బెంగళూరు: కర్ణాటకలోని ధార్వాడ్‌లో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. కమలేశ్వర్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద దాదాపు వంద మంది వరకు చిక్కుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనలో ఇప్పటి వరకు ఒక మృతదేహాన్ని గుర్తించినట్లు సహాయక సిబ్బంది తెలిపారు.
ఘటనలో గాయపడిన వారిని అంబులెన్స్‌ల సహాయంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భవనంలో ఒకటి, రెండు అంతస్తుల్లో నిర్మాణం పూర్తయి ఇప్పటికే పలువురు అద్దెకు ఉంటున్నారు. ఐదో అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తు భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో దాదాపు వంద మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.
Comments
Please login to add a commentAdd a comment