లాభాలతో ముగిసిన సెన్సెక్స్!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాలతో ముగిసాయి. గత మూడు రోజులుగా నష్టాలకు గురవుతున్న సూచీలు లాభాలతో ముగియడం ఇన్వెస్టర్లకు కొంత ఊరట కలిగించింది.
బ్లూచిప్ కంపెనీల షేర్లు ఎస్ బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హిండాల్కో, టాటా స్టీల్, సన్ ఫార్మా కంపెనీలు షేర్లు లాభాల బాట పట్టడంతో ప్రధాన సూచీలు సెన్సెక్స్ 157 పాయింట్ల లాభంతో 26626 వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల వృద్ధితో 7968 వద్ద ముగిసాయి.
ప్రధాన సూచీలు హిండాల్కో, జిందాల్ స్టీల్, డీఎల్ఎఫ్, ఎన్ ఎమ్ డీసీ, సన్ ఫార్మా కంపెనీల షేర్లు 4 శాతానికి పైగా లాభాలతో ముగిసాయి. డాక్టర్ రెడ్డీస్, గెయిల్, హెచ్ డీఎఫ్ సీ, ఐటీసీ, హీరో మోటోకార్ప్ కంపెనీలు నష్టాలతో ముగిసాయి.