బాంబు దాడుల్లో 11 మంది మృతి | 11memebers killed in bomb attacks at Nigeria | Sakshi
Sakshi News home page

బాంబు దాడుల్లో 11 మంది మృతి

Published Wed, Jul 12 2017 6:56 PM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

11memebers killed in bomb attacks at Nigeria

అబుజా: నైజీరియాలోని  మైదుగురి నగరంలో రెండు వరుస బాంబుదాడులు జరిగాయి. నగరంలోని ములైకల్ ములైకల్‌మారి, సాబోన్‌ గారి అనే రెండు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహుతి దళ సభ్యులు తమను తాము పేల్చుకోవడంతో వారితో సహా 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

బోకో హరమ్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వారు ఈ దాడులకు పాల్పడి ఉంటారని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బోకో హరమ్ ఉగ్ర సంస్థ తిరుగుబాటు దాడుల్లో 2009 నుంచి ఇప్పటి వరకు సుమారు 20 వేల మంది చనిపోయారు. సుమారు 23 లక్షల మంది ఇళ్లు వాకిలీ వదిలి వేరే ప్రదేశాలకు వెళ్లిపోయారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement