photo credit: AP
సియోల్: దక్షిణ కొరియా, ఉత్తర కొరియా మధ్య ఉన్న వివాదాస్పద సముద్ర సరిహద్దుపై శుక్రవారం ఉదయం ఉత్తర కొరియా బాంబ్ షెల్స్ వర్షం కురిపించింది. 200 ఆర్టిలరీ రౌండ్ల షెల్స్ వేసింది. దీంతో అక్కడే ఉన్న దక్షిణ కొరియాకు చెందిన రెండు ఐలాండ్‌లలోని ప్రజలను స్థానిక యంత్రాంగం తరలిస్తోంది.
దక్షిణ కొరియా మిలిటరీ అధికారుల విజ్ఞప్తి మేరకే ఐలాండ్ ప్రజలను తరలిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే ఐలాండ్‌లలోని ప్రజల తరలింపు ఉత్తర కొరియా బాంబు దాడుల వల్లనా లేదంటే దక్షిణ కొరియా చేపట్టిన మిలిటరీ డ్రిల్ వల్లా అనేదానిపై దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇవ్వలేదు.
‘దక్షిణ, ఉత్తర కొరియాల మధ్య ఉన్న వివాదస్పద సముద్ర సరిహద్దు లైన్‌పై ఉత్తర కొరియా శుక్రవారం ఉదయం 200 ఆర్టిలరీ షెల్స్ ప్రయోగించింది. ఈ షెల్స్ దాడిలో ఎలాంటి నష్టం జరగలేదు. ఉత్తర కొరియా కావాలని రెచ్చగొడుతోంది. ఇది 2018 మిలిటరీ ఒప్పందం ఉల్లంఘనే. ఉత్తర కొరియా షెల్లింగ్‌పై సరైన రీతిలో స్పందిస్తాం’అని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment