లాభాలతో పరుగులు పెట్టిన సెన్సెక్స్!
కాపిటల్ గూడ్స్, బ్యాంక్, మెటల్ రంగాల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో నాలుగు రోజుల నష్టాలకు తెరదించుతూ స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ లాభాలతో ముగిసాయి.
నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 337 పాయింట్ల లాభంతో 25368 వద్ద, నిఫ్టీ 86 పాయింట్ల వృద్ధితో 7580 పాయింట్ల వద్ద ముగిసాయి.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో బీపీసీఎల్, గెయిల్, డీఎల్ఎఫ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎన్ ఎమ్ డీసీ కంపెనీలు భారీగా సుమారు 4 శాతం లాభపడ్డాయి.
కొటాక్ మహీంద్ర, సన్ ఫార్మా, ఇన్పోసిస్, కెయిర్న్ ఇండియా, టెక్ మహీంద్ర కంపెనీలు స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.