New railway lines
-
భద్రాచలం మీదుగా తూర్పుగోదావరి వరకు కొత్త రైల్వే లైన్: మంత్రి అశ్విని వైష్ణవ్
సాక్షి, ఢిల్లీ: బెంగాల్‌లోని అసోన్‌సోల్ నుంచి వరంగల్ వరకు కొత్త రైల్వే కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విణి వైష్టవ్. రాబోయే ఐదేళ్ల కాలంలో దీన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు జరుగుతాయన్నారు.కాగా, రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అసోన్‌సోల్ నుంచి వరంగల్ వరకు కొత్తగా రైల్వే కారిడార్ ప్లాన్ చేశాం. రూ.7,383 కోట్లతో మల్కాన్ గిరి నుంచి పాండురంగపురం వరకు వయా భద్రాచలం మీదుగా తూర్పుగోదావరి వరకు నూతన రైల్వే లైన్‌కు శ్రీకారం చుట్టాము. ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. బొగ్గు రవాణాకు ఈ కారిడార్ ఎంతగానో సహాయపడుతుంది. అలాగే, పవర్ ప్లాంట్‌కు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.ఇక, గోదావరి నదిపై కూడా ఒక బ్రిడ్జి నిర్మిస్తాం. ఏపీలో 85.5 కిలోమీటర్లు, తెలంగాణలో 19 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం చేపడుతున్నాం. తుపాను వంటి విపత్తుల సమయంలో ఈ లైన్లో రైల్వేలు నడుపుతాం. విశాఖ రైల్వే జోన్ కోసం చర్చలు జరుగుతున్నాయి అంటూ కామెంట్స్ చేశారు. 8 new railway line projects covered 3 states including Odisha #NarendraModi #aswinivaishnav #DharmendraPradhan pic.twitter.com/Qvbc3lEc0d— Bibhuna Ray (@Bibhunaray) August 10, 2024 -
ఎనిమిది కొత్త రైల్వేలైన్ ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంలో భాగంగా ఎనిమిది నూతన రైల్వేలైన్ ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సుమారు రూ.24,657 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ఎనిమిది ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్ కేబినెట్ సమావేశానంతరం మీడియాకు ఆ వివ రాలు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులన్నీ 2030–31 కల్లా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.⇒ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహా రాష్ట్ర, జార్ఖండ్, బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రా ల్లోని 14 జిల్లాల పరిధిలో ఈ ప్రాజెక్టుల నిర్మా ణం జరుగుతుంది. అందులో భాగంగానే కొత్తగా 64 రైల్వేస్టేషన్లు నిర్మిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం, మల్కన్‌గిరితోపాటు ఆరు ఆకాంక్ష జిల్లాల్లోని 510 గ్రామాలతోపాటు దాదాపు 40 లక్షల మంది జనాభాకు రైల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ⇒ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించి మల్క న్గిరి–పాండురంగాపురం (భద్రాచలం మీదుగా) 173.61 కి.మీ పొడవున నూతన రైల్వేలైన్ నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టులో ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాతోపాటు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా, తెలంగాణలోని భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలు ఉన్నాయి. ప్రముఖ పుణ్య క్షేత్రమైన భద్రాచలాన్ని ప్రధాన రైల్వేలైన్‌తో అనుసంధానించేందుకు ఇది ఉపయోగపడనుంది. వీటితోపాటు తొలిసారిగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన అజంతా గుహలను రైల్వే నెట్‌వర్క్‌కు అనుసంధానిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలా...మల్కన్‌గిరి నుంచి పాండురంగాపురం వరకు గత ఏడాది ఫైనల్ లొకేషన్స్ సర్వే మంజూరైంది. ఆ వెంటనే సర్వే పనులు పూర్తి చేయడంతో కేంద్ర ప్రభు త్వం ఇప్పుడు ఆ మార్గాన్ని నిర్మించేందుకు సిద్ధప డింది. ఈ కొత్త రైల్వేలైన్ వల్ల భద్రాద్రి కొత్తగూడెంలోని రైలు అనుసంధానం లేని కొత్త ప్రాంతాలకు రైల్వే వసతి ఏర్పడుతుంది. సరుకు రవాణా ప్రధాన లక్ష్యంగానే ఇది నిర్మిస్తున్నప్పటికీ ప్రయాణికుల రైలు కూడా దీని మీదుగా నడపనున్నట్టు అధికా రులు చెబుతున్నారు. ఇందుకు దాదాపు రూ. 3,592 కోట్లు ఖర్చు చేయబోతోంది.జునాగఢ్ నుంచి మల్కన్‌గరి, మల్కన్‌గిరి నుంచి పాండురంగాపురం వరకు... ఈ రెండు లైన్లు కలిపి చూస్తే అయ్యే వ్యయం రూ.7,383 కోట్లు. ఈ ప్రాజెక్టు కోసం 1697 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. సెంట్రల్ సౌత్ ఇండియాలోని పవర్ ప్లాంట్లకు మహానది కోల్డ్‌ఫీల్డ్‌కు ఇది దగ్గర దారి కాబోతోంది. బస్తర్ రీజియన్‌కు మధ్య 124 కిలోమీటర్ల దూరాభారాన్ని కూడా ఇది తగ్గించనుంది. -
TS/AP: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణకు కొత్త రైల్వే ప్రాజెక్ట్‌లకు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి కొత్త ప్రాజెక్ట్‌ల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు. మంజూరైన కేంద్ర ప్రాజెక్టుల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్‌కు భూమి అడిగాం. భూమి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. చర్లపల్లి కనెక్టివిటీ రోడ్‌కు కూడా రాష్ట్రం స్పందించట్లేదు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ 2024లో ప్రారంభిస్తాం. యాదాద్రి ఎంఎంటీస్‌తో సహా పలు ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. త్వరలో సికింద్రాబాద్ - బెంగళూరు మధ్య వందే భారత్ రైలును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కొత్త రైల్వేలైన్లు ఇవే.. ► ఆదిలాబాద్ నుంచి పటాన్చెరువు వరకు కొత్త రైల్వేలైన్. ► వరంగల్ నుంచి గద్వాల వరకు కొత్త రైల్వేలైన్. ► ఉందానగర్ నుంచి జగ్గయ్యపేట వరకు కొత్త రైల్వేలైన్. ► వికారాబాద్-కృష్ణా మధ్య కొత్త రైల్వేలైన్. ► ఆర్ఆర్ఆర్ చుట్టూ ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్. ఇది కూడా చదవండి: టార్గెట్ కడియం.. ఎమ్మెల్యే రాజయ్య సంచలన కామెంట్స్ -
అరుణాచల్ సరిహద్దులో చైనా కొత్త రైల్వేలైన్
బీజింగ్: సరిహద్దు విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే.. మరోవైపు భారత్‌ను రెచ్చగొట్టే చర్యలకు చైనా పాల్పడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తోంది. సిచువాన్–టిబెట్ రైల్వే మార్గంలో భాగంగా నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లోని యాన్ నుంచి టిబెన్‌లోని లింజీ వరకు ఈ కొత్త లైన్ నిర్మిస్తారు. ఇది సరిగ్గా అరుణాచల్ సరిహద్దు నుంచే వెళ్లనుంది. చదవండి: పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉంది.. ఈ రైల్వే లైన్లో రెండు సొరంగాలు, ఒక బ్రిడ్జి, ఒక విద్యుత్ సరఫరా ప్రాజెక్టు తదితరాలు నిర్మిస్తారు. ఈ మేరకు బిడ్డింగ్ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు చైనా రైల్వే వర్గాలు తెలిపాయి. నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నాయి. సిచువాన్–టిబెట్ రైల్వే లైన్ చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డూలో మొదలవుతుంది. లాసాలో ముగుస్తుంది. ఈ రైల్వేలైన్‌తో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గిపోతుంది. చదవండి: చైనా వెళ్లిన భారతీయుల్లో 19 మందికి పాజిటివ్ -
అభయారణ్యాల్లో రోడ్లకు.. రైలు మార్గాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: పులుల అభయారణ్యాల్లో జాతీయ రహదారుల విస్తరణ, కొత్త రైల్వేలైన్ల ఏర్పాటుకు వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. అయితే మరోవైపు జంతుప్రేమికులు, పర్యావరణ వేత్తలు అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారు. ఈ చర్యలవల్ల పులుల సంరక్షణకు నష్టం వాటిల్లుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని కొమురంభీం ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో మంచిర్యాల–చంద్రపూర్ మార్గంలో (జాతీయరహదారి–363)ని రోడ్డును (94 కి.మీ పొడవు) ‘ఫోర్ లేనింగ్ నేషనల్ హైవే’గా మార్చాలనే ప్రతిపాదనపై ఇటీవల పునర్వ్యవస్థీకరించిన రాష్ట్ర వన్యప్రాణి మండలి ఈ నెల 1న జరిగిన తొలి సమావేశంలో ఆమోదముద్ర వేసింది. దీనితో పాటు కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని మాఖుది, రేచ్ని రోడ్డు రైల్వే స్టేషన్ల మధ్య కాగజ్‌నగర్ డివిజన్ కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో (కారిడార్ ఏరియా) పరిధిలో మూడో కొత్త బ్రాడ్‌గ్రేజ్ లైన్‌ను వేసేందుకు 168.43 హెక్టార్ల అటవీభూమిని మళ్లించడంపైనా ఈ భేటీ ఆమోదం తెలిపింది.డబ్ల్యూఎల్ఎం వరంగల్ డివిజన్లోని ఉరాట్టం–ఐలాపురం రోడ్డు అప్‌గ్రెడేషన్‌కు 31.759 హెక్టార్ల అటవీభూమిని మళ్లించేందుకు ఈ బోర్డు అంగీకరించింది. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వెంకటాపురం ఫారెస్ట్ డివిజన్ల పరిధిలో గోదావరి నదిపై తుపాకుల గూడెం గ్రామం వద్ద పి.వి.నరసింహారావు కాంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఫేజ్–1, ప్యాకేజ్–1లో భాగంగా బ్యారేజీ నిర్మాణానికి 27.9133 హెక్టార్ల వన్యప్రాణి ప్రాంతాల్లోని అటవీభూమిని సైతం మళ్లించడంపై వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. పులులకు తీరని నష్టం... అభయారణ్యాల్లో పులుల తిరుగాడే ప్రధాన ›ప్రాంతం (కోర్ ఏరియా), మహారాష్ట్ర సరిహద్దులోని పులులకు కీలకమైన ప్రాంతాల్లో భాగమైన ఆయాచోట్ల రోడ్ల విస్తరణ, కొత్తరైల్వేలైన్ల నిర్మాణం సరికాదని పర్యావరణ వేత్తలు, జంతుప్రేమికులు వాదిస్తున్నారు.మహారాష్ట్రలోని తడోబా ఆంథేరి టైగర్ రిజర్వ్ నుంచి తెలంగాణకు పులుల వలస మొదలు కావడంతోపాటు కవ్వాల్ టైగర్ అభయారణ్యం పరిధిలో ఇక్కడే పిల్లలు కూడాపెడుతున్నాయి. ఈ తరుణంలో పులుల వృద్ధికి, వాటి సంచారానికి, వలసలకు కీలకమైన ఈ ప్రాంతంలో నాలుగు లేన్ల రోడ్లు వేయడం, కొత్త రైల్వేలైను వేయడం వల్ల పులులసంఖ్య పెరిగేందుకు ప్రతికూలంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే మంచిర్యాల–చంద్రపూర్ మార్గంలో 94 కి.మీ పొడవున నాలుగు లేన్ల రోడ్డు వేయాలనే ప్రతిపాదనపై వన్యప్రాణి సంరక్షణకు తగిన చర్యలు తీసుకున్నాకే ఆమోద ముద్ర వేసినట్టుగ రాష్ట్ర వన్యప్రాణి మండలి సభ్యులు చెబుతున్నారు. మిగతా ప్రతిపాదనలకు సంబంధించి కూడా ఆయా అంశాలు పరిశీలించి, అత్యవసరమైన సందర్భాల్లోనే ఆమోదం తెలుపు తున్నట్టు స్పష్టం చేశారు. -
కూ... చుక్‌చుక్ !
మహబూబ్‌నగర్: కేంద్రప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వే కేటాయింపులకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు ఆశాజనకంగానే నిధులు ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని రెండు ముఖ్యమైన ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించారు. మహబూబ్‌నగర్ – మునీరాబాద్ రైల్వే లైన్, సికింద్రాబాద్ – మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్లకు ప్రకటించిన నిధులపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈ పనులు ఇప్పటికే కొనసాగుతుండగా.. ఈసారి కేటాయించనున్న నిధులతో పనుల్లో వేగం పెరగనుందని భావిస్తున్నారు. అయితే, ఈసారి బడ్జెట్లో కూడా గద్వాల – మాచర్ల రైల్వే లైన్ ప్రస్తావన లేకపోవడం మాత్రం నిరాశకు గురిచేసిందనే చెప్పాలి. అలాగే, ఆదర్శ రైల్వేస్టేషన్ల ప్రకటన, ఎస్కటేటర్ల ఏర్పాటు, ఆర్వోబీల నిర్మాణంపై ప్రకటన చేయకపోవడం గమనార్హం. మహబూబ్‌నగర్ డబ్లింగ్ దాదాపు రూ.728 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన సికింద్రాబాద్ – మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్‌కు గత రెండేళ్ల నుంచి మెరుగైన నిధులు కేటాయిస్తున్నారు. గత ఏడాది బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించగా ఈసారి కూడా రూ.200 కోట్లు కేటాయించారు. ఈ రైల్వేలైన్ పనులు జిల్లా పరిధిలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉందానగర్ నుంచి ప్రారంభమైన డబ్లింగ్ రైల్వే పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రస్తుతం పనులు మహబూబ్‌నగర్ – దివిటిపల్లి మధ్య నడుస్తున్నాయి. తాజాగా కేటాయించిన నిధులతో పనుల్లో మరింత వేగం పెరుగుతుందని రైల్వే ప్రయాణీకులు భావిస్తున్నారు. మొత్తంగా ఏడాదిలోపు డబ్లింగ్ లైన్ పనులు పూర్తయ్యే అవకాశముందని చెబుతున్నారు. తగ్గనున్న దూరాభారం సికింద్రాబాద్ – మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్ పనులు పూర్తయితే జిల్లా ప్రయాణికులకు వెసులుబాటు లభించనుంది. మహబూబ్‌నగర్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సికింద్రాబాద్‌కు ప్యాసింజర్ రైలులోనైతే 3 గంటలు, ఎక్స్ప్రెస్లోనైతే 2.30 గంటల సమయం పడుతోంది. అదే డబ్లింగ్ లైన్ పనులు పూర్తయితే గంట పాటు సమయం ఆదా అయ్యే అవకాశముంది. ఇంకా వాణిజ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నారు. మునీరాబాద్ లైన్ మహబూబ్‌నగర్ – మునీరాబాద్ రైల్వేలైన్‌ను 246 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. ఈ పనులకు 1997 – 98 బడ్జెట్లో ఆమోద ముద్ర లభించింది. రూ.645 కోట్ల వ్యయంతో ఈ రైల్వే పనులు చేపట్టగా తాజా బడ్జెట్లో రూ.275 కోట్లు కేటాయించారు. గత ఏడాది కూడా ఇంతేస్థాయిలో నిధులు కేటాయించడం విశేషం. ప్రస్తుతం ఈ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. జిల్లా పరిధిలో ఇప్పటివరకు 30 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. జిల్లాలోని కృష్ణాతోపాటు కర్నాటక రాష్ట్రం మునీరాబాద్ పరిధిలో పనులు పురోగతిలో ఉన్నాయి. అదే విధంగా జిల్లా రైల్వే పరిధిలోని ఆర్యూబీల నిర్మాణం కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సర్వేలకే పరిమితం గద్వాల – మాచర్ల రైల్వేలైన్ నిర్మాణం కోసం దా దాపు మూడు దశాబ్దాలుగా అటు ప్రజాప్రతినిధు లు ప్రయత్నాలు చేస్తుండగా.. ఇటు ప్రజలు ఏటే టా ఎదురుచూస్తూనే ఉన్నారు.కానీ ఇప్పటివరకు రైల్వేలైన్ నిర్మాణానికి ఆమోదమే లభించడం లేదు. దీని కోసం మూడు సార్లు సర్వే చేసినా రైల్వేలైన్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కాకపోవడం ఈ ప్రాంత ప్రయాణికులను ఆవేదనకు గురిచేస్తోంది. అలాగే, మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌ను ఆదర్శ స్టేషన్‌గా మార్చాలన్న డిమాండ్ కూడా మిగిలిపోయిందనే విమర్శలున్నాయి. అధిక నిధులు కేటాయించడం సంతోషం... ప్రస్తుత బడ్జెట్లో మునీరాబాద్– మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్‌కు అధిక నిధులు కేటాయించడం సంతోషంగా ఉంది. ఈ నిధులతో లైన్ల నిర్మాణ పనులు మరింత చురుగ్గా జరిగే అవకాశం ఉంది. అలాగే, జిల్లా రైల్వేస్టేషన్లో లిఫ్ట్ ఎస్కలేటర్ ఏర్పాటు, జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట రైల్వే గేట్ వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి కూడా నిధులు కేటాయించాలి. – మీర్జా జాకీర్బేగ్, రైల్వే కమ్యూటర్స్ ప్రతినిధి మహబూబ్‌నగర్ – దివిటిపల్లి మధ్య డబ్లింగ్ లైన్ నిర్మాణ పనులు మహబూబ్‌నగర్–మునీరాబాద్ రైల్వేలైన్ -
వివిధ దశల్లో 9 రైల్వే లైన్ ప్రాజెక్టులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రూ.14,665 కోట్ల అంచనా వ్యయంతో 1,093 కి.మీ. మేర 9 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుల నిర్మాణం వివిధ దశల్లో జరుగుతోం దని కేంద్ర రైల్వే సహాయ మంత్రి రాజెన్ గొహెయిన్ లోక్‌సభకు తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బుధవారం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. మునీరాబాద్–మహబూబ్‌నగర్ లైన్ (246 కి.మీ.)లో 71 కి.మీ. పూర్తయిందని, జక్లేర్–కృష్ణా, చిక్కబెనకల్–యెరమరస్ మధ్య భూసేకరణ పూర్తయిందని పేర్కొన్నారు. మనోహరాబాద్–కొత్తపల్లి లైన్ (148.90 కి.మీ.)లో భూసేకరణ పూర్తయిందని వివరించారు. భద్రాచలం రోడ్డు–సత్తుపల్లి లైన్ (56.25 కి.మీ)లో భూసేకరణ పూర్తయిందని, వంతెనల పనులు, ఇతర పనుల కోసం టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఇక అక్కన్నపేట–మెదక్ లైన్ (17.2 కి.మీ )లో 338 ఎకరాలకు గాను 333 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, మట్టి పను లు, వంతెనల పనులు ప్రారంభమయ్యాయని తెలి పారు. భద్రాచలం–కొవ్వూరు లైన్ తెలంగాణ విన్నపం మేరకు సత్తుపల్లి మీదుగా నిర్మించేందుకు కేంద్రం అంగీకరించిందని, తెలంగాణ గుండా 48.58 కి.మీ. మేర ఈ లైన్ వెళ్తోందని, అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని ఇందుకు 50 శాతం వ్యయాన్ని భరించాల్సిందిగా కోరగా ఇంతవరకు సమాధానం రాలేదని వెల్లడించారు. ఇక మణుగూరు–రామగుండం లైన్ ప్రాజెక్టుకు కూడా తెలంగాణ ప్రభుత్వం తన వాటాగా 50 శాతం వ్యయం, ఉచితంగా భూమి సమకూర్చాల్సి ఉందని, తెలంగాణ నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. కొండపల్లి–కొత్తగూడెం రైల్వేలైన్ నిర్మాణం కోసం కూడా తెలంగాణ నుంచి వ్యయంలో వాటా కోరగా, ఇంకా స్పందించలేదని వివరించారు. -
భూ సేకరణ తర్వాతే కొత్త లైన్లు
న్యూఢిల్లీ: కొత్త రైల్వే లైన్లు నిర్మించేందుకు అవసరమైన భూసేకరణ సంపూర్ణంగా జరిగిన తర్వాతనే పనులు ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. లేదంటే అవసరమైన భూమిని తప్పకుండా అప్పగిస్తామని కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు లిఖిత పూర్వక హామీనైనా ఇస్తేగానీ పనులు మొదలుపెట్టకూడదని రైల్వే నిశ్చయించింది. ప్రస్తుతం కొత్తలైనుకు అవసరమైన 70 శాతం భూమి లభ్యమవ్వగానే రైల్వే శాఖ లైను నిర్మాణం ప్రారంభిస్తోంది. దీనివల్ల కొన్నిసార్లు భూమి దొరకక పనుల్లో తీవ్ర జాప్యమై వ్యయం పెరిగిపోవడం లేదా పనులు పూర్తిగా నిలిచిపోవడం జరుగుతున్నందున తాజా నిర్ణయం తీసుకుంది. ఇకపై భూసేకరణ సంపూర్ణంగా జరిగేవరకు టెండర్లను పిలవకూడదని రైల్వే నిర్దేశించుకుంది. అయితే మొత్తం కొత్త రైల్వే లైనును కొన్ని భాగాలుగా విభజించి...ఏదేనీ నిర్దేశిత భాగంలో భూమి లభ్యంగా ఉన్నప్పడు పనిని ప్రారంభించవచ్చనీ, అందునా మొత్తం రైల్వే లైనుతో సంబంధం లేకుండా ప్రత్యేకించిన ఆ భాగం మాత్రమే పూర్తయినా రైల్వేకు లాభాలు వస్తాయనుకున్న సందర్భంలోనే ఇలా చేయాలని రైల్వే శాఖ జోనల్ జనరల్ మేనేజర్లను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నగరి, తమిళనాడులోని తిండివనం రైల్వే స్టేషన్ల మధ్య లైను (179.2 కిలో మీటర్లు) నిర్మాణంలో జరిగిన జాప్యాన్ని రైల్వే శాఖ ఈ సందర్భంగా ఉదహరించింది. ఆధార్ బయోమెట్రిక్ అటెండెన్స్ ఆలస్యంగా విధులకు హాజరయ్యే ఉద్యోగులపై రైల్వే శాఖ కొరడా ఝళిపించనుంది. జనవరి 31 కల్లా దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లు, కార్యాలయాల్లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు నమోదు విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. జోనల్, డివిజనల్ కార్యాలయాలు, రైల్వే వర్క్‌షాప్‌లు, ఫ్యాక్టరీలు, ఉత్పత్తి యూనిట్లలో ఈ నెల చివరి నాటికే బయోమెట్రిక్ విధానం అమల్లోకి వస్తుంది. -
పట్టాలెక్కేనా..!
ఏలూరు :రైల్వే బడ్జెట్లో ప్రతి ఏటా జిల్లాకు మొండి చేయి చూపిస్తున్నారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకు ఈ బడ్జెట్లో ఎంత వరకు న్యాయం చేస్తారో.. రైల్వే బడ్జెట్‌కు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఫిబ్రవరిలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో జిల్లా ఎంపీల ప్రతిపాదనలను కేంద్రం కోరింది. ఇప్పటి వరకు జిల్లాలో ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు ఊసే లేదు. వచ్చే ఏడాది జూలై 14 నుంచి గోదావరి పుష్కరాలకు కోట్లాది మంది యాత్రీకులు రానున్నారు. దీంతో వడివడిగా రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ చేయడంతో పాటు, ప్రత్యేక రైళ్లను పెద్ద ఎత్తున నడపాల్సి ఉంది. జిల్లా అభివృద్ధికి ఉపకరించే ప్రతిపాదలను ఎంపీలు ఐక్యంగా చేయాల్సిన అవసరం ఉంది. ఏలూరు ఎంపీ మాగంటిబాబు, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాత్రం ఇంకా ప్రతిపాదనలు చేయలేదు. రాజ్యసభ్య సభ్యురాలు తోట సీతారామలక్ష్మి కొద్ది నెలల క్రితం అప్పటి రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ్‌కు ప్రతిపాదనలు ఇచ్చారు. ఇప్పడు వాటినే అటుఇటుగా మార్చి పంపాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ ప్రతిపాదనలు పంపినట్టు తెల్సింది. ఇందులో గోదావరి స్టేషన్ ఆధునికీకరణ ఉంది. పెద్ద ఎత్తున రైళ్లను నడపడటంతోపాటు అన్ని పుణ్యక్షేత్రాలను కలుపుతూ రైళ్లు వేయాలని ఆయన ప్రతిపాదించినట్టు సమాచారం. ఆదాయం ఉన్నా సౌకర్యాలు లేవు ప్రతి ఏటా ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌పై జిల్లా ప్రజలు పెదవి విరుపులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఏటా ప్రయాణికుల రాకపోకలు, సరుకుల రవాణా కింద జిల్లా నుంచి భారీగానే రైల్వేలకు ఆదాయం వస్తున్నా, సౌకర్యాల గురించి పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, నిడదవోలు, తణుకు, నరసాపురం, కొవ్వూరు స్టేషన్ల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఏ స్టేషన్ చూసినా ప్రయాణికుల సహనాన్ని పరీక్షించేలా ఉంటాయి. కొత్త రైల్వే లైన్లపై జిల్లా ప్రజలకు పాలకులు ఇచ్చిన హామీలు నీటిపై రాతల్లా మిగిలిపోయాయి. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో ప్రజాప్రతినిధులు విఫలమవుతూనే ఉన్నారన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రతిపాదనలకే పరిమితం కొవ్వూరు- భద్రాచలం రైల్వే లైను నిర్మాణ వ్యయం గత రైల్వే బడ్జెట్ నాటికి రూ.745 కోట్లకు చేరింది. ఈ రైల్వే లైను పూర్తయితే కొత్తగూడెం, సింగరేణి, మణుగూరు బొగ్గు గనుల నుంచి విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్,, సింహాద్రి థర్మల్ పవర్‌స్టేషన్‌కు బొగ్గు తరలింపునకు ఉపయుక్తంగా ఉంటుంది. నరసాపురం-కోటిపల్లి రైల్వే లైనుకు బ్రిడ్జి నిర్మాణం ప్రతిపాదన స్థాయిలోనే ఉంది. గుడివాడ-మచిలీపట్నం, గుడివాడ-నరసాపురం డబ్లింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏలూరు రైల్వేస్టేషన్లో కోరమాండల్, గౌహతి, కరియ-యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ డిమాండ్‌కు అతీగతీ లేదు. ఏలూరు ఒకటో నంబరు ప్లాట్‌ఫారంకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచేలా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నా ప్రయోజనం శూన్యం. దీనికి ప్రత్యామ్నాయంగా ఎస్కలేటర్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌నూ పట్టించుకోవట్లేదు. తాడేపల్లిగూడెం స్టేషన్‌లోని 1, 2 ప్లాట్‌ఫారాలకు లిఫ్టు సౌకర్యం కల్పించాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా అరణ్య రోదనగా మిగిలిపోయింది.రసాపురం నుంచి రోజుకు 23 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా ఒక్క ప్లాట్ఫారం ఉండటంతో పెద్ద ఇబ్బంది. ఈ స్టేషన్ చివరి హాల్ట్ అయినా ఒకటే ఫిట్‌లైన్ ఉండటంతో స్టేషన్‌కు వచ్చి నిలిచిపోయే ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిర్వహణ కోసం మచిలీపట్నం పంపించాల్సి వస్తోంది. ఏలూరు స్టేషన్లో సౌకర్యాల కల్పన: ఎంపీ మాగంటి బాబు ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై విశాఖపట్నం వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని ఎన్నో ఏళ్లుగా ప్రజలు కోరుతున్నారు. దీనికి చర్యలు తీసుకుంటాను. ఇక్కడ ఎస్కలేటర్ ఏర్పాటు, ఇతర సౌకర్యాల కల్పనపై రైల్వే మంత్రితో మాట్లాడతా. పుష్కరాల సౌకర్యాల కల్పన :ఎంపీ తోట సీతారామలక్ష్మి జిల్లాలో రైల్వే స్టేషన్లలో సమస్యలను పరిష్కరించడంతో పాటు కొవ్వూరు- భద్రాచలం రైల్వే లైను అభివృద్ధి, ఆంధ్రాలోని పలు ప్రాంతాలను కలుపుతూ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రానికి నివేదిస్తాను. గోదావరి పుష్కరాల దృష్ట్యా అన్ని రైల్వేస్టేషన్లు ఆధునీకరించి, యాత్రీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని త్వరలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభును కోరతా. ఇంకా సమయం ఉంది : ఎంపీ గోకరాజు గంగరాజు రైల్వే ప్రతిపాదనలను పంపాలని కేంద్రం కోరింది. వాటిని పంపించేందుకు ఇంకా సమయం ఉంది. మెరుగైన ప్రతిపాదనలను తయారు చేయిస్తాను. గుడివాడ-కైకలూరు డబ్లింగ్ పనులు, భీమవరం, పాలకొల్లు రైల్వేగేట్ల వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తాం.