26 వేల మార్కుపైన సెన్సెక్స్!
మెటల్, ఆయిల్, గ్యాస్, ఇన్ ఫ్రా, కన్స్యూమర్ డ్యురబుల్స్ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో...
హైదరాబాద్: మెటల్, ఆయిల్, గ్యాస్, ఇన్ ఫ్రా, కన్స్యూమర్ డ్యురబుల్స్ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ లాభాలతో ముగిసాయి. 26 వేల మార్కుపైనా సెన్సెక్స్ ముగిసింది. మంగళవారం ట్రేడింగ్ లో 310 పాయింట్ల లాభపడి 26025 పాయింట్ల వద్ద, నిఫ్టీ 84 పాయింట్ల వృద్దితో 7767 వద్ద ముగిసింది.
ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 26,050 గరిష్ట స్థాయిని, 25,780 కనిష్టస్థాయిని... నిఫ్టీ 7,773 గరిష్టస్థాయిని, 7,704 కనిష్టస్థాయిని నమోదు చేసుకుంది.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో భారతీ ఎయిర్ టెల్ అత్యధికంగా 5.03, రిలయన్స్ 3.34, హెచ్ డీఎఫ్ సీ 3.04, టీసీఎస్ 2.79, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2.63 శాతం లాభపడ్డాయి. మారుతి సుజుకీ, లార్సెన్, పీఎన్ బీ, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఎం అండ్ ఎం కంపెనీలు స్వల్ప నష్టాలతో నమోదు చేసుకున్నాయి.