కుప్పకూలిన భవనం : శిథిలాల కింద.. | Four-storey building collapses in Mumbai's Dongri many feared trapped | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన భవనం : శిథిలాల కింద..

Published Tue, Jul 16 2019 12:38 PM | Last Updated on Tue, Jul 16 2019 1:05 PM

Four-storey building collapses in Mumbai's Dongri many feared trapped - Sakshi

సాక్షి, ముంబై: ముంబైలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డోంగ్రీ,  ఎంఏ సారంగ్‌ మార్గ్‌లోని కేశరీభాయి (నాలుగు అంతస్తుల) భవనం  కుప్పకూలింది.  భవనం శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయ, రక్షర దళాలు సహాయ చర్యల్ని అందిస్తున్నాయి. సుమారు 40-50 మంది ఈ ప్రమాదంలో చిక్కుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం రక్షక కార్యక్రమాలను ప​ర్యవేక్షిస్తోంది.  ప్రమాదానికి కారణాలు, ప్రమాద తీవ్రతపై మరిన్ని వివరాలు  అందాల్సి వుంది.  కాగా ఇటీవల ఎడతెరిపిలేని వర్షాలతో ముంబై నగరం అతలాకుతలమైంది. ఈ సందర్భంగా భవనాలు, గోడలు కూలిన పలు ఘటనల్లో దాదాపు  20మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement