ఇజ్రాయెల్ వరుస వైమానిక,భూతల దాడులతో ప్రకృతి సోయగాలతో పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే లెబనాన్ దేశ రాజధాని బీరూట్ చిగురుటాకులా వణికిపోతుంది.
తాజాగా ఇజ్రాయెల్ శనివారం సాయంత్రం నుంచి బీరూట్‌లోని హెబ్‌బొల్లా కమాండ్ సెంటర్లు, అణ్వాయుదాలు నిల్వ ఉంచే స్థావరాలు, టెన్నెల్స్,మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. పేలుళ్ల దాటికి దక్షిణ బీరుట్, దాని పరిసర ప్రాంతాలు రెండుగంటలకు పైగా బాంబుల మోతలతో దద్దరిల్లిపోయాయి. దీంతో బీరూట్‌లో జరిగిన అత్యంత హింసాత్మక ఘటనలో తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడి ఒకటిగా నిలిచినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ వైమానిక దాడులపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి మాట్లాడుతూ.. మేము హెజ్‌బొల్లాపై మరింత ఒత్తిడి తేవాలి. ఉపశమనం లేకుండా హెజ్‌బొల్లాకు కంటి మీద కునుకు లేకుండా చేయాలి. విశ్రాంతి ఇవ్వకుండా శాస్వత నష్టం కలిగించేలా చేయాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment