స్వల్పంగా క్షీణించిన రూపాయి, నష్టాల్లో సెన్సెక్స్!
అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో డాలర్ కు వ్యతిరేకంగా రూపాయి 23 పైసలు క్షీణించి 63.61 వద్ద ట్రేడ్ అవుతోంది. గురువారం మార్కెట్ ఆరంభంలో 43 పైసలు లాభపడి 62.95 విలువను నమోదు చేసుకుంది. గత ఐదు సెషన్లలో 6.28 శాతంతో 425 పైసల లాభాన్ని ఆర్టించింది. బుధవారం 46 పైసలు బలపడిన రూపాయి 63.38 వద్ద ముగిసింది.
అయితే గత ఐదు సెషన్లలో లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ లో గురువారం ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడటంతో సెన్సెక్స్ 142 పాయింట్లు నష్టపోయి 19854 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు కోల్పోయి 5872 వద్ద ట్రేడ్ అవుతోంది.
విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు రిజర్వు బ్యాంక్ అనుమతించడంతో ఐడీఎఫ్ సీ కంపెనీ షేర్లు 7 శాతానికి పైగా వృద్ధి చెందగా, టాటా పవర్ 6.86 శాతం, రాన్ బాక్సీ లాబ్స్, డీఎల్ఎఫ్, గెయిల్ కంపెనీలు 2 శాతానికి పైగా లాభపడగా, జయప్రకాశ్ అసోసియేట్స్, అంబుజా సిమెంట్స్, హీరో మోటో కార్ప్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఓఎన్ జీసీ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.