సియోల్: ఉత్తర కొరియా పెద్ద సంఖ్యలో ఆయుధాలను రష్యాకు సరఫరా చేస్తోందని దక్షిణ కొరియా నిఘా సంస్థ ‘నేషనల్ ఇంటెలిజెన్స్ సరీ్వస్’ బుధవారం వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు 10 లక్షలకుపైగా ఆరి్టలరీ షెల్స్‌ను రష్యాకు పంపించిందని పేర్కొంది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో ఈ ఫిరంగి గుండ్లను రష్యా ఉపయోగిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేసింది.
అమెరికాతోపాటు పశి్చమ దేశాల నుంచి ఆంక్షలను ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా, రష్యా సంబంధాలు నానాటికీ బలపడుతున్నాయి. ఇరు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. ఉక్రెయిన్‌పై సుదీర్ఘ యుద్ధం కొనసాగిస్తున్న రష్యా వద్ద ఆయుధ నిల్వలు నిండుకుంటున్నాయి. దాంతో ఉత్తర కొరియా ఆయుధ సాయం అందిస్తోంది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సెపె్టంబర్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయుధాల సరఫరా విషయంలో వారిద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment