స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్!
ముంబై: ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు గురువారం స్వల్ప నష్టాలతో ముగిసాయి. ప్రధాన సూచీలు సెన్సెక్స్ 54 పాయింట్ల నష్టంతో 27085 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు క్షీణించి 8095 వద్ద ముగిసాయి.
బజాజ్ ఆటో, హీరో మోటార్ కార్ప్, ఎన్ టీపీసీ, హెచ్ డీఎఫ్ సీ, పవర్ గ్రిడ్ కార్పో కంపెనీల షేర్లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. డీఎల్ఎఫ్ 8 శాతానికి పైగా, భెల్, జిందాల్ స్టీల్, టాటా స్టీల్, హిండాల్కో కంపెనీలు 3 శాతానికి పైగా నష్టపోయాయి.