Arms Supplies
-
ఏడు వైపులా శత్రువులతో పోరాడుతున్నాం
జెరూసలేం: ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరాను నిలిపివేస్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ తీసుకున్న నిర్ణయంపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాçహు మండిపడ్డారు. ‘‘మాక్రాన్ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. ఇరాన్ అండదండలు అందిస్తున్న అరాచకశక్తులపై ఇజ్రాయెల్ పోరాడుతోంది. ఇందుకు నాగరిక దేశాలన్నీ మద్దతు ఇవ్వాలి. కానీ ఫ్రాన్స్, ఇతర పశి్చమ దేశాలు మాకు ఆయుధాలివ్వొద్దని నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇది నిజంగా సిగ్గుచేటు’’ అంటూ ఆదివారం దుయ్యబట్టారు. ‘‘మేం ఏడు దిక్కులా శత్రువులతో పోరాడుతున్నాం. గాజాలో హమాస్‌పై, లెబనాన్‌లో హెజ్»ొల్లాపై, యెమెన్‌లో హౌతీలపై, ఇరాక్, సిరియాల్లో షియా మిలిటెంట్లపై పోరాడుతున్నాం. ఇరాన్ ప్రభుత్వం మిలిటెంట్లకు ఆయుధ సరఫరా ఆపడం లేదు. మిలిటెంట్ శక్తులు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. వాటిని వ్యతిరేకిస్తున్న పశి్చమ దేశాలు ఇజ్రాయెల్‌కు ఆయుధాలివ్వడం మాత్రం నిలిపివేస్తున్నాయి’’ అని ఆక్షేపించారు. ఎవరి సహకారమున్నా, లేకపోయినా యుద్ధంలో గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. -
ఉత్తర కొరియా నుంచి రష్యాకు ఆయుధాలు
సియోల్: ఉత్తర కొరియా పెద్ద సంఖ్యలో ఆయుధాలను రష్యాకు సరఫరా చేస్తోందని దక్షిణ కొరియా నిఘా సంస్థ ‘నేషనల్ ఇంటెలిజెన్స్ సరీ్వస్’ బుధవారం వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు 10 లక్షలకుపైగా ఆరి్టలరీ షెల్స్‌ను రష్యాకు పంపించిందని పేర్కొంది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో ఈ ఫిరంగి గుండ్లను రష్యా ఉపయోగిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. అమెరికాతోపాటు పశి్చమ దేశాల నుంచి ఆంక్షలను ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా, రష్యా సంబంధాలు నానాటికీ బలపడుతున్నాయి. ఇరు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. ఉక్రెయిన్‌పై సుదీర్ఘ యుద్ధం కొనసాగిస్తున్న రష్యా వద్ద ఆయుధ నిల్వలు నిండుకుంటున్నాయి. దాంతో ఉత్తర కొరియా ఆయుధ సాయం అందిస్తోంది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సెపె్టంబర్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయుధాల సరఫరా విషయంలో వారిద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. -
ఉక్రెయిన్‌కు ఆయుధాలిస్తే ప్రపంచ వినాశనమే.. రష్యా హెచ్చరిక
కీవ్: ఉక్రెయిన్‌కు శక్తివంతమైన ఆయుధాలిచ్చి తమను తాము నాశనం చేసుకోవద్దని పశ్చిమదేశాలకు రష్యా పార్లమెంట్ స్పీకర్ వ్యాచెస్లావ్ వొలోదిన్ హెచ్చరించారు. ఎదురుదాడులకు ఉపయోగపడే ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందజేస్తే, తాము మరింత శక్తివంతమైన ఆయుధాలను వాడాల్సి వస్తుందని, అంతిమంగా ప్రపంచ వినాశనానికే దారి తీస్తుందన్నారు. ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు మినహా గగనతల రక్షణ వ్యవస్థలు తదితరాలను అందజేస్తామంటూ నాటో, అమెరికా ఇస్తున్న హామీలపై ఆయన ఆదివారం ఈ మేరకు స్పందించారు. చదవండి: పెరూలో ఆందోళనలు హింసాత్మకం -
ఢిల్లీకి తప్పిన ఉగ్ర ముప్పు! ఆయుధాలతో చిక్కిన ఆరుగురు
కోల్‌కతా: స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ ఢిల్లీకి భారీ ఉగ్ర ముప్పు తప్పింది! ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తూ ఆరుగురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. పంద్రాగస్టు సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో భాగంగా ఆనంద్ విహార్ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా 2,000 పై చిలుకు తూటాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇవి చాలావరకు విదేశాల నుంచి తెప్పించిన అత్యాధునిక తూటాలని తేల్చారు. నిందితులను యూపీలోని జౌన్‌పూర్‌కు చెందిన అజ్మల్ (20), రషీద్ అలియాస్ లలన్ (20), సద్దాం, ఢిల్లీకి చెందిన కమ్రాన్, రూర్కీకి చెందిన నాసిర్, డెహ్రాడూన్‌కు చెందిన పరీక్షిత్ నేగిగా గుర్తించారు. ఓ ఆటో డ్రైవర్ అందించిన సమాచారం మేరకు వీరిని పట్టుకున్నట్టు అదనపు పోలీస్ కమిషనర్ విక్రంజీత్‌సింగ్, డీసీపీ ప్రియాంక కశ్యప్ శుక్రవారం మీడియాకు చెప్పారు. ‘‘ఆనంద్ విహార్ బస్టాప్ వద్ద ఇద్దరు వ్యక్తులు భారీ బ్యాగులతో అనుమానాస్పదంగా ఉన్నట్టు 6న సాయంత్రం సమాచారం అందింది. దాంతో రంగంలోకి దిగి అజ్మల్ ఖాన్, రషీద్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం. వారి బ్యాగుల్లో తూటాలు దొరికాయి. లక్నోకు చేర్చాల్సిందిగా వాటిని డెహ్రాడూన్‌లోని ఓ వ్యక్తి వాటిని ఇచ్చినట్టు విచారణలో వెల్లడించారు. వీళ్లు గతంలో కనీసం నాలుగుసార్లు ఇలా ఆయుధాలను చేరవేసినట్టు తేలింది. వారి సమాచారం ఆధారంగా లక్నో, జౌన్పూర్ తదితర చోట్లMమిగతా నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. నేగి డెహ్రాడూన్‌లో ఆయుధ డెన్ నిర్వహిస్తున్నాడు. చాలాకాలంగా ఆయుధాలు, మందుగుండు చేరవేశాడు. అనుమానం రాకుండా ఆయుధ రవాణాకు ఈ ముఠా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టునే వాడుకుంటోంది’’ అని వెల్లడించారు. ఉగ్ర కోణాన్నీ కొట్టిపారేయలేమన్నారు. మరోవైపు కోల్‌కతాలో ప్రఖ్యాత విక్టోరియా మెమోరియల్ హాల్, పరిసర ప్రాంతాలను డ్రోన్‌తో ఫొటోలు తీస్తున్న ఇద్దరు బంగ్లాదేశీలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని బంగ్లాదేశ్‌లోని రాజ్షాహీకి చెందిన వారిగా గుర్తించారు. కోర్టు వారిని ఆగస్టు 23 దాకా పోలీసు కస్టడీకి అప్పగించింది. ఆర్మీ తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయమైన ఫోర్ట్ విలియంకు విక్టోరియా హాల్ కూతవేటు దూరంలోనే ఉంటుంది! పతంగులపై నిషేధం స్వాతంత్య్ర వేడుకలు జరిగే చారిత్రక ఎర్రకోట ప్రాంతంలో సున్నిత ప్రాంతాలపై నిఘాను తీవ్రతరం చేశారు. ఆ పరిసరాల్లో శనివారం నుంచి సోమవారం దాకా పతంగులు, బెలూన్లు, డ్రోన్ల వంటివాటిని ఎగరేయడాన్ని నిషేధించారు. రాడార్లనూ రంగంలోకి దించారు. ఇప్పటికే ప్రకటించిన, మొదలైన పతంగుల పోటీలు తదితరాలను ఆగస్టు 15 సాయంత్రం నుంచి నిర్వహించుకోవాలని సూచించారు. -
ఒడిశా అటవీప్రాంతంలో భారీ డంప్ స్వాధీనం
ఒడిశా: రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా సిసాపుర అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాచిపెట్టిన భారీ డంప్‌ను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల డెన్‌లో భారీగా ఆయుధ సామాగ్రి ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. మావోయిస్టుల డెన్‌లో 27 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.