several trapped
-
కుప్పకూలిన భవనం : శిథిలాల కింద..
సాక్షి, ముంబై: ముంబైలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డోంగ్రీ, ఎంఏ సారంగ్ మార్గ్‌లోని కేశరీభాయి (నాలుగు అంతస్తుల) భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయ, రక్షర దళాలు సహాయ చర్యల్ని అందిస్తున్నాయి. సుమారు 40-50 మంది ఈ ప్రమాదంలో చిక్కుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షక కార్యక్రమాలను పర్యవేక్షిస్తోంది. ప్రమాదానికి కారణాలు, ప్రమాద తీవ్రతపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది. కాగా ఇటీవల ఎడతెరిపిలేని వర్షాలతో ముంబై నగరం అతలాకుతలమైంది. ఈ సందర్భంగా భవనాలు, గోడలు కూలిన పలు ఘటనల్లో దాదాపు 20మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. Mumbai: Kesarbai building has collapsed at Tandel street, in Dongri. More than 40 people are feared trapped. pic.twitter.com/H2eVbtgaH6 — ANI (@ANI) July 16, 2019 -
ముంబైలో భవనం కూలి ఆరుగురు మృతి
ముంబై: నగరంలో ఓ మూడంతస్తుల భవనం కూలి ఆరుగురు దుర్మరణం చెందారు. కమతిపూర ప్రాంతంలోని గ్రాంట్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శిథిలాల కింద పలువురు చిక్కుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరిని చికిత్స నిమిత్తం జేజే, నాయర్ ఆసుపత్రులకు తరలించినట్లు బీఎంసీ డిజాస్టర్ కంట్రోల్ రూమ్ అధికారులు తెలిపారు. రక్షణ చర్యల కోసం ఎనిమిది ఫైర్ ఇంజన్లతో పాటు మూడు అంబులెన్సులను రంగంలోకి దింపినట్లు అధికారులు తెలిపారు. -
పుణెలో విరిగిపడ్డ కొండచరియలు.. 17 మంది మృతి!
మహారాష్ట్రలోని పుణె సమీపంలో గల అంబెగావ్ ప్రాంతంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. వాటికింద పడి దాదాపు 17 మంది మరణించినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద దాదాపు 150 మంది వరకు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా కేంద్రం నుంచి వెంటనే విపత్తు నివారణ బృందాలను సంఘటన స్థలానికి తరలించారు. జాతీయ విపత్తు నివారణ బృందం (ఎన్డీఆర్ఎఫ్) కూడా ఇక్కడ సహాయ కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది. అయితే శిథిలాల కింద సరిగా ఎంతమంది ఉన్నారన్న విషయం, వారి పరిస్థితి ఏంటో కూడా ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. పుణె పరిసర ప్రాంతాల్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాటి ఫలితంగానే కొండచరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది.