నష్టాలతో కొనసాగుతున్న సెన్సెక్స్, రూపాయి
నష్టాలతో కొనసాగుతున్న సెన్సెక్స్, రూపాయి
Published Mon, Oct 7 2013 11:13 AM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 194 పాయింట్ల నష్టంతో 19721 పాయింట్ల వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు కోల్పోయి 5848 వద్ద కొనసాగుతున్నాయి.
దిగుమతిదారుల నుంచి యూఎస్ కరెన్సీకి డిమాండ్ పెరగడంతో ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్సెంజ్ వద్ద డాలర్ తో పోల్చితే రూపాయి 21 పైసలు నష్టపోయి 61.65 వద్ద కొనసాగుతోంది. యూఎస్ షట్ డౌన్ ప్రభావంతో శుక్రవారం రూపాయి ఏడు వారాల గరిష్టస్థాయికి చేరుకుని 61.44 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
'యూఎస్ షట్ డౌన్' తో గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలత కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో సెన్సెక్స్ ఆరంభంలో 202 పాయింట్లు కోల్పోయింది. గత మూడు సెషన్లలో సెన్సెక్స్ 536 పాయింట్ల లాభాన్ని కూడగట్టుకున్న సంగతి తెలిసిందే.
ఆయిల్, గ్యాస్, పీఎస్ యూ, ఆటో, కాపిటల్ గూడ్స్ రంగాల కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్ అత్యధికంగా 3.47 శాతం, హెచ్ డీఎఫ్ సీ 3 శాతం, యాక్సీస్ బ్యాంక్ 2.56 శాతం, ఎన్ ఎమ్ డీసీ 2.42, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.40 శాతంతో నష్టాల్లో కొనసాగుతున్నాయి. హెచ్ సీఎల్ టెక్, టాటా స్టీల్, లుపిన్, రాన్ బాక్సీ, జిందాల్ స్టీల్ కంపెనీలు లాభాల్ని నమోదు చేసుకున్నాయి.
Advertisement