కీవ్: రష్యా తరపున తమపై యుద్ధంలో పాల్గొన్న ఉత్తరకొరియా సైనికుల్లో కొందరు చనిపోయారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా తెలిపారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా పెద్దమొత్తంలో సైనికులను రష్యాకు పంపిన విషయం తెలిసిందే.
తమపై యుద్ధానికి కుర్స్క్‌లో 11వేల మంది ఉత్తరకొరియా సైనికులను మోహరించినట్లు గతంలో జెలెన్‌స్కీ చెప్పారు. ఈనేపథ్యంలోనే తాజాగా అక్కడ జరిగిన యుద్ధంలో పాల్గొన్న ఆ సైనికుల్లో కొందరు ఉక్రెయిన్ దళాల చేతుల్లో మరణించినట్లు తెలిపారు. తాము ఈ తరహా కఠిన చర్యలు తీసుకోకపోతే ఉత్తరకొరియా మరిన్ని బలగాలను పంపే అవకాశం ఉందన్నారు.
కాగా, రెండేళ్ల నుంచి జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా తాజాగా ఎంటరైంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్‌జోంగ్‌ఉన్‌కు సత్సంబంధాల వల్లే ఉత్తర కొరియా తమ సైనికులను రష్యాకు పంపిందని ఆరోపణలున్నాయి. యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామలుంటాయని ఉక్రెయిన్ ఇప్పటికే హెచ్చరించింది.
ఇదీ చదవండి: కెనడాలో ఆ మీడియాపై నిషేధం
Comments
Please login to add a commentAdd a comment