సియోల్: ఉత్తర కొరియా తాజాగా మరో పదిహేను వందల మంది తమ సైనికులను రష్యాకు తరలించిందని దక్షిణ కొరియా గూఢచర్య సంస్థ(ఎన్‌ఐఎస్) వెల్లడించింది. ఈ విషయాన్ని తమ దేశ చట్టసభ సభ్యులకు ఎన్‌ఐఎస్ చీఫ్ యంగ్ తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కోసమే వారిని పంపిందని పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి మరో 10 వేల మంది సైన్యాన్ని రష్యాకు పంపాలని ఉత్తరకొరియా యోచిస్తోందన్నారు.
ఇప్పటికే ఉత్తర కొరియా ఈ నెలలో రష్యాకు 1,500 మంది సైనికులను పంపినట్లు ఎన్‌ఐఎస్ తేల్చిచెప్పింది. రష్యా యుద్ధ నౌకల్లో 1500 మందితో కూడిన ఉత్తరకొరియా ప్రత్యేక బలగాలు రష్యాలోని వ్లాదివోస్తోక్ పోర్టుకు చేరుకున్నాయని ఎన్‌ఐఎస్ తెలిపింది. తాజాగా రష్యా రాయబారి జార్జి జినోవిచ్‌తో భేటీ అయిన దక్షిణ కొరియా విదేశాంగ డిప్యూటీ మినిస్టర్ కిమ్ హాంగ్ క్యూన్ ఉత్తర కొరియా బలగాలను పంపడాన్ని ఖండించారు.
ఉత్తర కొరియాతో తమ సంబంధాలు దక్షిణ కొరియా భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకం కాదని రష్యా రాయాబారి స్పష్టం చేశారు. అయితే ఉత్తర కొరియా చర్యలు ఇలానే ఉంటే తాము ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలు పంపుతామని సౌత్ కొరియా హెచ్చరిస్తోంది. ఉత్తరకొరియా ఒక క్రిమినల్ దేశమని ఫైర్ అయింది. కాగా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మధ్య మంచి సంబంధాలున్నాయి. కిమ్‌కు ఇటీవల పుతిన్ ఖరీదైన బహుమతులను కూడా ఇవ్వడం గమనార్హం.
ఇదీ చదవండి: ప్రజాస్వామ్యానికి ట్రంప్ ప్రమాదకరం: జో బైడెన్
Comments
Please login to add a commentAdd a comment