8100 పైన ముగిసిన నిఫ్టీ!
ఐటీ, మీడియా, టెక్నాలజీ, ఆటో రంగాల కంపెనీల షేర్లు రాణించడంతో స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మరోసారి జీవితకాలపు గరిష్టస్థాయి వద్ద ముగిసాయి. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ప్రధాన సూచీల్లో నిఫ్టీ 8100 పైన ముగియడం ఇదే తొలిసారి.
బుధవారం నాటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 120 పాయింట్ల వృద్ధితో 27139 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో నిఫ్టీ 8114 వద్ద ముగిసింది.
కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, విప్రో, టీసీఎస్ కంపెనీలు సుమారు మూడు శాతం లాభపడగా, గెయిల్, ఓఎన్ జీసీ, ఐటీసీ, బజాజ్ ఆటో, భెల్ కంపెనీలు స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకుంది.