సిరియా ఎఫెక్ట్: భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: సిరియాపై అమెరికా దాడులు, యూరప్ మార్కెట్లలో ప్రతికూలత తదితర అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 1.6 శాతం నష్టంతో 431 పాయింట్లు కోల్పోయి 26775 వద్ద, నిఫ్టీ 1.6 శాతంతో 128 పాయింట్లు క్షీణించి 8017 వద్ద ముగిసాయి. మంగళవారం మార్కెట్ లో 2131 కంపెనీల షేర్లు క్షీణించగా, 886 కంపెనీల షేర్లు లాభాల్నినమోదు చేసుకున్నాయి.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో డీఎల్ఎఫ్ అత్యధికంగా 6.72 శాతం నష్టపోగా, సిప్లా, టాటా మోటార్స్, హిండాల్కో, టాటా స్టీల్ కంపెనీలు 3 శాతానికి పైగా నష్టాల్నినమోదు చేసుకున్నాయి. హెచ్ సీఎల్ టెక్, ఎన్ టీపీసీ, విప్రో, టెక్ మహీంద్ర, హెచ్ యూఎల్ కంపెనీలు స్వల్ప లాభాలతో ముగిసాయి.