building colasped
-
శిథిలాల్లో 30 మృతదేహాలు
బీరుట్: లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోయారు. బర్జా పట్టణంపై మంగళవారం రాత్రి జరిగిన దాడిలో ఓ అపార్టుమెంట్ భవనం నేలమట్టమైంది. బుధవారం సహాయక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న కనీసం 30 మృత దేహాలను వెలికితీశారు. మరికొందరు శిథిలాల కిందే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముందస్తు హెచ్చరికలు లేకుండా చేపట్టిన ఈ దాడిపై ఇజ్రాయెల్ ఆర్మీ స్పందించలేదు. తీరప్రాంత సిడాన్ నగరానికి ఉత్తరాన ఉన్న ఈ పట్టణంపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడి చేసిన దాఖలాలు లేవు. ఇలా ఉండగా, లెబనాన్‌లోని హెజ్బొల్లా సాయుధ గ్రూపు బుధవారం ఇజ్రాయెల్‌పైకి కనీసం 10 రాకెట్లను ప్రయోగించింది. దీంతో, టెల్ అవీవ్‌లో సైరన్లు మోగాయి. ఒక రాకెట్ శకలం సెంట్రల్ ఇజ్రాయెల్ నగరం రాననలోని పార్కు చేసిన కారుపై పడింది. టెల్ అవీవ్‌లోని ప్రధాన విమానాశ్రయం సమీపంలోని బహిరంగ ప్రాంతంలో రాకెట్లు పడ్డాయని మీడియా తెలిపింది. విమానాల రాకపోకలు మాత్రం కొనసాగాయని పేర్కొంది. రాకెట్ల దాడిలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని సహాయక బృందాలు తెలిపాయి. -
Israel-Hezbollah war: బంకర్ బస్టర్ బాంబు వినియోగం
బీరుట్: హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై దాడిలో ‘బంకర్ బస్టర్’ బాంబును వాడినట్లు రక్షణ రంగ నిపుణుడు ఎలిజా మాగి్నయర్ చెప్పారు. అత్యంత ఆధునాతన జీబీయూ–72 రకం బాంబును ఇజ్రాయెల్ వాడింది. దీనిని ప్రయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ‘‘2021లో రూపొందించిన ఈ బాంబు బరువు ఏకంగా 2,200 కేజీలు. దాడి చేసిన చోట ఎవ్వరూ ప్రాణాలతో బయటపడకూడదనే గట్టి నిశ్చయంతో ఇజ్రాయెల్ ఈ బాంబు వేసినట్లు స్పష్టమవుతోంది. జార విడిచిన వెంటనే భవనం అండర్‌గ్రౌండ్‌లోకి దూసుకుపోవడం, ఆ మొత్తం భవనం నేలమట్టం కావడం అంతా క్షణాల్లో జరిగిపోతుంది. ఇక్కడ ఏకకాలంలో ఇలాంటి బాంబుల్ని ఇంకొన్ని జారవిడిచినట్లు ఘటనాస్థలిని చూస్తే తెలుస్తోంది. భారీ భవనాలను క్షణాల్లో శిథిలాల కుప్పగా మార్చే సత్తా వీటి సొంతం’’ అని ఎలిజా వ్యాఖ్యానించారు. శుక్రవారం లెబనాన్‌లో వేర్వేరు చోట్ల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 25 మంది చనిపోయారు. దీంతో ఇప్పటిదాకా ఈవారంలో మరణాల సంఖ్య 720 దాటింది. -
ఖర్కీవ్‌పై రష్యా క్షిపణి దాడి
మాస్కో: ఉక్రెయిన్ నగరం ఖర్కీవ్‌పై రష్యా ప్రయోగించిన క్షిపణి ఆటస్థలంలో పడటంతో 14 ఏళ్ల బాలిక మృత్యువాత పడింది. సరిహద్దులకు సమీపంలోని ఖర్కీవ్పైనే జరిపిన మరో దాడిలో 12 అంతస్తుల నివాస భవనం ధ్వంసమయింది. ఘటనలో ఐదుగురు చనిపోగా మరో 59 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 9 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో 20 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఘటనలో భవనంలో పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. భవనం వెలుపలి గోడ తీవ్రంగా దెబ్బతింది. సమీపంలో పార్కు చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఇలా ఉండగా, సరిహద్దులకు సమీపంలోని బెల్గొరోడ్ ప్రాంతంపై ఉక్రెయిన్ ఆర్మీ జరిపిన దాడుల్లో ఐదుగురు చనిపోయినట్లు రష్యా ప్రకటించింది. కాగా, డొనెట్స్క్ రిజియన్‌లోని చాసివ్ యార్ పట్టణంపై రష్యా జరిపిన దాడుల్లో ఏడుగురు మృతి చెందారు. పట్టణంలోని పౌరులందరూ ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆ ప్రాంత గవర్నర్ కోరారు. ఉక్రెయిన్ బలగాల మౌలిక వనరుల రవాణాకు కీలకంగా ఉన్న పొక్రొవ్స్క్ నగరానికి అతి సమీపంలో రష్యా బలగాలు తిష్టవేశాయి.ఎయిర్ ఫోర్స్ చీఫ్ తొలగింపు: ముందుకు చొచ్చుకు వస్తున్న రష్యా బలగాలను నిలువరించి, ఎదురు దాడులు చేయడంలో అమెరికా మిత్ర దేశాలు అందించిన ఎఫ్–16 యుద్ధ విమానాలను ఉక్రెయిన్ కీలకంగా భావిస్తోంది. అయితే, సోమవారం ఒక ఎఫ్–16 యుద్ధ విమానాన్ని రష్యా ఆర్మీ కూల్చి వేసింది. అందులోని పైలట్ కూడా చనిపోయారు. ఘటనను అధ్యక్షుడు జెలెన్స్కీ సీరియస్‌గా తీసుకున్నారు. వైమానిక దళం చీఫ్ మికోలా ఒలెశ్చుక్ను బాధ్యతల నుంచి తొలగిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇందుకు కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. సైనికుల భద్రతకు ఆయనదే పూర్తి బాధ్యతని మాత్రమే వ్యాఖ్యానించారు. -
జపాన్ లో పెరుగుతున్న భూకంప మృతుల సంఖ్య
-
సిలిండర్ పేలి ఐదుగురు దుర్మరణం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని సేలంలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి నాలుగు ఇళ్లు కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 12 మంది గాయపడ్డారు. సేలం జిల్లా కరుంగల్ పట్టి పాండురంగన్ విట్టల్ వీధిలో వెంకటరాజన్, ఇంద్రాణి దంపతులకు నాలుగు ఇళ్లు ఉన్నాయి. ఓ ఇంట్లో గోపినాథ్, ఆయన తల్లి, అత్తతో నివసిస్తున్నారు. మరో రెండు ఇళ్లల్లో వేర్వేరు కుటుంబాలు ఉంటున్నాయి. ఈ ఇంటికి పక్కనే సేలం అగ్నిమాపక విభాగంలో ఎస్ఎస్ఐగా పనిచేస్తున్న పద్మనాభన్ ఇల్లు ఉంది. మంగళవారం తెల్లవారుజామున గోపినాథ్ తల్లి స్టౌవ్ వెలిగించే సమయంలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ధాటికి ఆ నాలుగు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలుసహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 12 మందిని ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర సీఎం స్టాలిన్ తలా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
చిన్నారి మృతిపై ఆరోపణలు అవాస్తవం: కలెక్టర్
ప్రకాశం: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో రాజుపాలెం పాఠశాలలో చిన్నారి మృతిపై ఆరోపణలు అవాస్తవమని జిల్లా కలెక్టర్ అన్నారు. స్కూల్ లేని ఆదివారం రోజు ఘటన జరినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూల్ విద్యార్థి ఆడుకోవడానికి అక్కడకి వెళ్లినట్లు తెలిపారు. ఆ స్కూల్ భవనం వినియోగంలోనే లేదన్నారు. నాడు-నేడు కింద ఆ స్కూల్‌ను తీసుకోలేదని కలెక్టర్ వెల్లడించారు. పాడైపోయిన భవనాలను గుర్తించి కూల్చివేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. చదవండి: పసికందును ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని మహిళ -
ముంబైలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
ముంబై: మన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శివాజీ నగర్‌లోని గోవండి ప్రాంతంలో ఒక భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ముగ్గురు మృతిచెందగా, 7 గురు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ సంఘటన ఉదయం 5 గంటల ప్రాంతంలో సంభవించినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అదే విధంగా, స్థానికుల సహయంతో క్షతగాత్రులను దగ్గరలోని రాజవాడి, సియోన్ ఆస్పత్రులకు తరలించారు. కాగా, మృతి చెందిన వారిలో ఇద్దరిని నేహషేక్, మోకర్ షేక్‌లుగా గుర్తించారు. మరికొందరిని అత్యవసర చికిత్సను అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా, పోలీసులు సంఘటన స్థలం వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కల్గకుండా చర్యలు తీసుకుంటున్నారు. రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ముంబైలో జనజీవనం అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. అయితే, వర్షం బీభత్సంగానే భవంతి కూలీపోయి ఉంటుందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బిఎంసీ) అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
గుండెలు పగిలేలా రోదనలు.. ఇక సజీవ సమాధిగా మిగిలేనా?
తమవాళ్లు ఏమైపోయారో అని కొందరి రోదనలు. తమవాళ్లు మృత్యుముఖం నుంచి బయటపడతారేమోనని ఆశతో మరికొందరు. ఇంకొందరు సహాయక బృందాలతో కలిసి వెతుకులాట.. మియామీ బిల్డింగ్ కూలిన ఘటనాస్థలంలో కనిపిస్తున్న దృశ్యాలివే. అయితే నిమిషాల వ్యవధిలో జరిగిన దుర్ఘటన వందకు పైగా కుటుంబాల్లో పెనువిషాదం నింపేలా కనిపిస్తోంది. అయితే ఇప్పటిదాకా 150 మందికిదాకా ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన నెలకొంది. మరోపక్క సహాయక చర్యలను నిలిపివేయాలన్న ఆదేశాలతో బాధిత కుటుంబాలు రోదనలు మిన్నంటుతున్నాయి. ఫ్లోరిడా: మియామీ బీచ్ సమీపంలోని ఛాంప్లెయిన్ టవర్స్‌లో మొత్తం 136 అపార్ట్మెంట్లు ఉన్నాయి. వాటిలో 55 అపార్ట్మెంట్లు గత గురువారం రాత్రి(బుధవారం అర్థరాత్రి దాటాక 1గం.30ని. సమయంలో) కుప్పకూలిపోయాయి. ఆ మరుసటి ఉదయం నుంచి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనను 9/11 విషాదంతో పోలుస్తున్నారు కొందరు. కాగా, ఈ ఘటనలో ఇప్పటిదాకా 18 మృతదేహాలను వెలికితీయగా(పిల్లలు కూడా ఉన్నారు).. గాయపడ్డ ఇరవై మందికి పైగా ఆస్పత్రికి తరలించారు. ఇంకా 145 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. అయితే శిథిలాల కింద కొందరైనా ప్రాణాలతో ఉండొచ్చేమోనన్న ఆశతో గాలింపు చర్యలు చేపట్టారు. స్నిఫర్ డాగ్స్, రెస్క్యూ టీంలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ సహాయక కార్యక్రమంలో సెలబ్రిటీలు, స్కూల్ పిల్లలు సైతం స్వయంగా వచ్చి పాల్గొనడం విశేషం. మరోపక్క అంతా క్షేమంగా బయటపడాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈ తరుణంలో.. శకలాల తొలగింపు నిలిపివేత మియామీ దుర్ఘటనలో శకలాల తొలగింపును నిలిపివేయాలని సర్ప్‌సైడ్ మేయర్ ఛార్లెస్ బర్కెట్ శుక్రవారం ఉదయం ఆదేశించాడు. ఓవైపు తుఫాన్ హెచ్చరికలు.. మరోపక్క శకలాలను తొలగించే క్రమంలో ఒరిగిపోయి ఉన్న మిగిలిన అపార్ట్మెంట్ భాగం కూలిపోయే ప్రమాదం ఉందని ఇంజినీర్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పనులు ఆపేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో బాధిత కుటుంబాల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. వాళ్ల రోదనలతో ఆ ప్రాంతంలో శోక మేఘాలు అలుముకున్నాయి. తమ వాళ్లను శకలాల కిందే చావనివ్వకండని అధికారుల్ని వేడుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. బైడెన్ సంఘీభావం కాగా, ఘటనాస్థలాన్ని గురువారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సందర్శించాడు. బాధితుల కుటుంబాలను ఓదార్చడంతో పాటు సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించాడు. కనీసం తమవాళ్ల శవాలైనాన అప్పగించాలని కొందరు బైడెన్‌ను వేడుకోవడం అందరినీ కలిచివేసింది. ఈమేరకు అక్కడి దీనగాథల్ని, పరిస్థితుల్ని వివరిస్తూ.. బైడెన్ ట్విటర్లో పోస్ట్‌లు చేశారు. కారణాలేంటసలు.. ప్రస్తుతం ఈ బిల్డింగ్ ఉన్న స్థలం ఒకప్పుడు సముద్రపు నీట మునిగి ఉన్న స్థలం అని.. 40 ఏళ్ల క్రితం ఈ బిల్డింగ్‌ను నిబంధనలకు విరుద్ధంగా కట్టారనేది నిపుణుల అభిప్రాయం. అంతేకాదు 2018లో బిల్డింగ్ బేస్మెంట్ బాగా దెబ్బతిందని, ఆ ప్రభావం గోడల మీద కూడా కనిపిస్తోందని ఓ ఇంజినీర్ రిపోర్ట్ ఇచ్చాడు కూడా. అయితే కుట్ర కోణాలను, ఆరోపణలను, అభిప్రాయాలను అధికారులు ఖండిస్తున్నారు. దుర్ఘటన కారణాలపై ఇప్పుడు నిర్ధారణకే రాలేమని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: మియామీ దుర్ఘటన.. కుట్ర కోణం?.. ఆయన సూసైడ్‌తో లింక్! -
వైరల్: కొంచెం ఉంటే వారి ప్రాణాలు గాల్లో కలిసేవి..
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని డాటియా జిల్లాలో పీతాంబర పట్టణంలో వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా పేకమేడలా కూలి పోయింది. పెళపెళ మంటూ పెద్ద శబ్ధంతో నడిరోడ్డుపై ఆ ట్యాంక్ కూలిపోయింది. ఆ సమయంలో రోడ్డు మీదున్న నడుస్తున్న జనాలు రెప్పపాటులో పక్కకు తప్పుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్ ఈ పురాతన ట్యాంక్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. నెట్టింట ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోని నెటిజన్లు తెగ చూస్తున్నారు एमपी के दतिया में पीतांबरा पीठ के सामने बनी बारादरी ट्रैक्टर की टक्कर में ज़मीन पर आ गिरी, मलबे के चपेट में आने से लोग बाल बाल बचे. ट्रैक्टर अवैध बालू ढो रहा था pic.twitter.com/o8kZfLhm2H — Ganesh Thakur (@7_ganesh) May 25, 2021 -
తౌక్టే బీభత్సం: చూస్తుండగానే కుప్పకూలిన భవనం
తిరువనంతపురం: ఆరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. తౌక్టే తుపాను ప్రభావంతో సముద్రం ఎగిసిపడుతోంది. దీంతో కేరళలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్రంలో వాతావరణం భయానకంగా మారింది.కేరళలోని కసర్గడ్లో తుపాన్ ప్రభావంతో వీచిన గాలులకు ఒక అంతస్తు ఉన్న భవనం కుప్పకూలింది. ఆ భవనం సముద్రపు జలాల్లో కలిసిపోయింది. అదృష్టవశాత్తు తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆ భవనంలో ఎవరూ లేరు. ఈ తుపాను ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కేరళలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తుపానుపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నాయి. ప్రధాని నరేంద్రమోదీ ఆ తుపాను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర సహాయక బృందంతో పాటు రాష్ట్రాలు తుపాను నష్టాన్ని తగ్గించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. చదవండి: వైరల్ వీడియో: ఎలుకల వర్షం చూశారా చదవండి: రెడ్ అలర్ట్.. ముంచుకొస్తున్న తుపాను.. -
‘నా కళ్ల ముందే చచ్చిపోయారు.. అంతా ముగిసిపోయింది’
లక్నో: ‘‘మా తమ్ముడు అర్వింద్ కుమార్‌కు చాలా సార్లు ఫోన్ చేశాను. తన నుంచి సమాధానం రాలేదు. కాసేపటి తర్వాత వేరొక వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేశారు. భవనం పైకప్పు కూలిపోయిందని చెప్పారు. వెంటనే నేను అక్కడికి బయల్దేరాను. నా తమ్ముడిని కాపాడుకోవాలని శతవిధాలా ప్రయత్నించాను. శిథిలాలల్లో కూరుకుపోయిన తన మృతదేహాన్ని బయటకు తీసుకురావడానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. అయినా ఆశ చావక తనను ఆస్పత్రికి తీసుకువెళ్లాను. కానీ అప్పటికే తన ప్రాణం పోయిందని వైద్యులు ధ్రువీకరించారు. అంతా ముగిసిపోయింది. నా తమ్ముడు మమ్మల్ని వదిలివెళ్లాడు’’ అంటూ శ్మశాన ప్రమాదంలో తన కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న రాకేశ్ కుమార్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనలో తన తల్లి స్వల్ప గాయాలతో బయటపడిందని, అయితే 36 ఏళ్ల వయస్సులోనే ఈ లోకాన్ని వీడిన తన చిన్న కొడుకుని తలచుకుంటూ విలపిస్తున్న ఆమెను ఓదార్చాడం తమ వల్ల కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శ్మశానవాటికకు వెళ్లిన 23 మంది మృత్యువాత పడిన విషయం విదితమే. ఉత్తరప్రదేశ్‌లోని మురాద్‌నగర్‌లో గల స్థానిక శ్మశానవాటికలో ఉఖ్లార్సికి చెందిన జైరామ్‌కు తుది వీడ్కోలు పలుకుతున్న సమయంలో వర్షం కారణంగా పక్కనే ఉన్న భవనం పైకప్పు కూలిన ఈ ఘటన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. తన తాతయ్యను కడసారి చూసేందుకు ఢిల్లీ నుంచి యూపీ వచ్చిన అర్వింద్ కుమార్ సహా 22 మంది ప్రాణాలు కోల్పోయారు.(చదవండి: శ్మశానంలో విషాదం) నాతో మాట్లాడుతూనే.. ఈ ప్రమాదంలో మృత్యువాత పడిన జైవీర్ సింగ్(50) సోదరుడు ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘గంటన్నర తర్వాత, క్రేన్ సహాయంతో రక్షణ బృందాలు తనను బయటకు తీశారు. అప్పుడు నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ తన వల్ల కాలేదు. అలా నా కళ్ల ముందే తను చనిపోయాడు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఈ ఘటనలో గాయపడిన ఉద్ధమ్ సింగ్(25) అనే యువకుడు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంతటి విషాదం చోటుచేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కళ్లముందే ఇద్దరు వ్యక్తులు విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయారని, ఈ ప్రమాదానికి యోగి సర్కారు బాధ్యత వహించాలని పేర్కొన్నాడు. కాంట్రాక్టర్‌ను అరెస్టు చేయాలి ‘‘దాదాపు 20 నిమిషాల పాటు నేను స్పృహలో లేను. కళ్లు తెరచి చూసే సరికి శిథిలాల పడి ఉన్నా. ఇద్దరు స్నేహితులు వచ్చి నన్ను బయటకు తీశారు. నిజానికి దాదాపు నెలరోజుల క్రితమే ఈ షెల్టర్ నిర్మించారు. కానీ ఒకసారి వర్షం పడగానే కప్పు కూలిపోయింది. దీనిని నిర్మించిన కాంట్రాక్టర్‌ను వెంటనే జైలుకు పంపించాలి’’ అని ఉద్ధమ్ సింగ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. -
శ్మశానంలో ప్రమాదం.. 23 మంది మృతి
ఘజియాబాద్: బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శ్మశానవాటికకు వెళ్లిన 23 మందిని మృత్యువు కబళించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మురాద్‌నగర్‌లోని ఉఖ్లార్సికి చెందిన జైరామ్ అంత్యక్రియలు స్థానిక శ్మశానవాటికలో జరుగుతున్నాయి. అదే సమయంలో వర్షం ప్రారంభం కావడంతో హాజరైన చాలామంది అక్కడే ఉన్న భవనంలోకి చేరుకున్నారు. అకస్మాత్తుగా భవనం పైకప్పు కూలి వారిపై పడింది. దీంతో అక్కడికక్కడే 23 మంది చనిపోగా మరో 15 మంది గాయపడ్డారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. డాగ్‌స్క్వాడ్ సాయంతో శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని గుర్తించి వెలికితీశారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఆదివారం సాయంత్రం వరకు మృతుల్లో 18 మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఇటీవలే నిర్మించిన ఈ కట్టడం కూలి, అనూహ్యంగా ప్రాణ నష్టం సంభవించడంపై సీఎం పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. మృతదేహాలను తరలిస్తున్న దృశ్యం -
కుప్పకూలిన భవనం.. 17 మంది దుర్మరణం
సాక్షి ముంబై: మహారాష్ట్ర థానే జిల్లా భివండీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని మూడంతస్తుల భవనం నేలమట్టం కావడంతో అందులోని 17 మంది మృతి చెందారు. మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు ఏడుగురు ఉన్నారు. ఈ సంఘటనలో 20 మంది సురక్షితంగా బయటపడ్డారు. భివండీ ధామన్కర్నాకా పటేల్ కాంపౌండ్ ప్రాంతంలోని మూడంతస్తుల భవనం సోమవారం వేకువజామున 3.15 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. అంతా గాఢ నిద్రలో ఉండగా జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని వారు ఉలిక్కిపడ్డారు. బాధితుల హాహాకారాలు విని ఇరుగుపొరుగు వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ ఘటన స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపాదికపై సహాయక చర్యలు ప్రారంభించారు. ఉదయం 11 గంటల సమయానికి 13 మందిని శిథిలాల నుంచి కాపాడగలిగారు. సహాయక చర్యలు సోమవారం రాత్రి వరకు కొనసాగాయి. సాయంత్రం 6.15 గంటల వరకు అందిన వివరాల మేరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది సురక్షితంగా బయటపడ్డారు. బాధితుల్లో చాలా మంది తీవ్రంగా గాయపడటంతో వారందరికీ వెంటనే ఆస్పత్రులకు తరలించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుపోయి∙ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు 43 ఏళ్లనాటి ఈ శిథిల భవనం ప్రమాదకరమైందంటూ భివండీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. 40 ఫ్లాట్లున్న ఈ భవనంలో 150 మంది వరకు నివాసం ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల సాయం ప్రకటించింది. అధికారులు మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను సస్పెండ్ చేశారు. భివండీ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. -
మహారాష్ట్రలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
ముంబై: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహద్ తాలుకా కేంద్రంలోని కాజల్‌పూరలో ఐదంతస్తుల అపార్ట్మెంట్ భవనం సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ భవనం శిథిలాల కింద దాదాపు 51 మంది చిక్కుకొని ఉండొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. రాత్రి 10 గంటల సమయంలో ఒక మృతదేహాన్ని వెలికితీశారు. ప్రాణనష్టం భారీగా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మొత్తం 45 ఫ్లాట్లు ఉన్న తారేక్ గార్డెన్ అపార్ట్మెంటు కుప్పకూలి పెద్ద ఎత్తున దుమ్ము పైకిలేచిన దృశ్యాలతో కూడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఏడుగురిని శిథిలాల కింది నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు అధికారి ఒకరు తెలిపారు. 10 ఏళ్ల కిందట నిర్మించిన ఈ అపార్ట్మెంటులో నివసించే వారిలో సగం మంది ప్రమాద సమయంలో వివిధ పనులపై బయటే ఉన్నట్లు తెలుస్తోంది. భవనం కూలుతున్న క్రమంలో దాదాపు 70 మంది బయటకు పరుగెత్తి ప్రాణాలను దక్కించుకున్నారని రాయ్‌గఢ్ కలెక్టర్ నిధి చౌదరి తెలిపారు. ఈ అపార్ట్మెం టులో నివసించే మరికొన్ని కుటుంబాలు కోవిడ్ కారణంగా స్వస్థలాలకు వెళ్లాయని ఆమె వెల్లడిం చారు. మొత్తం 51 మంది ఆచూకీ తెలియడం లేదన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే జిల్లా యంత్రాంగంతో మాట్లాడి సహాయక చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి బయలుదేరాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. -
టర్కీలో విషాదం; 18మంది మృతి
ఇస్తాంబుల్ : టర్కీ తూర్పు ప్రాంతంలో ఉన్న ఇలాజిజ్ ఫ్రావిన్స్‌లోని సివ్రిస్ జిల్లాలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. ఈ ఘటనలో సుమారు 18 మంది మృతి చెందగా, 500మందికి పైగా గాయాలపాలయ్యారు. భూకంపం ధాటికి నివాసితులు ఇళ్లు వదిలి వీధుల్లోకి పరుగెత్తారు. భూకంపం తర్వాత 60 సార్లు భూమి కంపించిందని టర్కీ విపత్తు, అత్యవసర నిర్వహణ అథారిటీ తెలిపింది. పొరుగు దేశాలైన సిరియా, లెబనాన్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. కాగా భూకంపం దాటికి కూలిన భవనాలలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు 400 మంది సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. టర్కీలో భూకంపాలు రావడం కొత్తేం కాదు. 1999లో టర్కీలోని ఇజ్మిత్ సిటీలో చోటుచేసుకున్న భారీ భూకంపం దాటికి దాదాపు 17వేల మంది మృత్యువాత పడ్డారు. -
కుప్పకూలిన భవనం : శిథిలాల కింద..
సాక్షి, ముంబై: ముంబైలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డోంగ్రీ, ఎంఏ సారంగ్ మార్గ్‌లోని కేశరీభాయి (నాలుగు అంతస్తుల) భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయ, రక్షర దళాలు సహాయ చర్యల్ని అందిస్తున్నాయి. సుమారు 40-50 మంది ఈ ప్రమాదంలో చిక్కుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షక కార్యక్రమాలను పర్యవేక్షిస్తోంది. ప్రమాదానికి కారణాలు, ప్రమాద తీవ్రతపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది. కాగా ఇటీవల ఎడతెరిపిలేని వర్షాలతో ముంబై నగరం అతలాకుతలమైంది. ఈ సందర్భంగా భవనాలు, గోడలు కూలిన పలు ఘటనల్లో దాదాపు 20మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. Mumbai: Kesarbai building has collapsed at Tandel street, in Dongri. More than 40 people are feared trapped. pic.twitter.com/H2eVbtgaH6 — ANI (@ANI) July 16, 2019 -
కూతురు కోసం 36 గంటల పోరాటం
బెంగళూరు: కర్ణాటకలోని ధార్వాడ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవంతి ఇటీవల కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరుకుంది. ఈ ఘటనలో తన కుమార్తెను కాపాడుకునేందుకు 36 గంటల పాటు ఓ తల్లి చేసిన పోరాటం వెలుగులోకి వచ్చింది. విస్టేజ్ మార్కెటింగ్ సంస్థ ఈ భవంతిలో ఆఫీస్ ఏర్పాటుచేసింది. ఈ సంస్థలో ప్రేమా ఉనకల్(36) మార్కెటింగ్ ప్రతినిధిగా చేస్తోంది. స్కూల్‌కు వేసవి సెలవు కావడంతో ప్రేమాతోపాటు ఆమె కూతురు దివ్య(8) సైతం ఆఫీస్‌కు వచ్చింది. మంగళవారం సాయంత్రం భవంతి కుప్పకూలిపోవడంతో తల్లీకుమార్తెలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. కొద్దిసేపటి తర్వాత మేలుకున్న ప్రియ, కుమార్తె కోసం వెతుకులాట ప్రారంభించింది. అక్కడే శిథిలాల కింద చిక్కుకున్న దివ్య చేతులు కనిపించాయి. ఆ చీకటిలోనే 45 నిమిషాల పాటు కష్టపడి దివ్యను బయటకు తీసుకొచ్చింది. అంతలోనే అప్పటివరకూ కదలకుండా ఉన్న మరో పిల్లర్ చిన్నారి దివ్యపై పడిపోయింది. దీంతో బాలిక బాధతో విలవిల్లాడింది. ఈ పిల్లర్ కింద చిక్కుకున్న దివ్యను కాపాడేందుకు ప్రియ మరో 24 గంటల పాటు ప్రయత్నించింది. చిన్నారి స్పృహ కోల్పోకుండా ఉండేందుకు తాను అంతసేపు మెలకువగానే ఉంది. 20న దివ్య ఏడుపు ఆపేసింది. అదేరోజు ఉదయం అధికారులు యంత్రాల ద్వారా శిథిలాల తొలగింపు ప్రారంభించారు. ఆ శబ్దం విన్న ప్రియ ‘మేమిక్కడ చిక్కుకున్నాం’ అని గట్టిగా అరిచింది. దీంతో అధికారులు ప్రియను రక్షించి ఆసుపత్రికి తరలించారు. దివ్యను శిథిలాల కిందనుంచి బయటకు తీసినప్పటికీ ఆమె అప్పటికే చనిపోయింది. ఈ విషయాన్ని ప్రియ కుటుంబ సభ్యులు ఆమెకు చెప్పలేదు. ఈ విషయమై ప్రియ పిన్ని మాట్లాడుతూ..‘ఎన్డీఆర్ఎఫ్ అధికారులు రాగానే తనను కాకుండా కుమార్తెను రక్షించాలని ప్రియ కోరింది. కానీ ఆమెను తొలుత వెలికితీసిన అధికారులు ఆసుపత్రికి తరలించారు. దివ్య అప్పటికే చనిపోయింది. ఈ దుర్ఘటనలో ప్రియ చేతులు, కాళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి. మెలకువలోకి వచ్చిన ప్రతీసారి కుమార్తె దివ్య గురించి ప్రియ అడుగుతోంది. ఏడుస్తూ అంతలోనే స్పృహ కోల్పోతోంది. కానీ దివ్య ఇక లేదన్న విషయాన్ని మేం చెప్పలేకపోతున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద 100 మంది
బెంగళూరు: కర్ణాటకలోని ధార్వాడ్‌లో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. కమలేశ్వర్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద దాదాపు వంద మంది వరకు చిక్కుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనలో ఇప్పటి వరకు ఒక మృతదేహాన్ని గుర్తించినట్లు సహాయక సిబ్బంది తెలిపారు. ఘటనలో గాయపడిన వారిని అంబులెన్స్‌ల సహాయంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భవనంలో ఒకటి, రెండు అంతస్తుల్లో నిర్మాణం పూర్తయి ఇప్పటికే పలువురు అద్దెకు ఉంటున్నారు. ఐదో అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తు భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో దాదాపు వంద మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. -
ఢిల్లీలో భవంతి కూలి ఏడుగురి దుర్మరణం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అశోక్ విహార్‌లో బుధవారం ఐదంతస్తుల భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ భవంతిని గత నెల 16న పరిశీలించిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.. కూలిపోయేందుకు సిద్ధంగా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో దుకాణం ఉండగా, మొదటి అంతస్తు ఖాళీగా ఉంది. 2, 3, 4 అంతస్తుల్లో కుటుంబాలు నివాసముంటున్నాయి. -
వర్షాలకు కూలిన శిథిల భవనం
- దంపతుల మృతి, ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమం - పాతబస్తీలో ఘటన హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీ ఆషూర్ఖానాలోని హుస్సేనీఆలం ఆషూర్ఖానా నౌభత్ ఖానా భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో భార్యాభర్తలు మృతి చెందగా... ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. సయ్యద్ మోహీనుల్లా హసన్ హైదర్(43), హథియా(38)లు దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వంశపారంపర్యంగా ఆషూర్ఖానాలో ఉంటు న్న మోహీనుల్లా ముతవల్లీగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా శనివారం రాత్రి దంపతులు కుమార్తె సమ్రీన్(12), కుమారుడు సయ్యద్ సులేమాన్(7)లతో భవనంలో నిద్రించారు. రాత్రంతా వర్షంలో తడిసిన ఆషూర్ఖానా భవనం ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో కుప్పకూలింది. హైదర్ దంపతులు, సమ్రీన్, సులేమాన్‌లకు తీవ్రగాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు హసన్, హథియాలు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. సమ్రీన్, సులేమాన్‌ల పరిస్థితి కూడా విషమంగా ఉందన్నారు. మెరుగైన వైద్యం కోసం వీరిని యశోద ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ తదితరులు సందర్శించారు. రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా: డిప్యూటీ సీఎం ఆషూర్ఖానా మృతుల కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. బాధిత కుటుంబ సభ్యులు, క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పక్షాన మృతులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి అవసరమైతే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల పిల్లలకు ఉచిత విద్యతో పాటు ఇంటి వసతి కల్పిస్తామన్నారు. మృతుల అంత్యక్రియలకు తన సొంత డబ్బు రూ. 50 వేలు అందించారు. నోటీసులిచ్చాం: గ్రేటర్ కమిషనర్ హుస్సేనీఆలంలోని ఆషూర్ఖానా శిథిలావస్థకు చేరుకోవడంతో నాలుగేళ్ల క్రితమే నోటీసులను జారీ చేశామని గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్ అన్నారు. శిథిలావస్థకు చేరిన నౌభత్ఖానా భవనాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఇప్పటికే బాధితులకు సూచించామన్నారు. శిథిలావస్థకు చేరిన ఆషూర్ఖానా మరమ్మతుల కోసం ఇప్పటికే రూ.40 లక్షల నిధులను మంజూరు చేశామన్నారు. నిధులు కాజేస్తున్నారు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆషూర్‌ఖానాలకు కేటాయించిన నిధులను వక్ఫ్ బోర్డు అధికారులు కాజేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి. కిషన్ రెడ్డి అన్నారు. హుస్సేనీఆలం ఆషూర్ఖానాలో జరిగిన సంఘటన స్థలాన్ని ఆయన సందర్శించారు.