![Seven dead as building collapses in Delhi - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/27/delhi.jpg.webp?itok=75rC9gM6)
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అశోక్ విహార్‌లో బుధవారం ఐదంతస్తుల భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ భవంతిని గత నెల 16న పరిశీలించిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.. కూలిపోయేందుకు సిద్ధంగా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో దుకాణం ఉండగా, మొదటి అంతస్తు ఖాళీగా ఉంది. 2, 3, 4 అంతస్తుల్లో కుటుంబాలు నివాసముంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment