boarder issue
-
North Korea: కొరియా దేశాల మధ్య ఉద్రిక్తత
సియోల్: దక్షిణ కొరియా, ఉత్తర కొరియా మధ్య ఉన్న వివాదాస్పద సముద్ర సరిహద్దుపై శుక్రవారం ఉదయం ఉత్తర కొరియా బాంబ్ షెల్స్ వర్షం కురిపించింది. 200 ఆర్టిలరీ రౌండ్ల షెల్స్ వేసింది. దీంతో అక్కడే ఉన్న దక్షిణ కొరియాకు చెందిన రెండు ఐలాండ్లలోని ప్రజలను స్థానిక యంత్రాంగం తరలిస్తోంది. దక్షిణ కొరియా మిలిటరీ అధికారుల విజ్ఞప్తి మేరకే ఐలాండ్ ప్రజలను తరలిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే ఐలాండ్లలోని ప్రజల తరలింపు ఉత్తర కొరియా బాంబు దాడుల వల్లనా లేదంటే దక్షిణ కొరియా చేపట్టిన మిలిటరీ డ్రిల్ వల్లా అనేదానిపై దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇవ్వలేదు. ‘దక్షిణ, ఉత్తర కొరియాల మధ్య ఉన్న వివాదస్పద సముద్ర సరిహద్దు లైన్‌పై ఉత్తర కొరియా శుక్రవారం ఉదయం 200 ఆర్టిలరీ షెల్స్ ప్రయోగించింది. ఈ షెల్స్ దాడిలో ఎలాంటి నష్టం జరగలేదు. ఉత్తర కొరియా కావాలని రెచ్చగొడుతోంది. ఇది 2018 మిలిటరీ ఒప్పందం ఉల్లంఘనే. ఉత్తర కొరియా షెల్లింగ్‌పై సరైన రీతిలో స్పందిస్తాం’అని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. ఇదీచదవండి..ఆదిత్య ఎల్1.. రేపు కీలక పరిణామం -
అరుణాచల్ సరిహద్దులో చైనా కొత్త రైల్వేలైన్
బీజింగ్: సరిహద్దు విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే.. మరోవైపు భారత్‌ను రెచ్చగొట్టే చర్యలకు చైనా పాల్పడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తోంది. సిచువాన్–టిబెట్ రైల్వే మార్గంలో భాగంగా నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లోని యాన్ నుంచి టిబెన్‌లోని లింజీ వరకు ఈ కొత్త లైన్ నిర్మిస్తారు. ఇది సరిగ్గా అరుణాచల్ సరిహద్దు నుంచే వెళ్లనుంది. చదవండి: పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉంది.. ఈ రైల్వే లైన్లో రెండు సొరంగాలు, ఒక బ్రిడ్జి, ఒక విద్యుత్ సరఫరా ప్రాజెక్టు తదితరాలు నిర్మిస్తారు. ఈ మేరకు బిడ్డింగ్ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు చైనా రైల్వే వర్గాలు తెలిపాయి. నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నాయి. సిచువాన్–టిబెట్ రైల్వే లైన్ చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డూలో మొదలవుతుంది. లాసాలో ముగుస్తుంది. ఈ రైల్వేలైన్‌తో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గిపోతుంది. చదవండి: చైనా వెళ్లిన భారతీయుల్లో 19 మందికి పాజిటివ్ -
భారత ఆర్మీ మానవత్వం, చైనాకు ఏం ఇచ్చిందంటే?
ఈటానగర్: చైనా భారత్ సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న ఈ సమయంలోనూ భారత్ మానవత్వాన్ని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్, చైనా సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సంచరిస్తున్న 13 జడల బర్రెలు, 4 దూడలపై మానవత్వం చూపుతూ.. వాటిని చైనా సైన్యానికి మన దేశ జవాన్లు అప్పగించారు. ఈ విషయాన్ని ఈస్ట్రన్ కమాండ్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. చైనా అధికారులు వీటి స్వీకరించి కృతజ్ఞతలు తెలిపారని ట్వీట్లో పేర్కొంది. "ఆగస్టు 31న ఈస్ట్ కమేంగ్ ప్రాంతంలో ఇవి తిరుగుతూ కనిపించాయి. వీటిపై మానవత్వం చూపిస్తూ, ఈ నెల 7వ తేదీన చైనా అధికారులకు అప్పగించాం" అని పేర్కొంది. ఈ చర్యలు ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలు తగ్గించడానికి ఉపయోగపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా ఓ వైపు ద్వైపాక్షిక చర్చలు జరుపుతూనే, మరోవైపు కవ్వింపు చర్యలకు దిగుతోందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎమ్ నారావణే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాంగ్యాంగ్ సరస్సు వద్ద ఉన్న కీలక ప్రాంతాలపై పట్టు కోసం ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. గల్వాన్ లోయలో ఇరు దేశాల మధ్య కాల్పులు కూడా జరిగాయి. పరిస్థితిని పునరుద్దరించడానికి ఇరుదేశాల నేతలు అనేక సార్లు చర్యలు జరుపుతున్నప్పటికీ ఈ సమస్య ఒక కొలిక్కి రావడం లేదు. ఫింగర్ గల్వాన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్, కొంగ్రుంగ్ నాలా తదితర ప్రాంతాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. గత జూన్ లో చైనా దళాలతో పోరులో 20 మందికి పైగా భారత జవాన్లు అమరులైన తరువాత ఈ ప్రాంతంలో పరిస్థితులు క్షీణించాయి. చదవండి: పారదర్శకంగా వ్యవహరించాం: జిన్‌పింగ్ -
మరోసారి తెరపైకి కంగనా!
ముంబాయి: బాలీవుడ్ నటి కంగనారనౌత్ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సమాజంలో జరిగే ప్రతివిషయంపై స్పందిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ విషయాలకు సంబంధించి తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. చైనా- ఇండియా బోర్డర్ వివాదంలో మరణించిన వీరసైనికులక సోషల్‌మీడియా వేదికగా కంగన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చైనాతో మనందరం కలిసి కట్టుగా ఐక్యమత్యంగా పోరాడాలంటూ కంగనా పిలుపునిచ్చారు. దేశం కోసం అమరులైన వారి త్యాగాలను ఎప్పటికి మర్చిపోకూడదు అని అన్నారు. అందుకే చైనా వస్తువులను ఇండియా నుంచి బహిష్కరించాలని కంగనా పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఆమె టీం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. (ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించిన హీరోయిన్) -
సామరస్య స్వరం అవసరం
ఎట్టకేలకు నేపాల్ ప్రభుత్వం తాను అనుకుంటున్న భౌగోళిక సరిహద్దులతో ఒక మ్యాప్‌ను విడుదల చేసి, అందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం కూడా పొందింది. మన ఉత్తరాఖండ్‌లో భాగంగా వున్న లింపియాధుర, కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలు తన మ్యాప్‌లో చూపింది. మొదట్నించీ మన పొడగిట్టని చైనా, పాకిస్తాన్‌లు ఈ మాదిరే చేశాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొంత భూభాగాన్ని చైనా... జమ్మూ–కశ్మీర్‌లోని కొంత ప్రాంతాన్ని పాకిస్తాన్ తమ భూభాగాలుగా చెప్పుకుంటూ మ్యాప్‌లు రూపొందించాయి. అయితే ఆ దేశాల మాదిరే నేపాల్‌ను చూడాల్సిన అవసరం లేదు. నేపాల్ అత్యుత్సాహం ప్రదర్శించి చర్చలకు తలుపులు మూసేసిందని మన దేశం కొంత ఘాటుగానే వ్యాఖ్యానించింది. అయినా ఇరు దేశాల మధ్యా వున్న చారిత్రక, సాంస్కృతిక అనుబంధం నేపథ్యంలో చర్చలు జరగడమే సరైంది. సరిహద్దు సమస్య హఠాత్తుగా ఉనికిలోనికి వచ్చింది కాదు. ఇరు దేశాల మధ్యా ఎప్పటినుంచో కొనసాగుతోంది. పూర్వపు సోవియెట్ యూనియన్, చైనాల మధ్య సిద్ధాంత సారూప్యత వున్నా వాటిమధ్య సరిహద్దు విషయంలో విభేదాలొచ్చిన సంగతి మరిచిపోకూడదు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిని ఇరు పక్షాలూ ప్రదర్శిస్తే పరిష్కారం కష్టం కాదు. భారత్, నేపాల్ దేశాలు రెండూ ఆ సంగతి ఇదివరకే నిరూపించాయి. గత 26 ఏళ్లలో చర్చల ద్వారా సరిహద్దుకు సంబంధించిన 98 శాతం సమస్యల్ని పరిష్కరించుకున్నాయి. కేవలం సుస్తా, కాలాపానీ ప్రాంతాల సమస్య మాత్రమే అపరిష్కృతంగా వుండిపోయింది. మిగిలిన కొద్దిపాటి సమస్యనూ అవి జటిలం చేసుకుంటాయని అనుకోలేం. కానీ విషాదమేమంటే చూస్తుండగానే అది ముదిరిపోయింది. చర్చల ప్రక్రియ ప్రారంభం కావలసిన తరుణంలో ఇరు దేశాల్లోనూ కొందరు అనవసర ఉద్వేగాలు పెంచుకోవడం, అందరిలోనూ పెంచడానికి ప్రయత్నించడం పర్యవసానంగా పరిస్థితి ఇంతవరకూ వచ్చింది. భారత్, నేపాల్ దేశాల మధ్య ఎంతటి బలమైన అనుబంధం వుండేదో చెప్పడానికి చరిత్ర వరకూ పోవాల్సిన అవసరం లేదు. మన సైన్యంలో ఇప్పటికీ నేపాలీలు జవాన్లుగా, అధికారులుగా పనిచేస్తున్నారు. ఏటా నేపాల్ యువకులు అనేకులు మన సైన్యంలో సైనికులుగా చేరుతుంటారు. సరిహద్దుపై పెను వివాదం రాజుకున్న ఈ సమయంలో కూడా సైన్యంలో పనిచేస్తున్న ముగ్గురు నేపాలీ కేడెట్లు మన ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ) నుంచి పట్టభద్రులై శనివారం అధికారులుగా పదోన్నతి పొందారు. సైన్యంలోని దాదాపు 40,000మంది గూర్ఖా సైనికులు భారత్ తరఫున వివిధ యుద్ధాల్లో పాల్గొని, ఈ దేశ సార్వభౌమత్వానికై పోరాడి సాహస అవార్డులు పొందారు. పలువురు తమ ప్రాణాలు బలి ఇచ్చారు. మన సైనిక దళాల చీఫ్ నేపాల్ ఆర్మీకి... నేపాల్ ఆర్మీ చీఫ్ మన దేశ సైనికులకు గౌరవ చీఫ్‌గా వుండటం ఎప్పటినుంచో కొనసాగుతోంది. బ్రిటిష్ వలస పాలకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ స్వాతంత్య్రానంతరం మన పాలకులు కూడా నేపాల్ సరిహద్దులను ఆంక్షలకు అతీతంగా వుంచారు. నేపాలీలు ఇక్కడ చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, వ్యాపారాలు నిర్వహించుకోవడానికి ఎలాంటి నిషేధాలూ లేవు. సరుకు రవాణా విషయంలోనూ ఇదే విధానం కొనసాగుతోంది. నేపాల్‌కు సముద్ర తీరం లేదు గనుక తనకు కావాల్సిన సరుకుల్ని దిగుమతి చేసుకోవడానికి అది మన దేశంలోని ఓడరేవుల్ని వినియోగించుకుంటుంది. 1950లో ఇరు దేశాల మధ్యా కుదిరిన శాంతి, స్నేహ ఒప్పందంతో ఇవన్నీ సాధ్యమయ్యాయి. అయితే నేపాల్‌లో హిందూ రాజరికాన్ని కూలదోసి, అది ప్రజా రిపబ్లిక్‌గా అవతరించడానికి కారణమైన అంతర్యుద్ధ సమయంలో అక్కడి ప్రజల మనోభావాల్లో మార్పులొచ్చాయి. ఆధారపడక తప్పని పరిస్థితులున్నాయి గనుక భారత్ చిన్నచూపు చూస్తున్నదన్న భావనను నేపాలీ పౌరుల్లో పెంచడంలో అక్కడి పార్టీలు విజయం సాధించాయి. సకాలంలో దీన్ని గ్రహించి, దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో మన పాలకులు విఫలమయ్యారు. అసలు ఆ దేశంతో వున్న సంబంధాలను పటిష్టపర్చుకోవాలన్న ధ్యాస, అపోహలేమైనా వుంటే పోగొట్టాలన్న ఉద్దేశం మన పాలకులకు లేకుండా పోయింది. నేపాల్, భూటాన్లతో వున్న ఉమ్మడి సరిహద్దుల నుంచి గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు మన దేశానికి అక్రమ రవాణా అవుతుంటాయి. హైదరాబాద్‌లోనూ, ఇతరచోట్లా అప్పుడప్పుడు పట్టుబడే మాదకద్రవ్యాల్లో అత్యధికం ఆ ప్రాంతంనుంచే వస్తాయి. ఇక్కడినుంచి నేపాల్‌కు ఔషధాల అక్రమ రవాణా సాగుతుంటుంది. వీటిని సరిదిద్దడానికైనా మనకు నేపాల్ సహకారం అవసరం. కేంద్రంలో ఎవరు అధికారంలో వున్నారన్న అంశంతో నిమిత్తం లేకుండా మన నేతలు నేపాల్‌తో సుహృద్భావ సంబంధాలు నెలకొల్పుకునే అంశంలో విఫలమయ్యారు. ఇరు దేశాల మధ్యా ఏ చిన్న సమస్య రాజుకున్నా లబ్ధి పొందుదామని చైనా కాచుక్కూర్చున్నదని తెలిసి కూడా ఉపేక్షించారు. చైనాతోపాటు నేపాల్‌లోని నేతలు సైతం ఇదే దృష్టితో వ్యవహరిస్తున్నారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ఒంటెత్తు పోకడలపై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వుంది. ఓలి నేతృత్వంలోని సీపీఎన్(యూఎంఎల్), ప్రచండ సారథ్యంలోని సీపీఎన్(ఎంసీ)లు రెండేళ్లక్రితం విలీనమై నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(ఎన్సీపీ)గా ఏర్పడ్డాయి. ఓలి తీరు నచ్చని ప్రచండ నిప్పులు చెరుగుతున్నారు. ఈ సమయంలో సరిహద్దు సమస్య ఓలికి వరంలా మారింది. మన దేశంలో మీడియా కావొచ్చు...యోగి ఆదిత్యనాథ్‌లాంటి నేతలు కావొచ్చు విపరీత వ్యాఖ్యలకు దిగడాన్ని ఓలి చక్కగా వినియోగించుకున్నారు. నేపాలీ జాతీయతను రెచ్చగొట్టారు. దౌత్యం ద్వారా పరిష్కారం కావలసిన సమస్యల్ని బజారున పడేస్తే అవి మరింత జటిలమవుతాయి. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సామరస్యపూర్వక స్వరం వినిపించారు. ఆ దృక్పథంతో నేపాల్‌తో చర్చిస్తే ఉభయులకూ ఆమోదయోగ్యమైన పరిష్కారం అసాధ్యమేమీ కాదు. -
హై నుంచి 600 పాయింట్లు పతనం : తిరిగి లాభాలు
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు దేశంలోని ఉద్రిక్తతల నడుమ ఊగిసలాటతో కొనసాగుతున్నాయి. ఆరంభం తరువాత ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనుకావడంతో ఒక్కసారిగా అమ్మకాలకు తెరతీశారు. సెన్సెక్స్ దాదాపు 226 పాయింట్లు పతనమైంది. తద్వారా ఇంట్రాడే గరిష్టం నుంచి సెన్సెక్స్ సుమారు 600 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ కూడా 10800 స్థాయినుంచి కిందికి పతనమైంది ప్రస్తుతం నష్టాలనుంచి తేరుకున్న సెన్సెక్స్ 26 పాయింట్లు ఎగిసి 36వేల స్థాయి వద్ద ఉంది. నిఫ్టీ 10836 వద్ద ఉంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. పీఎస్‌యూ బ్యాంక్స్ తప్ప దాదాపు అన్ని రంగాలూ బలహీనపడ్డాయి. ఐటీ, మెటల్, ఆటో, రియల్టీ 1-0.5 శాతం మధ్య క్షీణించాయి.విప్రో, టాటా మోటార్స్, వేదాంతా, ఇన్ఫ్రాటెల్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, టైటన్ టాప్ లూజర్స్‌గా ఉ న్నాయి. మరోవైపు అల్ట్రాటెక్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, యాక్సిస్, ఎల్అండ్టీ, సన్ ఫార్మా యూపీఎల్, ఎస్బీఐ, పవర్‌గ్రిడ్ అదానీ పోర్ట్స్ లాభపడుతున్నాయి. -
'తొలి బుల్లెట్ భారత్ ఎప్పుడూ కాల్చలేదు'
న్యూఢిల్లీ: సరిహద్దు వెంబడి ఉన్న భారత సైన్యం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మొట్టమొదటి బుల్లెట్ పాకిస్థాన్ సైన్యంపైకి కాల్చలేదని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. మున్ముందు కూడా అలా చేయబోదని తెలిపారు. పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడిన తర్వాతే భారత్ స్పందించిందని అన్నారు. ఢిల్లీలో సరిహద్దు విభాగానికి చెందిన ఉన్నతాధికారుల సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. మూడు రోజులపాటు జరగనున్న ఈ సమావేశానికి హాజరైన రాజ్‌నాథ్ పాక్ సైన్యం చర్యలపట్ల సూటిగా బదులిచ్చినట్లు తెలిసింది. దీంతోపాటు ఉగ్రవాదుల విషయంలో కూడా స్పష్టమైన సూచనలు పాకిస్థాన్ సైన్యానికి ఇచ్చారు. పాక్ భూభాగం నుంచి ఏ ఒక్క ఉగ్రవాది కూడా భారత భూభాగంలోకి చొరబడకుండా చూడాల్సిన బాధ్యత పాక్ సైనికులదేనని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఉగ్రవాద నిర్మూలన కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు.