సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు దేశంలోని ఉద్రిక్తతల నడుమ ఊగిసలాటతో కొనసాగుతున్నాయి. ఆరంభం తరువాత ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనుకావడంతో ఒక్కసారిగా అమ్మకాలకు తెరతీశారు. సెన్సెక్స్ దాదాపు 226 పాయింట్లు పతనమైంది. తద్వారా ఇంట్రాడే గరిష్టం నుంచి సెన్సెక్స్ సుమారు 600 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ కూడా 10800 స్థాయినుంచి కిందికి పతనమైంది ప్రస్తుతం నష్టాలనుంచి తేరుకున్న సెన్సెక్స్ 26 పాయింట్లు ఎగిసి 36వేల స్థాయి వద్ద ఉంది. నిఫ్టీ 10836 వద్ద ఉంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.
పీఎస్‌యూ బ్యాంక్స్ తప్ప దాదాపు అన్ని రంగాలూ బలహీనపడ్డాయి. ఐటీ, మెటల్, ఆటో, రియల్టీ 1-0.5 శాతం మధ్య క్షీణించాయి.విప్రో, టాటా మోటార్స్, వేదాంతా, ఇన్ఫ్రాటెల్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, కొటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, టైటన్ టాప్ లూజర్స్‌గా ఉ న్నాయి. మరోవైపు అల్ట్రాటెక్, బజాజ్ ఆటో, ఎన్‌టీపీసీ, యాక్సిస్, ఎల్‌అండ్‌టీ, సన్ ఫార్మా యూపీఎల్, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్ అదానీ పోర్ట్స్ లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment