లాభాల్లో సెన్సెక్స్!
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా మూడోరోజు కూడా లాభాల్లో నడిచాయి.
రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, టీసీఎస్, బజాజ్ ఆటో త్రైమాసిక ఫలితాలు, గ్లోబల్ మార్కెట్లలో సానుకూల పవనాలు భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలను వరుసగా మూడోరోజు కూడా లాభాల్లో నడిపించాయి.
ఆరంభంలో సెన్సెక్స్ 60 పాయింట్ల లాభపడింది. నిన్నటి ముగింపుకు నిఫ్టీ సూచీ 16 పాయింట్ల వృద్దితో 7640 వద్దకు చేరుకుంది. టీసీఎస్, బజాజ్ ఆటో కంపెనీల ఫలితాలు మార్కెట్ పై సానుకూల ప్రభావం చూపే అవకాశ ముందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో జిందాల్ స్టీల్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, సెసా స్టెరిలైట్, లుపిన్ కంపెనీలు లాభాల్లో.. ఎంఎం, ఐడీఎఫ్ సీ, ఓఎన్ జీసీ, ఎస్ బీఐ, బీపీసీఎల్ కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
బ్యాంకర్లు, దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ ఏర్పడటంతో రూపాయి 2 పైసలు నష్టపోయి 60.17 వద్ద ట్రేడ్ అవుతోంది.