక్తతలు మరో మలుపు తిరిగాయి. యాభై రోజులకు పైగా రష్యా బలగాల దాడుల్ని నిలువరించిన ఉక్రెయిన్ సైన్యాలు.. ప్రతిదాడులకు తెగపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రష్యా సరిహద్దుల్లోని పట్టణాలపై ఉక్రెయిన్ సైన్యం దాడుల్ని తీవ్రంగా ఖండిస్తోంది రష్యా రక్షణ శాఖ.
రష్యా భూభాగంలో తీవ్రవాద దాడులు లేదంటే విధ్వంసానికి పాల్పడితే.. ప్రతిగా కైవ్‌లోని లక్ష్యాలపై క్షిపణి దాడుల సంఖ్య పెరుగుతుందని రష్యా హెచ్చరించింది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు గురువారం అర్ధరాత్రి దాటాక కీవ్ శివారుల్లో ఉన్న మిలిటరీ ఫ్యాక్టరీ మీద మిస్సైల్స్‌తో దాడులకు తెగబడినట్లు ప్రకటించుకుంది.
ఇదిలా ఉండగా.. గురువారం రష్యా సరిహద్దు బ్రైయాన్‌స్క్ రీజియన్‌లోని ఓ గ్రామంపై ఉక్రెయిన్ హెలికాఫ్టర్‌లు బాంబులను విడిచాయని, దాడుల్లో ఎనిమిది మంది పాల్పడ్డారంటూ మాస్కో ఆరోపణలకు దిగింది. అంతేకాదు.. బెల్‌గోర్డ్ రీజియన్ సరిహద్దులో ఉన్న ఓ గ్రామంపైకి బాంబుల్ని విసిరారని, రక్షణ చర్యలో భాగంగా ఊరిని ఖాళీ చేయించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే కీవ్ మాత్రం ఈ దాడుల ప్రకటనను ఆరోపణలుగా ఖండించింది.
చదవండి: రష్యా యుద్ధనౌకకు భారీ నష్టం
Comments
Please login to add a commentAdd a comment