ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రికత్తంగా మారాయి. ముఖ్యంగా హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య తర్వాత పరిస్థితులు మరింత జఠిలమయ్యాయి. ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తున్న హనీయాను ఇరాన్‌లో కోవర్ట్ ఆపరేషన్‌తో అంతమొందించింది. అందుకు ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా ప్రయాత్నాలు ముమ్మరం చేసింది.
ఇందులో భాగంగా హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్‌లోని బీట్ హిల్లెల్ నగరంపై డజన్ల కొద్దీ కటియుషా రాకెట్లను ప్రయోగించింది. వాటిల్లో కొన్నింటిని ఇజ్రాయెల్ నిలువరించింది. ఇక ఈ దాడిపై హిజ్బుల్లా అధికారిక ప్రకటన చేసింది.
కేఫర్ కేలా, డెయిర్ సిరియాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిందని, ఫలితంగా ఆ ప్రాంతాల పౌరులు గాయపడ్డారని, అందుకే తాము కటియుషా రాకెట్లను ప్రయోగించినట్లు వెల్లడించింది. వరుస పరిణామాలపై ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పారిపోతామంటే ప్రాణభిక్ష పెడతామని కాదంటే అంతు చూస్తామని హెచ్చరిస్తోంది. అమెరికా సాయం కూడా తీసుకుంటుంది.
ఇజ్రాయెల్‌కు రక్షణగా అమెరికా
ఈ తరుణంలో ఇజ్రాయెల్‌కు రక్షణగా, దానికి సాయం చేసేందుకు ఆ ప్రాంతంలో అదనపు యుద్ధ నౌకలను, ఫైటర్ జెట్లను మోహరిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ చెప్పింది. అదే సమయంలో ఇరాన్ మద్దతు ఇస్తున్న హిజ్బుల్లా ప్రాభవం ఎక్కువగా ఉన్న లెబనాన్‌ను ఖాళీ చేయమని పాశ్చాత్య దేశాలు తమ పౌరులకు సలహా ఇచ్చాయి. ఇప్పటికే అనేక విమానయాన సంస్థలు ఈ ప్రాంతానికి రాకపోకల్ని నిలిపివేశాయి.
స్కూల్‌పై దాడి వెనువెంటనే హమాస్ చీఫ్ హతం
టెహ్రాన్‌లో హనియా హత్య, బీరూట్‌లో హిజ్బుల్లా మిలిటరీ చీఫ్ ఫువాద్ షుక్ర్‌ను చంపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించినట్లు కొద్ది సేపటికే హిజ్బుల్లా కటియుషా రాకెట్లను ప్రయోగించింది. ఇప్పటికే హిజ్బుల్లా ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. జులై 14న నుసిరత్ శరణార్థి శిబిరంలోని అబు ఒరేబన్ పాఠశాలపై జరిపిన దాడిలో 17 మంది పిల్లలు మరణించగా,80 మంది గాయపడ్డారు. స్కూల్‌పై దాడి తర్వాతనే హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీ, హిజ్బుల్లా మిలిటరీ చీఫ్ ఫువాద్ షుక్ర్‌ను హతమార్చి ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment