Israel-Hezbollah war: బంకర్‌ బస్టర్‌ బాంబు వినియోగం | Israel-Hezbollah war: New bunker buster bombs used in Beirut attack | Sakshi
Sakshi News home page

Israel-Hezbollah war: బంకర్‌ బస్టర్‌ బాంబు వినియోగం

Published Sat, Sep 28 2024 5:17 AM | Last Updated on Sat, Sep 28 2024 5:17 AM

Israel-Hezbollah war: New bunker buster bombs used in Beirut attack

బీరుట్‌: హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై దాడిలో ‘బంకర్‌ బస్టర్‌’ బాంబును వాడినట్లు రక్షణ రంగ నిపుణుడు ఎలిజా మాగి్నయర్‌ చెప్పారు. అత్యంత ఆధునాతన జీబీయూ–72 రకం బాంబును ఇజ్రాయెల్‌ వాడింది. దీనిని ప్రయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ‘‘2021లో రూపొందించిన ఈ బాంబు బరువు ఏకంగా 2,200 కేజీలు. దాడి చేసిన చోట ఎవ్వరూ ప్రాణాలతో బయటపడకూడదనే గట్టి నిశ్చయంతో ఇజ్రాయెల్‌ ఈ బాంబు వేసినట్లు స్పష్టమవుతోంది.

 జార విడిచిన వెంటనే భవనం అండర్‌గ్రౌండ్‌లోకి దూసుకుపోవడం, ఆ మొత్తం భవనం నేలమట్టం కావడం అంతా క్షణాల్లో జరిగిపోతుంది. ఇక్కడ ఏకకాలంలో ఇలాంటి బాంబుల్ని ఇంకొన్ని జారవిడిచినట్లు ఘటనాస్థలిని చూస్తే తెలుస్తోంది. భారీ భవనాలను క్షణాల్లో శిథిలాల కుప్పగా మార్చే సత్తా వీటి సొంతం’’ అని ఎలిజా వ్యాఖ్యానించారు. శుక్రవారం లెబనాన్‌లో వేర్వేరు చోట్ల ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 25 మంది చనిపోయారు. దీంతో ఇప్పటిదాకా ఈవారంలో మరణాల సంఖ్య 720 దాటింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement