నూతన గరిష్టస్థాయికి సెన్సెక్స్!
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలత, కాపిటల్ గూడ్స్, ఆటో, బ్యాంకింగ్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ కంపెనీల షేర్లలో భారీ కొనుగోళ్ల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు రికార్డు స్థాయి లాభాలతో ముగిసాయి.
శుక్రవారం నాటి మార్కెట్ లో 27439 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్...ఇంట్రాడే ట్రేడింగ్ లో 27894 గరిష్టస్థాయిని నమోదు చేసుకుంది. చివరకు 519 పాయింట్ల లాభంతో 27865 పాయింట్ల వద్ద ముగిసింది. మరో ప్రధాన సూచీ నిఫ్టీ 153 పాయింట్ల వృద్ధితో 8922 పాయింట్ల క్లోజైంది.
సూచీ ఆథారిత కంపెనీ షేర్లలో ఐడీఎఫ్ సీ అత్యధికంగా 5.43 శాతం, హెచ్ డీఎఫ్ సీ, 3.87, లార్సెన్ 3.91, గెయిల్ 3.55, టాటా పవర్ 3.53 శాతం లాభాల్ని నమోదు చేసుకున్నాయి. భారతీ ఎయిర్ టెల్, జీ ఎంటర్ టైన్ మెంట్ స్వల్ప నష్టాలతో ముగిసాయి.