గరిష్ట స్థాయి వద్ద సెన్సెక్స్, నిఫ్టీల ట్రేడింగ్!
ముంబై: ఆగస్టు నెల డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు రోజున భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సరికొత్త జీవితకాలపు గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. గురువారం నాటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 26,674 పాయింట్ల, నిఫ్టీ 7,967 పాయింట్ల లైఫ్ టైమ్ హైని తాకాయి.
ప్రస్తుతం సెన్సెక్స్ 64 పాయింట్ల లాభంతో 26624 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల పెరిగి 7954 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, గెయిల్, ఐడీఎఫ్ సీ, టాటా మోటార్స్ కంపెనీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డీఎల్ఎఫ్, జిందాల్ స్టీల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్ బీ, ఎస్ బీఐ కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.