
బీజింగ్: సరిహద్దు విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే.. మరోవైపు భారత్‌ను రెచ్చగొట్టే చర్యలకు చైనా పాల్పడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తోంది. సిచువాన్–టిబెట్ రైల్వే మార్గంలో భాగంగా నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లోని యాన్ నుంచి టిబెన్‌లోని లింజీ వరకు ఈ కొత్త లైన్ నిర్మిస్తారు. ఇది సరిగ్గా అరుణాచల్ సరిహద్దు నుంచే వెళ్లనుంది. చదవండి: పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉంది..
ఈ రైల్వే లైన్‌లో రెండు సొరంగాలు, ఒక బ్రిడ్జి, ఒక విద్యుత్ సరఫరా ప్రాజెక్టు తదితరాలు నిర్మిస్తారు. ఈ మేరకు బిడ్డింగ్ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు చైనా రైల్వే వర్గాలు తెలిపాయి. నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నాయి. సిచువాన్–టిబెట్ రైల్వే లైన్ చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డూలో మొదలవుతుంది. లాసాలో ముగుస్తుంది. ఈ రైల్వేలైన్‌తో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గిపోతుంది. చదవండి: చైనా వెళ్లిన భారతీయుల్లో 19 మందికి పాజిటివ్
Comments
Please login to add a commentAdd a comment