
ముంబాయి: బాలీవుడ్ నటి కంగనారనౌత్ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సమాజంలో జరిగే ప్రతివిషయంపై స్పందిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ విషయాలకు సంబంధించి తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. చైనా- ఇండియా బోర్డర్ వివాదంలో మరణించిన వీరసైనికులక సోషల్‌మీడియా వేదికగా కంగన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చైనాతో మనందరం కలిసి కట్టుగా ఐక్యమత్యంగా పోరాడాలంటూ కంగనా పిలుపునిచ్చారు. దేశం కోసం అమరులైన వారి త్యాగాలను ఎప్పటికి మర్చిపోకూడదు అని అన్నారు. అందుకే చైనా వస్తువులను ఇండియా నుంచి బహిష్కరించాలని కంగనా పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఆమె టీం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
(ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించిన హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment