Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Chandrababu Plans Permit Room Allowed Next To Liquor Shop1
ఏపీ లిక్కర్‌ షాపుల్లో పర్మిట్‌ రూమ్‌లు!

సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం చంద్రబాబు అదే పనిలో ఉన్నారు. మద్యం షాపులు పక్కనే పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా పర్మిట్ రూమ్‌ల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. 2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేసిన చంద్రబాబు మద్యం ధరలు తగ్గిస్తానని, రూ.99కే చీప్‌ లిక్కర్‌ ఇస్తానని హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక మద్యం బ్రాండ్ల రేట్లు తగ్గించకపోగా మరింత పెంచారు. బెల్టు షాపులు భారీ ఎత్తున అధికారిక,అనధికారిక అనుమతులిచ్చారు.ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో, ప్రతి ఊళ్లో, కుగ్రామంలో సైతం మద్యం షాపులు వెలిశాయి. వీధి వీధినా కిరాణా కొట్లతో పోటీ పడుతూ బెల్ట్‌ షాపులు పుట్టుకొచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లైసెన్స్‌ ఇచ్చిన మద్యం షాపులు 3,396 మాత్రమే ఉండగా.. వాటికి అనుబంధంగా కూటమి నేతల కనుసన్నల్లో అనధికారికంగా ఏర్పాటైన బెల్ట్‌షాపులు గత బాబు పాలనలో ఉన్న 43 వేలకు మించి ఉండటం విస్తుగొలుపుతోంది. తద్వారా కింది స్థాయిలో ఎమ్మెల్యే మొదలు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు మద్యం విధానాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ‘నీకింత.. నాకింత’ అంటూ పంచుకుతింటున్నారనే విమర్శలు కూటమి ప్రభుత్వంపై వెల్లు వెత్తుతున్నాయి. ఈ క్రమంలో విచ్చల విడిగా తాగి తూగడానికి మద్యం షాపులు పక్కనే పర్మిట్ రూమ్‌లకు అనుమతులు ఇచ్చే చర్యలకు చంద్రబాబు ఉపక్రమించారు. గతంలో ఉన్న 4500 పర్మిట్ రూమ్‌లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రద్దు చేసింది.కానీ ఇప్పుడు నేరాలు, ప్రమాదాలకు కారణమైన పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ వాటిని తెరపైకి తెచ్చింది.

IND vs ENG 3rd Test: England beat india by 22 Runs In lords Test2
జడేజా పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి

లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌-భార‌త్ మ‌ధ్య జ‌రిగిన మూడో టెస్టు మ్యాచ్‌ అభిమానుల‌ను మునివేళ్ల‌పై నిల‌బెట్టింది. ఆఖ‌రివ‌రకు నువ్వానేనా అన్న‌ట్లు సాగిన మ్యాచ్‌లో 22 ప‌రుగుల తేడాతో టీమిండియా ఓట‌మి పాలైంది. 193 పరుగుల లక్ష్యాన్ని చేధించిలేక భారత జట్టు చతికల పడింది. ఈ స్వల్ప లక్ష్య చేధనలో 170 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్‌) ఒంటరిపోరాటం చేసినప్పటికి జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆరంభం నుంచే..జ‌డేజాతో పాటు కేఎల్ రాహుల్‌(54) ప‌ర్వాలేద‌న్పించ‌గా మిగితా ప్లేయ‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. 58/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఐదో రోజు ఆట మొదలుపెట్టిన భారత్‌.. ఆరంభం నుంచే త‌డ‌బ‌డింది. రిష‌బ్ పంత్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, రాహుల్ వ‌రుస క్ర‌మంలో పెవిలియ‌న్‌కు చేరారు. ఆ త‌ర్వాత రవీంద్ర జడేజా, నితీశ్‌ కాసేపు నిలకడగా ఆడి భారత గెలుపుపై ఆశలు రెకెత్తించారు. అయితే లంచ్‌ బ్రేక్‌కు ముందు నితీశ్‌ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ మళ్లీ ఇంగ్లండ్ వైపు టర్న్‌ అయింది. ఆ తర్వాత జడేజా.. జస్ప్రీత్‌ బమ్రాతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.బుమ్రా ఇంగ్లండ్‌ పేసర్లను ఎదుర్కొంటూ జడేజాకు మద్దతుగా నిలిచాడు. అయితే 50 బంతులకు పైగా బ్యాటింగ్‌ చేసిన బుమ్రా(5) భారీ షాట్‌కు ప్రయత్నించి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మహ్మద్‌ సిరాజ్‌ సైతం తన వంతు సహకారం అందించాడు.కానీ ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో సిరాజ్‌ బౌల్డ్‌ కావడంతో టీమిండియా అభిమానుల హార్ట్‌ బ్రేక్‌ అయింది. సిరాజ్‌ సైతం భావోద్వేగానికి లోనయ్యాడు. ఇంగ్లండ్‌ మాత్రం గెలుపు సంబరాల్లో మునిగి తేలిపోయింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, కెప్టెన్ బెన్ స్టోక్స్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్టి గిల్ సేన ప‌త‌నాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు కార్స్‌ రెండు, బషీర్‌, వోక్స్‌ తలా వికెట్‌ సాధించారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 387 పరుగులు చేయగా.. టీమిండియా సైతం సరిగ్గా 387 పరుగులకే చేయగల్గింది. అనంతరం ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌటైంది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో బౌలర్లు అద్బుతంగా రాణించినప్పటికి.. బ్యాటర్లు విఫలం కావడంతో భారత్‌ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.చదవండి: మెడ చుట్టూ చేయి వేసి ఆపేశాడు!.. ఇచ్చిపడేసిన జడ్డూ

 If No Ukraine Deal Trump Warns Russia3
పుతిన్‌.. నీకు 50 రోజుల సమయం ఇస్తున్నా: ట్రంప్‌

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. వారి మధ్య యుద్ధాన్ని ఆపేందుకు మరో అడుగు ముందుకేశారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వార్నింగ్‌ ఇచ్చారు ట్రంప్‌. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు 50 రోజుల సమయం ఇస్తున్నా, ఆ లోపు యుద్ధాన్ని ఆపకపోతే మాత్రం సుంకాల పరంగా రష్యా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. ‘ పుతిన్‌ చర్యలు చాలా నిరాశను కల్గిస్తున్నాయి. యుద్ధంపై 50 రోజుల్లో డీల్‌కు రాకపోతే రష్యా ఊహించని టారిఫ్‌లు చవిచూస్తుంది. ఆ టారిఫ్‌లు కూడా వంద శాతం దాటే ఉంటాయి. రష్యా యొక్క మిగిలిన వాణిజ్య భాగస్వాములను లక్ష్యంగా చేసుకునే ద్వితీయ సుంకాలు అవుతాయి.- ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలను తట్టుకుని కొట్టుమిట్టాడుతున్న మాస్కో సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాం’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు. వైట్‌ హౌస్‌లో నాటో చీఫ్‌ మార్క్‌ రూట్‌ను కలిసిన నేపథ్యంలో ట్రంప్‌ కాస్త ఘాటుగా స్పందించారు ఇదీ చదవండి:ట్రంప్‌- పుతిన్ బ్రొమాన్స్‌ ముగిసిందా?

Sajjala Ramakrishna Reddy Fires on Chandrababu Naidu4
చంద్రబాబు పాలనపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం

సాక్షి,తాడేపల్లి: మా ఓపికను మీరు చేతగానితనంగా తీసుకోవద్దని కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం వచ్చాక తప్పుడు కేసులు అన్నింటినీ మళ్ళీ ఓపెన్ చేస్తాం.వాటిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం.. తప్పుడు కేసుల్లో ప్రమేయం ఉన్న అధికారుల్ని సైతం విచారిస్తామని స్పష్టం చేశారు.సోమవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న రాక్షస పాలనపై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రాజ్యాంగాన్ని, చట్టాలను చంద్రబాబు ప్రభుత్వం చాలా దారుణంగా దుర్వినియోగం చేస్తోంది. దీన్ని నియంతృత్వం అనాలా..? ఏమనాలి.?. అన్ని వ్యవస్థలను చంద్రబాబు దారుణంగా వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బ తీశారు. టీడీపీ చెప్పినట్టు వినకపోతే వేధిస్తున్నారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా తప్పుడు కేసులు కోసం వాడుతున్నారు.వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళ్తున్నందుకు జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై దాడి చేశారు. టీడీపీ వాళ్ళు గుడివాడలో దారి కాసి గొడవలు చేశారు. పోలీసులు ఉండగానే గంటన్నర సేపు గుండాలు మహిళ జెడ్పి చైర్మన్‌పై దాడికి దిగారు. పోలీసులు రక్షణలో వాళ్ళు దాడులు చేశారు.కారుని పోలీసులు తాళ్ళు కట్టి తీసుకెళ్లాలని యత్నించారు.పోలీసులు దాడి చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీడీపీ నాయకులు జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై దాడి చేస్తుంటే ఆపే ప్రయత్నం చేయలేదు. దాడులు జరపకుండా నిలువరించలేదు. తాము అధికారంలో ఉన్నామని,మా గురించి ఎవరు గొంతెత్తి మాట్లాడకూడదనిదాడులు చేస్తున్నారు.పోలీసులు ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు తప్పించుకోవచ్చు కానీ అందరూ చట్టం ముందు నిలబడాల్సి ఉంటుంది. దాడి చేసి తిరిగి ఉప్పాల రాముపై అక్రమ కేసు పెట్టారు. మాదాల సునీత అనే మహిళతో ఫిర్యాదు చేయించారు. ఆమె ఫ్లెక్సీలు చించారు. గాయం అయితే కారుతో గుద్దినట్టు కేసు పెట్టారు. ఉప్పాల రాము వెనకాల సీట్లు కూర్చొని ఉంటే ఆయన గుద్దించినట్టు కేసు పెట్టారు.ఎలాగైనా కేసులు పెడతాం అన్నట్టు ఇష్టానుసారం కేసులు పెట్టేస్తున్నారు. హైకోర్టు అన్ని కోర్టులకు మెకానికల్‌గా రిమాండుకు పంపొద్దు అని ఆదేశాలు ఇచ్చింది. న్యాయస్థానాలపై భయం లేకుండా ఇలాంటి కేసులు పెడుతున్నారు. వైఎస్ జగన్ బంగారు పాళ్యం పర్యటనకు వేలాది మంది రైతులు వచ్చారు. దానికి ఎల్లో మీడియా ఫోటోగ్రాఫర్ వస్తే దాడి చేశారని కేసు పెట్టారు.ఎఫ్ఐఆర్‌ని మార్చి మరి తప్పుడు కేసు పెట్టారు.నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ వాళ్ళు దాడి చేశారు. పోలీసులు ఉండగానే ప్రసన్న కుమార్ ఇంటిపై దాడి చేశారు.వాళ్ళ ముందే వస్తువులను కాల్చారు. వారం రోజులైనా ఎవరిపైనా కేసు పెట్టలేదు.ప్రసన్న కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.తాడిపత్రిలో పెద్దారెడ్డిని హైకోర్టు చెప్పినా నియోజకవర్గంలోకి రానివ్వలేదు. పొదిలి, బంగారు పాళ్యం అన్ని చోట్లా తప్పుడు కేసులు పెట్టారు. మా ప్రభుత్వం వచ్చాక తప్పుడు కేసులు అన్నింటినీ మళ్ళీ ఓపెన్ చేస్తాం. తప్పుడు కేసుల్లో ఉన్న అధికారుల పైన కూడా విచారిస్తాం. మా ఓపికను చేతకాని తనంగా తీసుకోవద్దుని సూచించారు.

Lt Governors Failure Took Us To Brink Of War Omar Abdullah5
యుద్ధానికి ఆయన వైఫల్యమే కారణం: జమ్మూ కశ్మీర్‌ సీఎం ఒమర్‌

న్యూఢిల్లీ: పెహల్గాంలో ఉగ్రదాడి, ఆపై చోటు చేసుకున్న పరిస్థితులకు తాను కారణం కాదని, అది జమ్మూ-కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా వైఫల్యమేనని ఆ రాష్ట్ర సీఎం ఒమర్‌ అబ్దుల్లా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు పెహల్గామ్‌ ఉగ్రదాడికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా కారణమన్నారు.కాగా, జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం ఉదయం గోడ దూకి మహారాజా హరిసింగ్‌కు చెందిన డోగ్రా బలగాలు కాల్చిచంపిన వీరుల స్మారకంగా ఉన్న శ్మశానం గోడ దూకి లోపలికి వెళ్లి అక్కడ అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పించారు,. డోగ్రా బలగాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 1931, జూలై 13వ తేదీన పలువురు అమరులయ్యారు. ఈ క్రమంలోనే వారికి కశ్మీర్‌లోని శ్మశాన వాటికలో స్మారక చిహ్నాలు ఏర్పాటు చేశారు. దీన్ని ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. ఆదివారం(జూలై 13) సీఎం అబ్దుల్లాను ఇంటి నుంచి కదలకుండా ఒక బంకర్‌ ఏర్పాటు చేశారు. అయితే అది సోమవారం తీసేశారు. నేడు(జూలై 14) ఒమర్‌ అబ్దుల్లా ఒంటరిగా కారులో వెళ్లి ఆ అమరులకు నివాళులు అర్పించే యత్నం చేశారు. అక్కడ అబ్దుల్లాను పోలీసులు అడ్డుకునే యత్నం చేయడంతో గోడ దూకి వెళ్లి నివాళులర్పించి వచ్చారు. దీనిపై అబ్దుల్లా మాట్లాడుతూ.. రాష్ట్రంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పాలన నడుస్తోందంటూ మండిపడ్డారు. కేంద్ర నియమించిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా చెప్పినట్లే ఇక్కడ నడుస్తోందన్నారు. అనాలోచిత నిర్ణయాలతో ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్‌లో పెహల్గాం ఉగ్రదాదాడికి, తర్వాత ఆపరేషన్‌ సింధూర్‌ వరకూ భారత్‌ వెళ్లడానికి ఎల్జీ మనోజ్‌ సిన్హా వైఫల్యమే కారణమన్నారు. జమ్మూ కశ్మీర్‌ రాష్ట్ర హోదాను తిరిగి పునరుద్ధరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

How Yediyurappa try to save his son Vijayendra Amid Turmoil PN6
క‌ర్ణాట‌క‌లో మ‌రో నాయకత్వ మార్పు?

క‌ర్ణాట‌క‌లో ఇప్పుడు ముఖ్య‌మంత్రి మార్పు గురించే అక్క‌డి రాజ‌కీయ వ‌ర్గాల్లో ఎక్క‌వగా చ‌ర్చ న‌డుస్తోంది. సీఎం సిద్ధ‌రామ‌య్య‌ను త‌ప్పించి డీకే శివ‌కుమార్‌ను ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చొబెడ‌తార‌ని ప్ర‌చారం జోరుగా సాగుతోంది. నాయ‌క‌త్వ మార్పును కాంగ్రెస్ అధిష్టానం తోసిపుచ్చింది. ముఖ్య‌మంత్రి మార్పు అంశంపై బ‌హిరంగంగా మాట్లాడొద్ద‌ని క‌న్న‌డ నేత‌ల‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన‌ప్ప‌టికీ ఏదోర‌కంగా దీనిపై చ‌ర్చ న‌డుస్తూనే ఉంది. ఇదే స‌మ‌యంలో చాప కింద నీరులా ప్ర‌తిప‌క్ష బీజేపీలోనూ ముసలం మొద‌లైంది. అయితే దీనిపై మీడియా అంత‌గా ఫోక‌స్ చేయ‌లేదు.క‌ర్ణాట‌క బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర (BY Vijayendra) సీటు కింద‌కు నీళ్లు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న నాయ‌క‌త్వంపై సీనియ‌ర్లు గుర్రుగా ఉన్న‌ట్టు తేల‌డంతో బీజేపీ నాయ‌క‌త్వం పున‌రాలోచ‌నలో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. గ్రూపు రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని, కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉండ‌డం లేద‌ని విజయేంద్రపై కేంద్ర నాయ‌క‌త్వానికి ప‌లువురు ఫిర్యాదులు చేసిన‌ట్టు స‌మాచారం. సీనియ‌ర్ నేత‌ల‌తో స‌ఖ్యత‌గా ఉండ‌డం లేద‌న్న వాద‌న‌లు విన్పిస్తున్నాయి. విజయేంద్రతో పాటు ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక పనితీరుపైనా రాష్ట్ర నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. క్యాడ‌ర్‌ను నిర్లక్ష్యం చేయడం వ‌ల్లే పార్టీలో స‌మ‌స్యలు త‌లెత్తాయ‌ని బీజేపీ సీనియ‌ర్ నేత ఒక‌రు వ్యాఖ్యానించారు.రంగం దిగిన 'అప్పా'కొడుకు ప‌ద‌వికి గండం ఏర్ప‌డే ప‌రిస్థితులు నెల‌కొన‌డంతో విజ‌యేంద్ర తండ్రి, మాజీ సీఎం యడియూరప్ప (Yediyurappa) స్వ‌యంగా రంగం దిగారు. త‌న కుమారుడిపై స్థానిక నేత‌లు, క్యాడ‌ర్‌లో నెల‌కొన్న అసంతృప్తిని తొల‌గించేందుకు ఆయ‌న ప‌య‌త్నిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ బెంగళూరులోని బీజేపీ రాష్ట్ర‌ కార్యాలయానికి వ‌స్తున్నారు. నాయకులు, కార్య‌క‌ర్త‌ల స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా వింటున్నారు. అసంతృప్తుల‌ను బుజ‌గించి గ్యాప్ త‌గ్గించేందును త‌న అనుభ‌వాన్ని వాడుతున్నారు. పార్టీ కార్యకర్తలు తమ‌ సమస్యలను నేరుగా నాయ‌క‌త్వం ముందు ప్ర‌సావించ‌డానికి వీలుగా ఒక వేదికను క‌ల్పించేందుకు యడియూరప్ప తిరిగి వ‌చ్చార‌ని బీజేపీ వ‌ర్గాలు అంటున్నాయి. "ఇది విజయేంద్ర తన సొంత నియోజకవర్గం శికారిపురపై దృష్టి పెట్టడానికి కూడా అవకాశం ఇస్తుంది" అని ఒక సీనియర్ కార్యకర్త అన్నారు.2023 నవంబర్‌లో విజయేంద్ర కర్ణాట‌క బీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత యడియూరప్ప క్రియాశీల‌క రాజ‌కీయాల‌కు దూరం జ‌రిగారు. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో కొడును గండం నుంచి త‌ప్పించ‌డానికి ఆయన తిరిగి రావాల్సి వచ్చింది. బెంగళూరులోని జగన్నాథ్ భవన్‌లో ప్ర‌తిరోజు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు పెద్దాయ‌న‌ అందుబాటులో ఉంటున్నారు. రాజ‌కీయంగా ఆయ‌న ఇంకా చురుగ్గానే ఉన్నార‌ని, గణనీయమైన ప్రభావాన్ని చూప‌గ‌ల‌ర‌ని స‌న్నిహితులు పేర్కొంటున్నారు.విజయేంద్రకు వ్య‌తిరేకంగా పావులుపార్టీ నుంచి సస్పెండ్ అయిన‌ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఎమ్మెల్యేలు బిపి హరీష్, మాజీ ఎమ్మెల్యే కుమార్ బంగారప్ప, మాజీ కేంద్ర మంత్రి జీఎం సిద్దేశ్వర నేతృత్వంలోని వర్గాలు.. విజయేంద్రకు వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్నాయి. లింబవల్లి, రమేష్ జార్కిహోళి, ప్రతాప్ సింహా, హరీష్ త‌దిరత నాయ‌కులు కూడా విజయేంద్ర నాయ‌క‌త్వంపై గుర్రుగా ఉన్నారు. పార్టీలో అస‌మ్మ‌తిని గుర్తించిన అధినాయ‌క‌త్వం.. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషిని (Pralhad Joshi) క‌ర్ణాట‌క‌కు పంపించింది. అస‌మ్మ‌తి నేత‌ల‌తో ఆయ‌న జరిపిన సమావేశాలు పెద్దగా ఫ‌లితాన్ని ఇవ్వ‌లేద‌ని అంతర్గత వర్గాల స‌మాచారం. ఇంత జ‌రుగుతున్నా విజయేంద్ర‌కే పార్టీ మ‌ద్ద‌తుగా నిలిచింది. అస‌మ్మ‌తి గ‌ళం వినిపించిన ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్‌ను స‌స్పెండ్ చేసి.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను సహించబోమని సందేశం పంపింది.నాయకత్వ మార్పు త‌ప్ప‌దా?కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల కర్ణాటక పర్యటన తర్వాత పార్టీ అంతర్గత పునర్వ్యవస్థీకరణలపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. విజయేంద్ర శిబిరం నమ్మకంగా ఉన్నప్పటికీ, నాయ‌క‌త్వ మార్పు త‌ప్ప‌ద‌ని ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. విజయేంద్ర ఢిల్లీ ప‌ర్య‌ట‌న కూడా ఈ ప్ర‌చారానికి ఊతం ఇచ్చింది. అదే స‌మ‌యంలో ప్ర‌తిపక్ష నాయ‌కుడు ఆర్ అశోక (R Ashoka) కూడా హ‌స్తిన‌లో ఉండ‌డంతో ప్ర‌చారం జోరందుకుంది. అయితే ప్ర‌తిప‌క్ష నేత‌ను మార్చే అవ‌కాశం ఉందంటూ కొత్త ప్ర‌చారం మొద‌లైంది.చ‌ద‌వండి: స్టాలిన్ చాణ‌క్యం.. ఏక‌మైన‌ మార‌న్ బ్ర‌ద‌ర్స్! ఏమైనా జ‌రగొచ్చు..పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిని మారుస్తార‌ని మేము అనుకోవ‌డం లేదు. కానీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిని మార్చే అవ‌కాశం ఉంద‌ని పార్టీ సీనియర్ నాయ‌కుడొక‌రు వెల్ల‌డించారు. ఏమైనా జ‌రగొచ్చు అంటూ మ‌రో సీనియ‌ర్ నేత వ్యాఖ్యానించారు. "ఎవరూ హైకమాండ్ మనసును చదవలేరు. కానీ ఒకటి మాత్రం స్పష్టం. పార్టీని ఏకం చేసి మమ‌ల్ని ఎన్నికల మోడ్‌లోకి నడిపించగల వ్యక్తిని అధినాయ‌క‌త్వం ఎంపిక చేస్తుంద‌"ని అన్నారు. మ‌రి కొడుకును కాపాడ‌టానికి కోసం రంగంలోకి దిగిన యడియూరప్ప తాను అనుకున్న‌ది సాధిస్తారా, లేదా అనేది వేచి చూడాలి.

Can Husband Ask For Alimony From His Wife UP Jyoti Alok Case7
భర్త కనుపాప అలసి.. న్యాయం కోసం ఎదురు చూపులు..

భార్య నుంచి భర్త భరణాన్ని కోరవచ్చా? చట్టాలు అందుకు సమ్మతిస్తాయా?. పిల్లల్ని మాత్రమే చదివించాలని.. భార్యలను చదివించవద్దని సోషల్‌ మీడియాలో ఆ మధ్య ప్రచారం ఎందుకు నడిచింది?. భరణానికి.. ఈ ప్రచారానికి అసలు సంబంధం ఏంటి?.. జ్యోతి-అలోక్‌ కేసు సంచలన తీర్పునకు వేదిక కాబోతోందా?. ఇదంతా తెలియాలంటే ఈ సంచలన కేసు వివరాల్లోకి వెళ్లాల్సిందే.. జ్యోతి మౌర్య ఉత్తర ప్రదేశ్‌లో పీసీఎస్‌ అధికారిణి. ఆమె భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగే(శానిటేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో 4వ కేడర్‌ ఉద్యోగి). అయితే గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తన భార్య నుంచి భరణం కోరుతూ ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. తన భార్య జ్యోతి సంపాదన తన కంటే చాలా ఎక్కువని, పైగా తనకున్న అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని భరణం ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌ వేశాడతను.గతంలో ప్రయాగ్‌రాజ్‌ ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఆయన అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. విచారణకు ‍స్వీకరించిన కోర్టు.. జ్యోతి మౌర్యకు నోటీసులు పంపింది. ఈ కేసులో తదుపరి విచారణ ఆగష్టు 8వ తేదీన జరగనుంది. అయితే ఈ కేసు ఇప్పటికిప్పుడే వార్తల్లోకి ఎక్కింది కాదు. బాగా చదివించిన భార్య తనను మోసం చేసి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందుంటూ చాన్నాళ్ల కిందట వైరల్‌ అయిన కథనం తాలుకాదే..!పారిశుద్ధ్య కార్మికుడైన అలోక్‌ మౌర్యకు 2010లో జ్యోతి అనే యువతితో వారణాసి చిరైగావ్‌ గ్రామంలో జరిగింది. అప్పటికి ఆమె వయసు 20 ఏళ్లు. డిగ్రీ చేసి ఇంటి వద్దే ఖాళీగా ఉంటోంది. దీంతో.. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ కావాలని అలోక్‌ ఆమెను ప్రొత్సహించాడు. అలా ఆమె కష్టపడి 2015లో పీసీఎస్‌(Provincial Civil Services) పరీక్షలు రాసి 16వ ర్యాంకుతో సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్ జాబ్‌ దక్కించుకుంది. అప్పటి నుంచి జౌన్‌పూర్‌, కౌశంబి, ప్రతాప్‌ఘడ్‌, ప్రయాగ్‌రాజ్‌లలో ఆమె విధులు నిర్వహించింది. ఆ జంటకు 2015లో కవల పిల్లలు పుట్టారు.2020లో వీళ్ల కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన హోం గార్డ్‌ కమాండెంట్‌ మనీష్‌ దుబేతో జ్యోతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో అలోక్‌-జ్యోతి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో లక్నోలోని ఓ హోటల్‌లో ఈ ఇద్దరినీ రెడ్‌హ్యాండెండ్‌గా అలోక్‌ పట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన తర్వాత భర్తకు దూరంగా ఉంటూ వచ్చింది జ్యోతి. ఈ క్రమంలో.. 2023లో తనను హత్య చేసేందుకు తన భార్య జ్యోతి కుట్ర పన్నుతుందంటూ అలోక్‌ పోలీసులను ఆశ్రయించాడు. అదే సమయంలో జ్యోతి కూడా తనను కట్నం కోసం భర్త, అతని కుటుంబం వేధిస్తోందంటూ కేసు పెట్టారు. ఈలోపు జ్యోతి అవినీతి బాగోతమంటూ వాట్సాప్‌ చాటింగ్‌, డైరీకి సంబంధించిన పేజీలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. అప్పుడే తనకు న్యాయం కావాలంటూ అలోక్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియో నెట్‌లో బాగా వైరల్‌ అయ్యింది.ఇదిలా ఉండగా.. ఈ కేసు నేపథ్యంలో ‘‘బేటీ పడావో.. బీవీ నహీ(పిల్లలను చదివించండి.. భార్యలను కాదు)’’ అంటూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌, పోస్టులతో చర్చ నడిచింది. ఏకంగా కొందరు ఈ లైన్‌ మీద బాణీలు కట్టి యూట్యూబ్‌లలో వదిలారు. సరిగ్గా అదే సమయంలో ఓ కులాన్ని కించపరిచేలా జ్యోతి చేసిన ప్రసంగం నెట్టింట మంట పుట్టించింది. జ్యోతి క్షమాపణలు చెప్పాలంటూ భీమ్‌ ఆర్మీ నిరసలకు దిగింది. భర్త భరణానికి అర్హుడేనా?హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్‌ 24 ప్రకారం.. పోషించుకోలేని పరిస్థితుల్లో భార్యభర్తల్లో ఎవరికైనా సరే భరణం పొందే అర్హత ఉంది. ఈ లెక్కన ఈ భరణం పిటిషన్‌.. రాబోయే రోజుల్లో చర్చనీయాంశమయ్యే అవకాశం లేకపోలేదు.ప్రొఫెషనల్‌గానూ..వ్యక్తిగత జీవితంతోనే కాదు.. వృత్తిపరంగానూ జ్యోతి మీద విమర్శలు ఉన్నాయి. ఇంతకు ముందు బరేలీ సెమీఖేదా షుగర్‌ మిల్‌కు ఆమె జనరల్‌ మేనేజర్‌గా పని చేశారు. ఆమె హయాంలో వివిధ కార్యకలాపాల జాప్యంతో చెరుకు రైతులు నిరసనలకు దిగారు. ఇటు రైతులే కాదు, అటు తోటి అధికారులు ఆమె వ్యవహార శైలిపై ఫిర్యాదులు చేశారు. దీంతో.. 2023లో ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. లక్నో హెడ్‌ క్వార్టర్స్‌కు ఆమెను బదిలీ చేసినప్పటికీ.. ఇప్పటిదాకా ఎలాంటి బాధ్యతలను అప్పజెప్పకపోవడం గమనార్హం.

Kadapa Arts College Jagan Flexi Shocks To Kutami Government8
నీ అడుగుల్లో నడిచే పరిస్థితి తీసుకొచ్చావ్‌ కదా జగనూ..!

ఎంత పని సేచ్చి వయ్యా జగనూ.. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడం ఇష్టం లేని చంద్రబాబుకు సంక్షేమం అంటే ఏంటో నేర్పిస్తండావు. మీ నాయన ఆయనకి పాలన అంటే ఏంటో చూపిస్తే,ఇప్పుడు నువ్వు నేర్పించినావు కదా... తండ్రికి మించిన తనయుడువు అయితివి అబ్బా.. ఎంత పని సేచ్చి వయ్యా జగనూ.. అంటూ కడప ఆర్ట్స్ కాలేజీ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ప్లెక్సీ అటుగా వెళ్లే వారిని ఆకర్షిస్తుంది. అక్కడే కాసేపు నిలబడి ఆ ఫ్లెక్సీలోని పాయింట్లన్నీ ఆమూలాగ్రం చదివేలా చేస్తోంది.. ఆ తండ్రీకొడుకులిద్దరూ కళ్లు మూసుకుని నిన్ను ఫాలో అయ్యే పరిస్థితి తీసుకొచ్చావ్‌ కదయ్యా!. నిత్యం నిన్ను అవమానించే వాళ్ళు, నీ ఇమేజ్‌కు డామేజ్ చేసే వాళ్లు కూడా.. కిక్కురు మనకుండా నీ అడుగుల్లో నడిచే పరిస్థితి తీసుకొచ్చావ్‌ కదయ్యా. ఎంత పని చేశావయ్యా జగన్..!! అంటూ అందులో రాసి ఉంది.. .. వాస్తవానికి చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్‌కు పేదలంటే ఇష్టం ఉండదు!. అదొక అసహ్యమనే భావనలో ఉంటారు వాళ్లు. సర్కారు బడుల్లో, ప్రభుత్వ ఆసుపత్రులు, పథకాలు, సంక్షేమం వగైరా అంటే వారికి అసలు గిట్టదు. కానీ ప్రభుత్వం అంటే ప్రజలు అని.. ప్రజలతో మమేకం కాకుండా పరిపాలన చేసిన అది నిజమైన ప్రభుత్వం కాదు అని వైఎస్ జగన్ నిరూపించారు. ఐదేళ్ల పరిపాలనలో నిత్యం ఆయన ధ్యాస తపన ఆలోచన ప్రజల చుట్టూనే ఉండేది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను అమలు చేయాల్సిందే అని పట్టుబట్టిన ఆయన వాటి జాబితాను తన కార్యాలయ గోడలకు అతికించి నిత్యం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటి అమలుకు ముందడుగు వేస్తూ ఉండేవారు. అయితే.. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత నేడు చంద్రబాబు కూడా వైయస్ జగన్ వేసిన బాటలోనే నడుస్తున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు తొలిసారిగా తల్లికి వందనం అంటూ ఓ పథకాన్ని ఇచ్చారు. వాస్తవానికి అది గతంలో జగన్ ‘అమ్మ ఒడి’ పేరిట ఇచ్చిన పథకమే. కానీ దాన్ని తామే కొత్తగా కనిపెట్టినట్లుగా ప్రజలను నమ్మిస్తూ వస్తున్నారు. జగన్ తన పరిపాలనలో ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు పేరిట ఆధునికంగా తీర్చిదిద్దారు. ఇంగ్లీష్ మీడియం. సబ్జెక్ట్ టీచర్లు ఇలా రకరకాల కాన్సెప్ట్లతో ప్రభుత్వ విద్య విధానంలో నాణ్యత పెంచారు. ఇప్పుడు అదే పాఠశాలల్లో చంద్రబాబు లోకేష్ ఫోటోలు దిగి పిల్లలతో ముచ్చట్లు చెబుతూ అదంతా తమ ఘనతగా పత్రికల్లో రాయించుకుంటున్నారు. ఇలా ఎన్నో అంశాలను సదర్ ఫ్లెక్సీలో పేర్కొన్న రహస్య అభిమాని.. ‘‘ఎంత పని చేసావు జగన్’’ అంటూ జగన్ అభినందిస్తూనే చంద్రబాబు పడుతున్న తిప్పలను హాస్యపూరితంగా వివరించారు.నీ ఒత్తిడి భరించలేక పేద పిల్లలకు చంద్రబాబు తనకి ఇష్టం లేకపోయినా తల్లికి వందనం ఇచ్చాడు. నువ్వు అప్పట్లో అగ్రిమెంట్ చేసుకున్న పరిశ్రమలు ప్రాజెక్టులు పథకాలనే చంద్రబాబు లోకేష్ ఇప్పుడు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. నువ్వు గతంలో ప్రజలతో మమేకం అయినట్లుగానే ఇప్పుడు చంద్రబాబు కోరికన్నా ముందు నిద్రలేచి టీ స్టాళ్ళు.. చేపల బజార్లు.. సందులు.. గొందుల్లో తిరుగుతూ జనంతో కలిసి ఫోటోలు దిగుతున్నారు.. ఇవన్నీ గతంలో నువ్వు చేసినవి కాక మరేమిటి జగనూ!. .. నీ పర్యటనలకు తండోపతండాలుగా వస్తున్న జనాన్ని ఆపలేక చంద్రబాబు ఆఖరుకు తన కడుపు మంటను మంత్రుల మీదకు వెళ్ళగకుతున్నారు.. ఇది కూడా నువ్వే చేశావు జగనూ!. కూటమిలోని మూడు పార్టీలకు ఒకరంటే ఒకరికి పసగకపోయినా నీ భయంతో అందరూ చేతులు పట్టుకొని జట్లు పట్టుకొని ఒకరినొకరు పొగుడుకునేలాగా చేశావు.. విడిపోతే ముగ్గురూ అస్సామే అనే పరిస్థితి తీసుకొచ్చావు జగనూ!. నువ్వు ఏ ఊరికి పర్యటనక పోతే అక్కడ ముందుగానే పరిస్థితులు చక్కపెట్టేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అక్కడి సమస్యలపై ఉరుకున పరుగున స్పందించే ప్రయత్నమూ చేస్తున్నారు.. ఎంత పని చేసావు జగనూ!.నువ్వు ఓడిపోయినా.. రాష్ట్రంలో మీ పరిపాలనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దాన్ని ఈ తండ్రి కొడుకులు కచ్చితంగా చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చావ్‌.. ఎంత పని చేశావు జగనూ! అంటూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ అందర్నీ ఆలోచింపజేస్తోంది.::సిమ్మాదిరప్పన్న

Kalki 2898 AD nominated Indian Film Festival of Melbourne Awards 20259
టాలీవుడ్‌ నుంచి కల్కి మూవీ.. ప్రతిష్టాత్మక నామినేషన్స్‌లో చోటు!

టాలీవుడ్ మూవీ కల్కి 2898 ఏడీ చిత్రం సత్తా చాటింది. ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రభాస్-నాగ్ అశ్విన్‌ కాంబోలో వచ్చిన కల్కి ఉత్తమ చిత్రం విభాగంలో పోటీలో నిలిచింది. ఈ విభాగంలో హోమ్‌బౌండ్, ఎల్‌2 ఎంపురాన్, మహారాజ్, స్త్రీ-2, సూపర్‌బాయ్స్‌ ఆఫ్ మాలేగావ్‌ సినిమాలతో పోటీ పడనుంది.అంతేకాకుండా ఉత్తమ నటుడు‌ విభాగంలో మోహన్‌లాల్‌ (ఎల్‌2 ఎంపురాన్‌), అభిషేక్‌ బచ్చన్‌ (ఐ వాంట్‌ టు టాక్‌), ఆదర్శ్‌ గౌరవ్‌ (సూపర్‌బాయ్స్‌ ఆఫ్‌ మాలేగావ్‌), ఇషాన్‌ ఖట్టర్‌ (హోమ్‌బౌండ్‌), విశాల్‌ జెత్వా (హోమ్‌బౌండ్‌), జునైద్‌ ఖాన్‌ (మహారాజ్‌) పోటీలో నిలిచారు. ఉత్తమ నటి విభాగంలో అంజలీ శివరామన్‌ (బ్యాడ్‌గర్ల్‌), భనితా దాస్‌ (విలేజ్‌ రాక్‌స్టార్స్‌ 2), కరీనా కపూర్‌ (ది బకింగహామ్‌ మర్డర్స్‌), శ్రద్దా కపూర్‌ (స్త్రీ -2), తిలోత్తమ షోమ్‌ (షాడోబాక్స్‌) పోటీ పడుతున్నారు.వీటితో పాటు బెస్ట్ వెబ్ సిరీస్, బెస్ట్‌ ఫీమేల్ యాక్టర్‌(వెబ్ సిిరీస్), బెస్ట్‌ మేల్ యాక్టర్‌(వెబ్ సిరీస్‌) జాబితాను కూడా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ఆగస్టు 14న ప్రకటించనున్నారు. ఈ వేడుకను ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ వేదికగా ఆగస్టు 14 నుంచి 24 వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

Check Bharti Singh weight loss journey Lost 15 Kg In 10 Months With A Simple tips10
సింపుల్‌ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్‌ టాప్‌లు

ప్రముఖ హాస్యనటి,'లాఫర్ క్వీన్' భారతీ సింగ్‌ (Bharti Singh) చాలా కష్టపడి బరువును తగ్గించుకొని స్లిమ్‌గా మారడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. 10 నెలల్లో దాదాపు 15 కిలోలు వెయిల్‌ లాస్‌ అయ్య ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. యూట్యూబర్ నటి ప్రజక్తా కోలితో జరిగిన పాడ్‌కాస్ట్‌లో, భారతీ తన వెయిట్‌ లాజ్‌జర్నీ గురించి వివరించింది.భారతీ సింగ్ వెయిట్ లాస్ జర్నీ ఇలాకేవలం బరువు తగ్గడం మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కూడా ఆలోచించింది భారతీ సింగ్‌. ఎందుకంటే అప్పటికే ఆమె ఆస్తమా . డయాబెటిస్‌తో బాధపడేది. ఎక్కువగా తల తిరుగుతూ ఉండేది. ఒక్కోసారి ఊపిరి ఆడేది కాదు. డాక్టర్ల సలహామేరకు ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించింది. 2021లో 91 కిలోల నుండి 76 కిలోలకు తగ్గించుకుని ఆటు ఫ్యాన్స్‌ను ఇటు సినీ అభిమానులను ఆశ్చర్య పర్చింది. బరువుతగ్గడం వల్ల ఆత్మవిశ్వాసంతోపాటు, ఆరోగ్యంగా, శక్తివంతంగా మారినట్టు తెలిపింది. అంతేకాదు డయాబెటిస్, ఆస్తమా కూడా నియంత్రణలో ఉన్నాయని సంతోషంగా చెప్పింది. ఇపుడు తాను చాలాఫిట్‌గా, హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. తలతిరగడాలు, ఊపిరి ఆడకపోవడంలాంటి ఇబ్బందులేవీ లేవని వెల్లడించింది.అడపాదడపా ఉపవాసం Intermittent Fastingసాయంత్రం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉపవాసం. మధ్యాహ్నం ఆహారం తీసుకునేది. 30-32 ఏళ్లుగా చాలా తినేశాను. ఆ తరువాత సంవత్సరం పాటు విరామం ఇచ్చాను.2022 అధ్యయనం ప్రకారం అడపాదడపా ఉపవాసం జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇదిబ ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.కడుపు మాడ్చుకోలే, ఇష్టమైన ఫుడ్‌ను త్యాగతం చేయలేదు: తనకిష్టమైన ప్రతిదాన్ని ఆహారంలో చేర్చుకునేది. కానీ మితంగా తినడాన్ని అలవాటు చేసుకుంది. తనకెంతో ఇష్టమైన రెగ్యులర్ పరాఠాలు, గుడ్లు, పప్పు-సబ్జీ, నెయ్యి ఇవన్నీ తీసుకునేదాన్నని తెలిపింది. పోర్షన్ కంట్రోల్: అతిగా తినకుండా తనను తాను నియంత్రించుకుంది. ఎక్కువ కేలరీలు తీసుకోకుండా పోర్షన్ కంట్రోల్‌ను అలవాటు చేసుకున్నానని భారతీ సింగ్ తెలిపింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ ప్రకారం, పోర్షన్ కంట్రోల్ సాధన చేయడం అధిక బరువును తగ్గించుకోవచ్చు.ఇదీ చదవండి: Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!ఖచ్చితమైన మీల్‌ టైమింగ్స్‌ : భోజనం టైమింగ్స్‌ పాటించకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుందనీ, అందుకే తాను తన భోజన సమయాలను పాటించేదానన్ని గుర్తు చేసుకుంది. బాగా హెక్టిక్‌ పనుల్లో ఉంటే, బాగా లేట్‌ నైట్‌ తినడం వదిలివేసింది. వేళగాని వేళ తినడాన్ని పూర్తిగా మానేసింది. మరో విధంగా చెప్పాలంటే రాత్రి 7 గంటల తర్వాత నో డిన్నర్‌ సూత్రం తు.చ తప్పకుండా పాలించింది. ఇది తన బరువును తగ్గించుకోవడంలో చాలా ఉపయోగపడిందని తెలిపింది. 15 కిలోల భారీ బరువు తగ్గడం చాలా ఆనందానిచ్చిందని భారతీ సింగ్‌కు సంతోషంగా తెలిపింది. క్రాప్‌ టాప్స్‌, ఇంకా ఇష్టమైన బట్టలు వేసుకోగలగడం భలే సంతోషాన్నిస్తోందని చెప్పింది.బరువు తగ్గడం స్లిమ్‌గా కనపించడం ఆనందాన్ని ఇవ్వడం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంచి అనుభూతిని కలిగిస్తుంది. కష్టంగా కాకుండా, ఇష్టంగా నిష్టగా కృషి చేస్తే భారతీ సింగ్‌లా మంచి ఫలితాలను సాధించడం కష్టమేమీ కాదేమో కదా!ఇదీ చదవండి: TodayRecepies బనానాతో ఇలాంటి వెరైటీలు ఎప్పుడైనా ట్రై చేశారా?

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement