ఐదు వారాల గరిష్టానికి సెన్సెక్స్! | Sensex closes above 27k mark | Sakshi
Sakshi News home page

ఐదు వారాల గరిష్టానికి సెన్సెక్స్!

Published Wed, Oct 29 2014 5:04 PM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM

ఐదు వారాల గరిష్టానికి సెన్సెక్స్!

ఐదు వారాల గరిష్టానికి సెన్సెక్స్!

యూఎస్ ఫెడరల్ రిజర్వు పాలసీ సమావేశానికి ముందు గ్లోబల్ మార్కెట్ల సానుకూల స్పందన, మరికొన్ని సంస్కరణలు మోడీ సర్కారు చేపట్టవచ్చనే వార్తల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు కూడా పరుగులు పెట్టాయి

ముంబై: యూఎస్ ఫెడరల్ రిజర్వు పాలసీ సమావేశానికి ముందు గ్లోబల్ మార్కెట్ల సానుకూల స్పందన, మరికొన్ని సంస్కరణలు మోడీ సర్కారు చేపట్టవచ్చనే వార్తల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు కూడా పరుగులు పెట్టాయి. 
 
ప్రధాన సూచీ సెన్సెక్స్ ఐదు వారాల గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. బుధవారం నాటి మార్కెట్ లో సెన్సెక్స్ 217 పాయింట్ల లాభంతో 27098 పాయింట్ల వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల వృద్ధితో 8090 పాయింట్ల వద్ద ముగిసాయి. 
 
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో హిండాల్కో, డీఎల్ఎఫ్ అత్యధికంగా 6 శాతానికి పైగా, టాటా స్టీల్, జిందాల్ స్టీల్ 4 శాతానికి పైగా, టాటా మోటార్స్ 3.45 శాతం లాభపడ్డాయి. పీఎన్ బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, ఎన్ టీపీసీ, సన్ ఫార్మాలు స్వల్పంగా నష్టపోయాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement