ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఆత్మాహుతి దాడుల్లో కనీసం 13 మంది ప్రజలు మరణించగా, మరో 46 మంది గాయపడ్డారు.
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఆత్మాహుతి దాడుల్లో కనీసం 13 మంది ప్రజలు మరణించగా, మరో 46 మంది గాయపడ్డారు. బుధవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి.
న్యూ బాగ్దాద్లోని షియా జిల్లాలో ఓ ఉగ్రవాది పేలుడు పదార్థాలున్న కారుతో పోలీస్ తనిఖీ స్థావరంపై దాడి చేశాడు. ఇదే జిల్లాలో రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్, సినిమా థియేటర్ సమీపంలో మరో ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేశాడు. అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి బాగ్దాద్ పర్యటనకు వచ్చిన రోజునే ఈ దాడులు జరిగాయి.