గంటల వ్యవధిలో వరుస బాంబు దాడులతో ప్రముఖ పర్యాటక దేశం థాయ్‌లాండ్ ఉలిక్కిపడింది. థాయ్ రాణి సిరికిత్ పుట్టిన రోజు వేడుకల రోజున ప్రముఖ ప్రఖ్యాత రిసార్టులు, హోటళ్ల వద్ద ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అక్కడి మిలటరీ ప్రభుత్వం రూపొందించిన రాజ్యాంగానికి ప్రజలు ఆమోదం తెలిపిన కొన్ని రోజుల వ్యవధిలో జరిగిన ఈ దాడుల్లో నలుగురు దుర్మరణం చెందగా, 34 మంది గాయపడ్డారు. గురువారం అర్ధ రాత్రి నుంచి శుక్రవారాల్లో వరకు 5 దక్షిణ ప్రావిన్స్‌లలో కనీసం 11 బాంబు దాడులు జరిగాయి. ఒక ప్రాంతంలో దాడి జరిగిన కొన్ని గంటల్లోనే కొన్ని మీటర్ల దూరంలోని మరో ప్రాంతంలో పేలుళ్లు చోటుచేసుకోవడంతో స్థానికుల్లో భయాందోళనకు గురయ్యారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, ఆస్ట్రియా దేశాలకు చెందిన వారు అధికంగా ఉన్నారన్నారు. అయితే ఈ దాడి ఉగ్రవాద చర్య కాదని, స్థానిక విద్రోహ శక్తులే ఈ కుట్రకు పాల్పడినట్లు వెల్లడించారు.
థాయ్‌లాండ్‌లో వరుస బాంబు పేలుళ్లు
Published Fri, Aug 12 2016 8:22 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
Advertisement