మూడో రోజు కూడా నష్టాల్లోనే..
హైదరాబాద్: అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో రూపాయి బలహీనపడటం, ఆసియా మార్కెట్లలో మిశ్రమ స్పందన, ఫండ్స్ అమ్మకాలు జరపడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి.
మంగళవారం 51 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ ఆరంభమైంది. ఆతర్వాత స్వల్ప ఒడిదుడుకులకు లోనైన సూచీలు మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 60 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 15 పాయింట్లు కోల్పోయి 7519 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
సూచీ అధారిత కంపెనీ షేర్లలో హెచ్ సీఎల్ టెక్ 2.91 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.90, అల్ట్రా టెక్ సిమెంట్స్ 1.69, భారతీ ఎయిర్ టెల్ 1.62, ఓఎన్ జీసీ 1.39 మేరకు లాభాల్లో కొనసాగుతుండగా, డీఎల్ఎఫ్ 2.97, హిండాల్కో 2.39, జిందాల్ స్టీల్ 2.23, ఎం అండ్ ఎం 2.15, టాటా పవర్ 1.85 శాతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.