National Intelligence Service
-
Tulsi Gabbard దటీజ్ తులసీ గబ్బర్డ్ : వైరల్ వీడియో
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకున్న డొనాల్డ్ ట్రంప్ తన కార్యవర్గాన్ని ఎంపికలో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే కేబినెట్ పదవుల్లో కీలక వ్యక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. అందరూ ఊహించినట్టుగానే తాజాగా తులసి గబ్బర్డ్(Tulsi Gabbard) ను అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా బుధవారం నియమించారు. అయితే తులసీ గబ్బర్డ్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్‌లో విశేషంగా నిలిచింది. గంథెర్ ఈగల్మేన్ అనే ట్విటర్ ఖాతాలోదిసీజ్ తులసి గబ్బర్డ్ అనే వీడియో షేర్ అయింది. ఇప్పటికే 20 లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది. తులసి గబ్బర్డ్ ఎంపిక తరువాత ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒక గర్వించదగిన రిపబ్లికన్ అని అభివర్ణించడం విశేషం.అయితే తులసి గబ్బర్డ్ హిందువు కావడంతో ఆమె ఎంపిక ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే చాలామంది ఊహించుకున్నట్టుగా ఆమె భారత సంతతికి చెందిన ఆమె కాదు. కానీ హిందువుమాత్రమే. తులసి గబ్బర్డ్. తులసి తల్లి హిందూ మతాన్ని స్వీకరించిన నేపథ్యంలో ఆమె తన పిల్లలకు హిందూ పేర్లు పెట్టారు. భక్తి, జై, ఆర్యన్, బృందావన్ అనే హిందూ పేర్లు పెట్టింది తులసి తల్లి. తులసి భర్త అబ్రహం విలియమ్స్ ( Abraham Williams) కూడా ఇస్కాన్ ను అనుసరిస్తారు2013 నుంచి 2021 వరకు హవాయి పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు దాదాపు రెండు దశాబ్దాలు అమెరికా ఆర్మీ నేషనల్ గార్డ్‌లో సేవలందించారు. ఆమెకు నిఘా విభాగంలో పనిచేసిన అనుభవం లేదు కానీ హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీలో పనిచేశారు. ఇరాక్, కువైట్‌లోనూ పని చేశారు. గతంలో పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో భగవద్గీతపై చేయి వేసి ప్రమాణం చేయడం విశేషంగా నిలిచింది. This is the Director of National Intelligence, Tulsi Gabbard.She’s an absolute unit! pic.twitter.com/IREbJyGojl— Gunther Eagleman™ (@GuntherEagleman) November 14, 2024 -
రష్యాకు ఉత్తర కొరియా సైనిక సాయం
సియోల్: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా సైనిక సాయం చేస్తోంది. ఇప్పటికే 1,500 మంది సైనికులను రష్యాకు పంపిందని దక్షిణ కొరియా నిఘా సంస్థ ‘నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీసు (ఎన్ఐఎస్) శుక్రవారం వెల్లడించింది. స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్‌కు చెందిన 1,500 సైనికులను ఈనెల 8 నుంచి 13 వరకు రష్యాకు పంపిందని తెలిపింది. రష్యా తీరప్రాంత నగరం వ్లాదివోస్టోక్‌కు వీరు చేరుకున్నారని పేర్కొంది. ఉత్తరకొరియా సైనికులకు రష్యా సైనిక దుస్తులను ఇచ్చారని, ఆయుధాలను అందజేశారని, నకిలీ ధ్రువపత్రాలను సమకూ ర్చారని ఎన్ఐఎస్ వెల్లడించింది. ఉత్తర కొరి యా మరింత మంది సైనికులను రష్యాకు పంపనుందని వివరించింది. నిఘా సమాచా రం మేరకు 10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు రష్యా తరఫున యుద్ధంలో పాల్గొననున్నట్లు తనకు తెలిసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం ప్రకటించడం గమనార్హం. ఉత్తరకొరియా మొత్తం 12 వేల మందిని కదనరంగానికి పంపనుందని దక్షిణకొరియా మీడియా తెలిపింది. ఉత్తరకొరియా చోంగ్జిన్ పోర్టులో రష్యా నావికాదళం నౌకలు మొహరించడం, ఉసురియిస్క్, ఖబరోస్క్లలో ఉత్తరకొరియా సైనికులు గుమిగూడిన ఉపగ్రహ చిత్రాలను ఎన్ఐఎస్ తమ వెబ్సైట్లో పొందుపర్చింది. విదేశీయుద్ధంలో ఉత్తరకొరియా నేరుగా పాల్గొనడం ఇదే తొలిసారి. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక బలగాల్లో ఉత్తరకొరియా ఒకటి. మొత్తం 12 లక్షల మంది సైన్యం ఉంది. ఈ ఏడాది జూన్‌లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కింగ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య సైనిక ఒప్పందం కుదిరింది. ఇరుదేశాల్లో దేనిపై దాడి జరిగినా.. మరో దేశం సైనికంగా సాయపడాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సక్ యోల్ శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి భద్రతపై సమీక్షించారు. అంతర్జాతీయ సమాజం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు చేరొచ్చు: జెలెన్స్కీబ్రస్సెల్స్: పదివేల మంది ఉత్తరకొరియా సైనికులు రష్యా సైన్యంలో చేరవచ్చని తమకు నిఘా సమాచారం ఉందని ఉక్రె యిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. వీరిని రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగంలో మొహరించనున్నారని తెలిపారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధంలో మూడోదేశం జోక్యం చేసుకుంటే అది ప్రపంచయుద్ధంగా మారుతుందని హెచ్చరించారు. -
ఉత్తర కొరియా నుంచి రష్యాకు ఆయుధాలు
సియోల్: ఉత్తర కొరియా పెద్ద సంఖ్యలో ఆయుధాలను రష్యాకు సరఫరా చేస్తోందని దక్షిణ కొరియా నిఘా సంస్థ ‘నేషనల్ ఇంటెలిజెన్స్ సరీ్వస్’ బుధవారం వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు 10 లక్షలకుపైగా ఆరి్టలరీ షెల్స్‌ను రష్యాకు పంపించిందని పేర్కొంది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో ఈ ఫిరంగి గుండ్లను రష్యా ఉపయోగిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. అమెరికాతోపాటు పశి్చమ దేశాల నుంచి ఆంక్షలను ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా, రష్యా సంబంధాలు నానాటికీ బలపడుతున్నాయి. ఇరు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. ఉక్రెయిన్‌పై సుదీర్ఘ యుద్ధం కొనసాగిస్తున్న రష్యా వద్ద ఆయుధ నిల్వలు నిండుకుంటున్నాయి. దాంతో ఉత్తర కొరియా ఆయుధ సాయం అందిస్తోంది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సెపె్టంబర్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయుధాల సరఫరా విషయంలో వారిద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. -
ఎన్నికల ముందు మతఘర్షణలు!
వాషింగ్టన్: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ హిందుత్వ ఎజెండాతో ముందుకెళితే భారత్‌లో మతఘర్షణలు చెలరేగే అవకాశముందని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ డాన్ కోట్స్ తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మతపరమైన ఉద్రిక్తతలు, విద్వేషం పెరిగాయని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 2019లో ఎదురుకానున్న విపత్కర పరిస్థితులపై కోట్స్ సెనెట్ సెలక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్ ముందు హాజరై నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా కోట్స్ మాట్లాడుతూ..‘మోదీ నేతృత్వంలోని బీజేపీ హిందుత్వ అజెండాను ప్రచారాస్త్రంగా చేసుకుంటే భారత్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ మత ఘర్షణలు చోటుచేసుకునే అవకాశముంది. దాంతో, ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు భారత్‌లో సులభంగా తమ ప్రాబల్యాన్ని విస్తరిస్తాయి’ అని హెచ్చరించారు. భారత్‌పై ఉగ్రదాడులు కొనసాగుతాయి.. అంతేకాకుండా భారత్–పాకిస్తాన్ సంబంధాలు లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకూ మెరుగుపడే అవకాశం లేదని కోట్స్ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు భారత్, అఫ్గానిస్తాన్‌పై 2019లోనూ దాడులు కొనసాగిస్తాయని హెచ్చరించారు. తమకు ప్రమాదకరంగా మారిన ఉగ్రవాదులను మాత్రమే ఏరివేస్తూ, ఇతర ఉగ్రమూకలకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్ అమెరికా ఆగ్రహానికి గురికాక తప్పదని వ్యాఖ్యానించారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లపై పోరాడుతున్న అమెరికాకు పాక్ వ్యవహారశైలి నిరాశపరుస్తోందన్నారు. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మత ఉద్రిక్తతలు, అఫ్గానిస్తాన్‌లో 2019, జూన్–జూలై నెలల్లో అధ్యక్ష ఎన్నికలు సందర్భంగా తాలిబాన్ల దాడులు, ఉగ్రవాదుల పూర్తిస్థాయి ఏరివేతకు పాక్ నిరాకరణ వంటి కారణాల వల్ల ఈ ఏడాది దక్షిణాసియాలో హింసాత్మక ఘటనలు పెరిగే అవకాశముందని హెచ్చరించారు. సెనెట్ సెలక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్ ముందు కోట్స్‌తో పాటు సీఐఏ డైరెక్టర్ గినా హాస్పెల్, ఎఫ్‌బీఐ చీఫ్ క్రిస్టోఫర్ రే, రక్షణ నిఘా సంస్థ(డీఐఏ) డైరెక్టర్ రాబర్ట్ అష్లేతో పాటు పలువురు హాజరయ్యారు. -
జల్సాలతో అడ్డంగా బరువెక్కిన అధ్యక్షుడు!
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు, యువ నియంత కిమ్ జాంగ్ ఉన్ గురించి దక్షిణ కొరియా గూఢచర్య సంస్థ తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. విందులు, వినోదాలతో నిత్యం జల్సాలు చేసే ఉన్ గత నాలుగేళ్లలో అనూహ్యంగా బరువు పెరిగిపోయాడని తెలిపింది. అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయన 40 కిలోల (90 పౌండ్లు) బరువు పెరిగిపోయాడని, దీనికితోడు నిద్రలేమి వ్యాధితో ఆయన బాధపడుతున్నాడని పేర్కొంది. వ్యక్తిగత భద్రత విషయంలోనూ కింగ్ జాంగ్ ఉన్ ఒకింత అనుమానంతో ఉన్నాడని తెలిపింది. ఈమేరకు దాయాది దక్షిణకొరియాకు చెందిన జాతీయ నిఘా సంస్థ (ఎన్ఐఎస్) పార్లమెంటరీ కమిటీకి ఓ రహస్య నివేదిక సమర్పించింది. 2012లో తన తండ్రి చనిపోవడంతో ఆయన తదుపరి అధ్యక్ష పగ్గాలు స్వీకరించిన కింగ్ జాంగ్ ఉన్ అప్పట్లో 90 కిలోలు ఉండేవాడని, 2014లో అతని బరువు 120 కిలోలకు చేరగా, ప్రస్తుతం అది 130 కిలోలకు చేరిందని దక్షిణ కొరియా అధికార పార్టీ ఎంపీ లీ చెవొల్ వూ ఎన్ఐఎస్ నివేదికను ఉటంకిస్తూ విలేకరులకు తెలిపారు. బాగా తినడం, తాగడం అలవాటు ఉన్న ఉన్‌కు పలు ఆరోగ్య సమస్యలు తలెత్త అవకాశమున్నట్టు కనిపిస్తున్నదని చెప్పారు. సైన్యం నుంచి తన అధికారానికి ఏదైనా ముప్పు ఉందనే ఆలోచనతో ఉన్ ఎప్పుడూ అత్యంత అప్రమత్తంగా ఉంటున్నారని తెలిపారు. బాగా బరువు పెరిగిపోయిన ఉన్ నిత్యం పొగ తాగుతారని, ప్లాంట్లు, నిర్మాణాలు, పంటపొలాలు సందర్శించే సమయంలో ఆయన చేతిలో సిగరెట్ కనిపించడమే ఇందుకు నిదర్శనమని వివరించారు.