ఇజ్రాయెల్ సైతన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య గత మూడు వారాలుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. అక్టోబర్ 7న గాజా స్ట్రిప్ నుంచి చొరబడిన హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడగా.. ఇజ్రాయెల్ ప్రతికార దాడి చేపట్టింది. ఇరు వర్గాల మధ్య పెద్దఎత్తున కాల్పులు జరుగుతున్నాయి హమాస్ మిలిటెంట్ల సొరంగాలు, రహస్య స్థావరాలను నేలమట్టం చేయడమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం పోరాడుతోంది. గాజాపై భూతల, వైమానిక దాడులు ఉధృతం చేసింది.
ఇజ్రాయెల్ బాంబుల దాడుల తీవ్రతకు గాజా అల్లాడుతోంది. మంగళవారం ఇజ్రాయెల్ క్షిపణుల ధాటికి వందలాది నివాసాలు నేలమట్టమయ్యాయి. ఒక్క రోజే ఏకంగా 300 ‘లక్ష్యాలను’ ఛేదించినట్టు ఆ దేశ సైన్యం ప్రకటించింది. ముఖ్యంగా గాజాలోని అతిపెద్ద శరణార్థుల శబిరంపై జరిపిన వౌమానిక దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోపల్పోయారు. ఈ కాల్పుల్లో హమాస్ సీనియర్ కమాండర్ హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది
ఇద్దరు హమాస్ కమాండర్‌లు హతం!
అక్టోబర్ ఏడో తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ భారీ మెరుపుదాడికి పథక రచన చేసిన హమాస్ ఉత్తర డివిజన్ కమాండర్ నసీమ్ అబు అజీనా తమ దాడుల్లో హతమైనట్టు సైన్యం పేర్కొంది. అదే విధంగాహమాస్ సెంట్రల్ జబాలియా బెటాలియన్ కమాండర్ ఇబ్రహీం బియారీ సైతం హతమార్చినట్లు బుధవారం ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో గాజా ప్రాంతమంతా పూర్తిగా నాశనమైంది.దీంతో అక్కడి నివాసితులందరూ తమ భద్రత కోసం దక్షిణం వైపు వెళ్లాలని ఐడీఎఫ్ పిలుపునిచ్చింది.
తొమ్మిది వేలకు చేరిన మరణాలు
ఇక ఇప్పటిదాకా పోరుకు బలైన పాలస్తీనియన్ల సంఖ్య 8,525 చేరిందని గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 3,542 మది చిన్నారులు, 2,187 మంది మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ దాడులు మొదలైన తర్వాత వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఇక్కడ 122 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారు.
ఓవైపు మరణాల సంఖ్య పెరుగుతున్నా హమాస్‌ను నిర్మూలించేదాకా కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పునరుద్ఘాటించారు. కాల్పులు ఆపడమంటే హమాస్ ఉగ్రవాదులకు, తీవ్రవాదానికి లొంగిపోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం, హమాస్ నాయకుడు సలేహ్ అల్-అరూరి ఇంటిని ఇజ్రాయెల్ సైన్యం కూల్చివేసింది. యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి అంటోనీ బ్లింకెన్ శుక్రవారం ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment