సెన్సెక్స్ రాకెట్ స్పీడ్...467 పాయింట్ల లాభం!
సెన్సెక్స్ రాకెట్ స్పీడ్...467 పాయింట్ల లాభం!
Published Fri, Oct 18 2013 3:56 PM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM
డాలర్ కు వ్యతిరేకంగా రూపాయి రెండు నెలల గరిష్టస్థాయిని చేరుకోవడం, బ్యాంక్, మెటల్, కాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్, ఆటో మొబైల్ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిసాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడింది. సెన్సెక్స్ 20,486.78 ప్రారంభమై.. ఓ దశలో 20,932.23 పాయింట్లకు చేరుకుంది. చివరకు 467 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 20882 వద్ద ముగిసింది. క్రితం ముగింపుకు నిఫ్టీ 143 పాయింట్లు లాభపడి 6189 పాయింట్ల వద్ద క్లోజైంది.
ఇండెక్స్ షేర్లలో ఇండస్ ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 6.3 శాతం, టాటా స్టీల్ 6 శాతం, సెసా స్టెర్ లైట్ 5.81 శాతం, యాక్సిస్ బ్యాంక్ 5.46, జయప్రకాశ్ అసోసియేట్స్ 5.14 శాతం వృద్ధిని సాధించాయి. బజాజ్ ఆటో స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకుంది.
అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో డాలర్ కు వ్యతిరేకంగా ప్రస్తుతం 61.22 వద్ద ట్రేడ్ అవుతోంది. ట్రేడింగ్ ఆరంభంలో రూపాయి రెండు నెలల గరిష్ట స్థాయి 60.92 స్థాయిని నమోదు చేసుకుంది.
Advertisement