ఇజ్రాయెల్‌ దాడులతో గజ‘గాజా’ | Israel pounds Gaza with air strikes | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ దాడులతో గజ‘గాజా’

Published Sun, Aug 7 2022 6:37 AM | Last Updated on Sun, Aug 7 2022 6:37 AM

Israel pounds Gaza with air strikes - Sakshi

గాజా సిటీ:  గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం శనివారం కూడా వైమానిక దాడులు కొనసాగించింది. హమాస్‌ ఉగ్రవాదులకు సంబంధించిన పలు నివాసాలు నేలమట్టమయ్యాయి. ఇజ్రాయెల్‌ దాడిలో గాజాలో ఓ కారు ధ్వంసమయ్యింది. అందులోని 75 ఏళ్ల వృద్ధురాలు మరణించింది.

మరో ఆరుగురు గాయపడ్డారు. హమాస్‌ ఉగ్రవాదులు సైతం ఎదురుదాడులకు దిగారు. దక్షిణ ఇజ్రాయెల్‌లపై బాంబుల వర్షం కురిపించారు. ఈ బాంబు దాడుల్లో ఎంతమేరకు నష్టం వాటిల్లందనే సమాచారం తెలియరాలేదు. శుక్రవారం ఇజ్రాయెల్‌ దాడుల్లో గాజాలో 14 మంది దుర్మరణం పాలయిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement